ఇమామ్ హుసైన్[అ.స] షహాదత్ పై ఆయిషహ్[ర.అ] రివాయత్

మంగళ, 10/30/2018 - 03:47

ఇమామ్ హుసైన్[అ.స] షహాదత్ పై దైవప్రవక్త[స.అ] రివాయత్ ను ఆయిషహ్[ర.అ] ఉల్లేఖించారు.

ఇమామ్ హుసైన్[అ.స] షహాదత్ పై ఆయిషహ్[ర.అ] రివాయత్

జనాబె ఆయిషా ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] పై దైవవాణి అవతరించబడే సమయంలో హుసైన్ వారి సన్నిధికి వచ్చి వారి పై పడి, వీపు పై ఎక్కారు. జిబ్రయీల్ ఇలా అన్నారు: యా రసూలల్లాహ్!  మీరు వీరిని ఇష్టపడతారా? నా కుమారుని ఎందుకని ఇష్టపడను!  అని అన్నారు.  జిబ్రయీల్ “మీ ఉమ్మత్ వారు మీ తరువాత వారిని హతమారుస్తారు” అని చేప్పి తన చేయిని ముందుకు చాచి తెల్లటి మట్టిని వారికి ఇచ్చి ఇలా అన్నారు: “ఈ నేల పై మీ కుమారుడు హతమార్చబడతాడు మరి ఆ భూమి పేరు ‘తఫ్ఫ్’. జిబ్రయీల్ దైవప్రవక్త[స.అ] వద్ద నుండి వెళ్ళిపోయారు. దైవప్రవక్త[స.అ] ఇంటి నుండి బయటకు వచ్చారు అప్పుడు వారి చేతిలో ఆ మట్టిని పట్టుకొని రోధిస్తూ ఇలా అన్నారు: “ఆయిషా! నా ఉమ్మత్ వారు నా తరువాత కుమారుడు హుసైన్ ను ‘తఫ్ఫ్’ భూమి పై హతమారుస్తారు అని జిబ్రయీల్ నాకు తెలియపరిచారు”. ఆ తరువాత రోధిస్తూనే తన సహచరుల వద్దకు వెళ్ళారు. వారు “యా రసూలల్లాహ్! మీరు ఎందుకు రోధిస్తున్నారు?” అని అడిగారు. దైవప్రవక్త[స.అ] “నా తరువాత నా కుమారుడు ‘తఫ్ఫ్’ నేల పై హతమార్చబడతాడు అని జిబ్రయీన్ నాకు ఈ మట్టిని ఇచ్చి అక్కడే సమాధి చేయబడతారు అని తెలియపరిచారు” అని అన్నారు.[మజ్మఉ అల్ జవాయిద్, భాగం9, పేజీ187].

రిఫ్రెన్స్
మజ్మఉ అల్ జవాయిద్, భాగం9, పేజీ187, దావూదె ఇల్హామీ తన పుస్తకం ఇమామానె అహ్లెబైత్[అ.స] దర్ గుఫ్తారె అహ్లె సున్నత్ లో ఉల్లేఖించారు.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24