అర్బయీన్ పాదయాత్ర

మంగళ, 10/16/2018 - 06:43

ఇమామ్ హుసైన్[అ.స] యొక్క అర్బయీన్ పాదయాత్ర యొక్క పుణ్యాన్ని వివరిస్తున్న ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] హదీస్.

అర్బయీన్ పాదయాత్ర

ఇంతకు ముందు ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన ఏదైనా విషయం ప్రపంచానికి చెప్పాలనుకుంటే అతను దైవప్రవక్త[అ.స] యొక్క మనవడు అని ముందుగా పరిచయించి ఆ తరువాత వారి గురించి చెప్పాల్సివచ్చేది కాని అల్ హందు లిల్లాహ్ ఈ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి ఇమామ్ హుసైన్[అ.స] ఎవరో తెలిసొచ్చింది అందుకు చాలా కారణాలున్నాయి; వాటి నుండి ముఖ్య కారణం ఇమామ్ హుసైన్[అ.స] గారి అర్బయీన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వారిని ఇష్టపడే వారు నజఫ్ నుండి కర్బలా వరకు పాదయాత్ర చేయడం. మరి ఆ పాదయాత్ర చేసే వారికి ప్రసాదించబడే పుణ్యం గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా వివరిస్తున్నారు: “కాలినడకతో ఇమామ్ హుసైన్[అ.స] జియారత్ దర్శనానికి వెళ్ళేవారి ప్రతీ అడుగు పై వారి కోసం అల్లాహ్ ఒక పుణ్యం వ్రాసి, ఒక పాపాన్ని తుడిచేస్తాడు, అతడి స్థానాన్ని పెంచుతాడు. జియారత్ చేయడానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ రెండు దూతలను అతడి కోసం, అతడి నోరు నుండి వచ్చే చెడును కాకుండా కేవలం మంచినే వ్రాయడానికి నియమిస్తాడు. మరి తిరిగి వచ్చే సమయంలో అతడిని సాగనంపుతూ ఇలా అంటారు: “ఓ అల్లాహ్ యొక్క వలీ! నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు ఇప్పుడు అల్లాహ్ సైన్యానికి చెందినవాడవు, ఆయన ప్రవక్త[స.అ] సైన్యానికి చెందినవాడవు, అతని అహ్లెబైత్[అ.స] సైన్యానికి చెందినవాడవు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాము! ఎట్టిపరిస్థితిలో నీవు కళ్ళతో అగ్ని(నరకం)ని చూడవు అలాగే అగ్ని కూడా నిన్ను చూడలేదు మరియు నిన్ను తన ఆహరంగా చేసుకోలేదు.[కామిలుజ్జియారాత్, పేజీ134].
ఈ హదీస్ మనకు చాలా విషయాలను చెబుతుంది. దానిని గ్రహించడానికి ప్రయత్నించండి.

రిఫ్రెన్స్
ఇబ్నె ఖూలవైహ్, కామిలుజ్జియారాత్, నాషిర్ అల్ మత్బఅతుల్ ముబారకతుల్ ముర్తజవియహ్, నజఫ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Sha Abbas on

Mashaallah Moulana....Khuda hum sab ko Arbaeen Karbala me manane ki toufiqh ata kare

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24