దైవప్రవక్త[అ.స] యొక్క 11వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] జీవిత చరిత్ర సంక్షిప్తంగా.
ఇమామ్ హసన్ అస్కరీ, దైవప్రవక్త[అ.స] యొక్క 11వ ఉత్తరాధికారి. వారి కున్నియత్ “అబూ ముహమ్మద్”. వారు హిజ్రీ యొక్క 232 సంవత్సరంలో జన్మించారు. వారి తండ్రి గారు ఇమామ్ అలీ నఖీ[అ.స]ను అప్పటి ఖలీఫా “సామర్రా”ను రమ్మని పిలిచినపుడు వారు కూడా తన తండ్రితో పాటు కలిసి ఆ పట్టనానికి వెళ్ళారు, మరి చివరి వరకు అక్కడే అబ్బాసీ ఖలీఫాల పర్యవేక్షణలో ఉన్నారు. వారి పూర్తి జీవితకాలంలో ఆరు గురు అబ్బాసీ ఖలీఫాలు “ముతవక్కిల్” “ముంతసిర్” “ముస్తయీన్” “ముఅతజ్” “ముహ్తదీ” మరియు “ముఅతమద్” పరిపాలించారు. 28 సంవత్సరాల వయసులో 6 సంవత్సరాల ఇమామత్ పదవి తరువాత హిజ్రీ యొక్క 260వ సంవత్సరంలో “ముఅతమద్” ఆజ్ఞానుసారం విషప్రయోగం ద్వార హతమార్చబడ్డారు. అదే పట్టణం అనగా సామరహ్ లో వారి తండ్రి గారి సమాధి ప్రక్కనే వారిని సమాధి చేశారు. వారి జీవిత కాలం ఇస్లాం రక్షణ మరియు శిష్యుల శిక్షణలో గడిచింది. వారికి ఒక కుమారుడు జన్మించారు వారే ఇమామ్ మహ్దీ[అ.స]. వారు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. షియా ముస్లిముల వారి రాకకు ఎదురు చూస్తున్నారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ178]
రిఫ్రెన్స్
మహ్దీ పీష్వాయి, సీమాయే పీష్వాయాన్, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యలు
Masha allah
Shukriya... Jazkallah.
Mashallah bahut khoob
Shukriya... Jazkallah.. Iltemase dua.
Shukriya..
Jazakallah
Shukriya... Iltemase dua
Mashallah,
Jazakallah
Shukriya... Iltemase dua.
వ్యాఖ్యానించండి