హజ్రత్ ఇస్రాఫీల్[అ.స]

బుధ, 12/05/2018 - 20:27

హజ్రత్ ఇస్రాఫీల్[అ.స] యొక్క కర్తవ్యం మరియు వారి సూర్ ఊదడం గురించి సంక్షిప్త వివరణ.

హజ్రత్ ఇస్రాఫీల్[అ.స]

సుర్యానీ భాషలో “ఇస్రాఫీల్” యొక్క అర్థం “అల్లాహ్ దాసుడు”. కొన్ని రివాయతుల ప్రకారం హజ్రత్ ఇస్రాఫీల్[అ.స] అల్లాహ్ యొక్క గొప్ప దూతలలో ఒకరు అని తెలుస్తుంది. హజ్రత్ ఆదమ్[అ.స]కు అందరికన్నా ముందు సాష్టాంగం చేసిన దూత ఇతను. అతని పని “సూర్”(శంఖం)ను ఊదడం. ఆ సూర్ శబ్ధంతో భూమి పై ఉన్న సృష్టితాన్నీ మరణిస్తాయి. వారి “జీవమరణ సూర్” బాధ్యతతోనే వారి గొప్పతనం తెలిసుకోవచ్చు. ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ఉల్లేఖనం ప్రకారం; “మరణ శంఖం ఊదే పనిని ఇస్రాఫీల్ అమలు పరుస్తారు ఆ తరువాత వారు కూడా మరణిస్తారు అప్పుడు అల్లాహ్ మరలా సృష్టితాలను ప్రాణం పోస్తాడు”
“సూర్” నిఘంటువు ప్రకారం “కొమ్ము” అని అర్థం. కాని ఆ పదాన్ని శంఖం ఊదడం కోసం కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా అది సైన్యం ఆగడానికి మరియు ప్రయాణించడానికి ఊదుతూ ఉంటారు. శంఖం ఊదబడే యదార్థం గురించి ఖుర్ఆన్ లో 10 సార్లు వచ్చింది. ఉదాహారణఛ “శంఖం ఊదబడే రోజున, అధికారమంతా అల్లాహ్ దే అవుతుంది”[అన్ఆమ్:73]. మరో చోట ఇలా ఉంది: “మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు”[జుమర్:68]. [ఫరిష్తగాన్, పేజీ101].

రిఫ్రెన్స్
అలీరిజా రిజాలీ తెహ్రానీ, ఫరిష్తగాన్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14