హజ్రత్ మీకాయీల్[అ.స]

బుధ, 12/05/2018 - 20:22

హజ్రత్ మీకాయీల్[అ.స] యొక్క కర్తవ్యం మరియు వారిని అనుసరించని వారి గురించి ఖుర్ఆన్ సూచన.

హజ్రత్ మీకాయీల్[అ.స]

అల్లాహ్ యొక్క నాలుగు ప్రముఖ దూతలలో ఒకరు హజ్రత్ మీకాయీల్[అ.స]. ఖుర్ఆన్ యొక్క సురయే బఖరహ్ 98వ ఆయత్ లో హజ్రత్ మీకాయీల్ పేరు “మీకాల్” అని ఉంది. ఈ ఆయత్ లో వారితో వైరాన్ని అల్లాహ్, దైవదూతల మరియు ప్రవక్తల పట్ల వైరంతో సమానంగా భావించబడుతుంది మరియు అతని పట్ల వైరంగల వారిని అవిశ్వాసునిగా నిర్ధారించడం జరిగింది. హజ్రత్ మీకాయీల్[అ.స] పని సృష్టితాలకు వారి వారి భాగం మరియు భాగ్యాన్ని ఇచ్చే పని. దైవప్రవక్త[స.అ] యొక్క రివాయత్ ప్రకారం: మీకాయీల్ యొక్క పేరు ఉబైదుల్లాహ్.
అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇలా ప్రవచించారు: “జిబ్రయీల్ ఆకాశ్యాల యొక్క ముఅజ్జిన్ మరియు మీకాయీల్ వాటికి ఇమామ్ గా నిర్వహిస్తారు, బైతుల్ మామూర్ లో వారిని అనుసరిస్తారు. ఇమామత్ యొక్క స్థానం చాలా గొప్ప స్థానం దానికి గొప్పవారే అర్హులు”
బఖరహ్ యొక్క 98వ ఆయత్ అవతరణకు కారణం గురించి ఇలా ఉల్లేఖించబడి ఉంది.. ఇబ్నె సూరియా మరియు యూదులలో కొంతమంది, దైవప్రవక్త[అ.స]తో దైవవాణి తీసుకొచ్చే దూత పేరును అడిగారు. దైవప్రవక్త[స.అ] “అతని పేరు జిబ్రయీల్” అని సమాధానమిచ్చారు. ఇబ్నె సూరియా సరైన జవాబు పొందాడు కాని ఇస్లాం స్వీకరణ ఇష్టం లేక ఇలా అన్నాడు: జిబ్రయీల్ మా శత్రువు! అతను నిరంతరం జిహాద్, కష్టాలు మరియు ఆపదల ఆదేశాలు తీసుకొని వస్తారు, కాని “మీకాయీల్” ఎల్లప్పుడూ సులభమైన ఆదేశాలను తీసుకొని వస్తారు, ఒకవేళ దైవవాణి దూత మీకాయీల్ అయి ఉంటే మేమూ విశ్వసులుగా మారేవారము. అప్పుడు ఈ ఆయత్ “ఈ ఉమ్మత్ నెపము వెదుకుతూ ఉంటుంది, వారు ఏమాత్రం విశ్వసించరు” అని అవతరించబడింది.[ఫరిష్తగాన్, పేజీ101].

రిఫ్రెన్స్

అలీరిజా రిజాలీ తెహ్రానీ, ఫరిష్తగాన్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9