షఖ్ఖుల్ ఖమర్

గురు, 12/13/2018 - 06:40

షఖ్ఖుల్ ఖమర్ అరబీ పదం ఇది చంద్రుడ్ని రెండు ముక్కలుగా చేసిన దైవప్రవక్త(స.అ) యొక్క అద్భుతకృత్యమును సూచిస్తుంది.

షఖ్ఖుల్ ఖమర్

షఖ్ఖుల్ ఖమర్, షఖ్ అనగా పగలడం, బీట అనే అర్ధాలు వస్తాయి. ఖమర్ అనగా చంద్రుడు. “షఖ్ఖుల్ ఖమర్” అనగా చందుడు మధ్యలో బీట ఏర్పడి రెండు ముక్కలుగా అవ్వడం. ఇది దైవప్రవక్త[అ.స] యొక్క అద్భుతకృత్యములలో ఒకటి.
ఉలమాలు అనగా “ౙమఖ్షరీ” తన గ్రంథం “కష్షాఫ్”లో, “తబర్సీ” తన గ్రంథం “మజ్ముఅల్ బయాన్”లో, “ఫఖ్రె రాజీ” తన గ్రంథం “మఫాతీహుల్ గైబ్”లో మరియు “ఇబ్నె మస్ఊద్” తన “తఫ్సీర్” గ్రంథంలో “షఖ్ఖుల్ ఖమర్” సంఘటన గురించి ఇలా ఉల్లేఖించారు: ఖురైష్ యొక్క మష్రికులు దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి వారితో వారి దౌత్యం పై నిదర్శనంగా చంద్రుడ్ని రెండు ముక్కలుగా చేయని కోరారు. దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: నేను అలా చేస్తే మీరు విశ్వాసులుగా మారుతారా? అందుకు కలిసికట్టుగా “అవును!” అన్నారు. దైవప్రవక్త[స.అ] అల్లాహ్ తో వారి కోరికను తీర్చమని కోరారు. అప్పుడు దైవప్రవక్త[స.అ] తన చేతివ్రేలును చంద్రుడి వైపు పెట్టి సైగు చేశారు దాంతో చంద్రుడు రెండు ముక్కలయ్యింది. వారితో ఇలా అన్నారు: “మీరే సాక్ష్యులు”.[మన్షూరె జావీద్, భాగం7, పేజీ209].
కాని వారు ఇది ఇంద్రజాలం, మంత్రతంత్రం అని అంటారు అని అల్లాహ్ అన్నాడు. దీని ప్రస్తావనం ఖుర్ఆన్ లో ఖమర్ సూరహ్ మొదటి రెండు ఆయతులలో ఉంది.

రిఫ్రెన్స్
జాఫర్ సబ్హానీ, మన్షూరె జావీద్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26