మర్వాన్ ఇబ్నె హకమ్

ఆది, 01/27/2019 - 18:01

మర్వాన్ ఇబ్నె హకమ్ యొక్క స్వభావం గురించి చరిత్ర గ్రంథాల ఆధారంగా కొన్ని విషయాలు సంక్షిప్తంగా.

మర్వాన్ ఇబ్నె హకమ్

మర్వాన్ ఇబ్నె హకమ్, ఉస్మాన్ ఇబ్నె అఫాన్ యొక్క పిన తండ్రి కుమారుడూ మరియు అల్లుడూ. దైవప్రవక్త[స.అ] అహ్లెబైత్ యొక్క బద్దశత్రువులలో ఒకడు. వారి పట్ల శత్రుత్వం వహించే మార్గంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు. మర్వాన్ చాలా చాలా నిఛుడు మరియు అతి దుర్మార్గుడప అందుకనే అతడిని “ఖైతు బాతిల్” అని నామకరించారు. షామ్(డమస్కస్) ప్రజలు మర్వాన్ ఇబ్నె హకమ్ తో బైఅత్ చేసినప్పుడు అతడి సోదరుడు “అబ్దుల్ రహ్మాన్” చాలా క్షోభతో ఇలా అన్నాడు:
لحا اللہ قومًا أمرُوا خیط باطل
علی الناسِ یُعطی مایشاءُ و یمنعُ
"ఎవరిని పడితే వాడికి ఇచ్చే మరియు ఎవరిని పడితే వాడిని ఆపివేసేవాడు(అనగా ఇష్టవచ్చినట్లు ప్రవర్తించేవాడు) అయిన మర్వాన్ ను నాయకుడిగా ఎన్నుకున్న ప్రజల ముఖాన్ని అసహ్యకరముగా చేయుగాక".
మర్వాన్, ముఆవియా తరపు నుండి హిజ్రీ యొక్క 48వ సంవత్సరం వరకు మక్కా, మదీనా మరియు తాయిఫ్ పట్టణాల పై నాయకత్వం వహించాడు, కానీ తరువాత అతడిని అధికారం నుండి తొలగించాడు. ముఆవియా మరణాంతరం మరలా షామ్ కు చెందిన కొంతమంది ప్రజలు అతడితో బైఅత్ చేశారు ఇంచుమించు 10 నెలల పాటు మరలా అధికారంలో వచ్చాడు. అతడి మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్ యొక్క బైఅత్ కోసం వచ్చిన “జహాక్ ఇబ్నె ఖైస్ ఫహ్రీ” మధ్య యుద్ధం జరిగింది. చివరికి “జహాక్” హతమార్చబడ్డాడు. అలా షామ్ మరియు మిస్ర్ యొక్క అధికారం మర్వాన్ సొంతమయ్యింది.[నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, పేజీ139-141]

రిఫ్రెన్స్
నజరీ మున్ఫరిద్, నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, బున్యాదె మఆరిపె ఇస్లామీ, ఖుమ్, 1381ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23