మరణం ఆసన్నమయ్యే సమయాన్ని గుర్తుంచుకో!

ఆది, 02/17/2019 - 17:15

ఎవరైతే తమ మ్రుత్యువును గుర్తుంచుకుంటారో వారు ఎప్పుడూ పాపాల పట్ల నిర్లక్ష్యం వహించరు.  

మరణం ఆసన్నమయ్యే సమయాన్ని గుర్తుంచుకో!

ఇమాం జవాద్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “మరణం ఆసన్నమయ్యే సమయాన్ని గుర్తుచేసుకో నీ వాళ్ళ ముందు నువ్వు నీ తుదిశ్వాసను విడవటాన్ని(గుర్తుచేసుకో!), ఆ సమయంలో నీ ప్రాణాలను రక్షించుటకు వైద్యుడు ఉండడు మరియు నీకు సహాయపడేందుకు నీ స్నేహితుడూ ఉండడు”[బిహారుల్ అన్వార్,75వ భాగం,పేజీ నం:370].
మనవుడు చేసే పాపాలకు కారణం అతను వాటి పట్ల వహించే నిర్లక్ష్యం, చిన్న చిన్న పాపాల పట్ల నిర్లక్ష్యం పెద్ద పాపాలకు దారి తీస్తుంది, ఆ నిర్లక్ష్యాన్ని దూరం చేసే పనులలో ఒకటి మానవుడు తన మరణాన్ని గుర్తుచేసుకోవడం తద్వారా అతను ఆ పాపాల నుండి దూరంగా ఉండగలడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతీ ప్రాణికి మరణమనేది తప్పదు మరియు ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు,మానవుడూ జీవించేది కొద్దిపాటి జీవితమే తరువాత అతను ఆ దేవుని సన్నిధికి తరలిపోవటమనేది యదార్ధం,ఈ లోకంలో నివసించే మనిషి పేదవాడైనా, ధనవంతుడైనా, వందేళ్ళు బ్రతికిన వాడైనా,పుట్టిన పసికందైనా ఆ దేవుని తరుపు నుండి పిలుపు వస్తే వెళ్ళక తప్పదు మరియూ ఆ మరణాన్ని ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు. అలాంటి ఆ మరణాన్ని గుర్తు చేసుకోవటం ద్వారా మనిషి పాపాలకు దూరంగా ఉండి తన పరలోక ప్రయాణానికి తనను తాను సిధ్ధం చేసుకొని దానికి కావలసిన సామాగ్రిని సిధ్ధం చేసుకోవడంలోనే అతని క్షేమము ఉన్నది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21