నమాజె తహజ్జుద్

గురు, 02/21/2019 - 06:05

నమాజె షబ్ ప్రస్తావన ఖుర్ఆన్ లో ఉంది అన్న విషయం పై కొన్ని ఆయతుల నిదర్శనం.

నమాజె తహజ్జుద్

హజూద్ అనగా పడుకోవడం. తహజ్జుద్ అనగా ప్రార్ధన కోసం నిద్రను తొలగించడం(నమాజ్ కోసం రాత్రిపూట మేలుకోవడం). నమాజె తహజ్జుద్ అనగా నమాజె షబ్. ఖుర్ఆన్ లో దీని ప్రస్తావనం ఉంది.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్ (నమాజ్)లో ఖుర్ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను “మఖామె మహ్మూద్”కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు”[ఇస్రా:79].
ముజ్జమ్మిల్ సూరహ్ లో ఇలా ఉంది: “రాత్రంతా (నమాజులో) నిలబడు కొద్దిసేపు తప్ప. సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో”[ముజ్జమ్మిల్:2,3] నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది.[ముజ్జమ్మిల్:6]
(ఓ ముహమ్మద్!) నువ్వు ఒక్కోసారి మూడింట రెండువంతుల రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావనీ, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు.[ముజ్జమ్మిల్:20]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16