నిజమైన విశ్వాసుని నాలుగు లక్షణాలు

శని, 03/02/2019 - 15:15

నిజమైన విశ్వాసునికి గల నాలుగు లక్షణాలు ఇమాం సాదిఖ్[అ.స]ల వారి దృష్టిలో.

నిజమైన విశ్వాసుని నాలుగు లక్షణాలు

ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: “ఎవరి వద్దనైతే ఈ నాలుగు లక్షణాలు ఉంటాయో అతని విశ్వాసము(ఈమాన్) పరిపూర్ణమైనది ఒక వేళ అతను తల నుండి కాలి దాకా పాపములలో నిండి ఉన్నా సరే”.
1. సత్యము పలకటం: సత్యం పలికటం అల్లాహ్ దాసుల లక్షణాలలో ఒక్కటి, దైవ ఖురాన్ అల్లాహ్ దాసుల లక్షణాలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిస్తుంది: “వారు ఓర్పు వహిస్తారు,సదా సత్యమే పలుకుతారు”[ఆలి ఇమ్రాన్/17].
2. ఇతరుల అమానతులను వారికి అప్పజెప్పటం: తన వద్ద ఉంచబడిన అమానతులను(తన వద్ద కొంత కాలము ఉంచబడిన వస్తువులను) వారి యజమానులకు అప్పజెప్పటం కూడా విశ్వాసుల లక్షణాలో ఒకటి,ఎందుంకంటే అమానతులను వారి యజమానులకు అప్పగించమని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు: “ఎవరి అమానతులను వారికి అప్పగించండి,ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి”[అన్ నిసా/58].
3. సిగ్గు,బిడియం కలిగి ఉండటం: సిగ్గు మరియు బిడియం లేక పోవటం ఎన్నో సమస్యలకు కారణం ఎందుకంటే ఒక సమాజంలో సిగ్గు లజ్జలేని వానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు, కనీసం ఆ దేవుని సమక్షంలోనైన సిగ్గు మరియు బిడియాన్ని కలిగి ఉండటం విశ్వాసుని లక్షణం ఎందుకంటే మనము చేసేదంతా ఆ అల్లాహ్ కు తెలుసు, దైవ ఖురానులో అల్లాహ్ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు: “వారు దాచేది, బహిర్గత చేసేది,అంతా అల్లాహ్ కు తెలుసన్న సంగతి వారికి తెలియదా?!”[అల్ బఖర/77].
4. మంచి ఆచారాలు కలిగి ఉండటం: అల్లాహ్ దాసులు కూడా వారి సుగుణాల ద్వారానే గుర్తించబడతారు. ఎందుకంటే మంచి గుణాలు కల వ్యక్తి తన శత్రువును సైతం మిత్రునిగా మార్చుకోగలడు,అల్లాహ్ తన ప్రవక్తను ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: మంచి, చెడు (ఎట్టిపరిస్తితులలోనూ) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు,ఆ తరువాత (నువ్వే చూద్దువుగాని),నీకూ తనకూ మధ్య బధ్ధవిరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు [హామీం అస్సజ్దహ్/34]. 

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్,36వ భాగం,పేజీ నం:150.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19