నాలుకపై సరైన నియంత్రణ లేకపోతే అపఖ్యాతిని మూటగట్టుకోక తప్పదు.
మానవుడు తన నాలుక ద్వారానే (మాటల ద్వారా) ఈ లోకంలో గుర్తింపు పొందుతాడు మరియు అదే నాలుక ద్వారా అపఖ్యాతిని కొనితెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ నాలుకే ఒకచోట ఉన్నత శిఖరాలకు చేరటానికి కారణమవుతుంది మరోచోట అదే నాలుక అతనిని అపవాదాల పాతాళంలో కూరుకుపోయేలా చేస్తుంది. అందువలనే నాలుకపై నియంత్రణ ఎంతో అవసరం. దైవప్రవక్త(స.అ.వ)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే ఆ భగవంతునిపై మరియు ప్రళయదినంపై విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు మంచిని మాట్లాడటం (ఒకవేళ అలా చేయలేకపోతే) మోనంగా ఉండటం అవసరం”[వసాయెలుష్ షీయా,12వ భాగం,పేజీ నం:126]. వేరే చోట ఇమాం బాఖిర్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఏ విధంగానైతే ప్రజలు మీతో మాట్లాడాలని అనుకుంటారో అదే రీతిలో మీరు కూడా వారితో సంభాషించండి”[బిహారుల్ అన్వార్, 71వ భాగం, పేజీ నం:161]. తక్కువగా మాట్లాడటం అనేది తెలివైన వారి లక్షణం కూడా. ఇదే విషయాన్ని ఇమాం అలి(అ.స)ల వారు తన హదీసులో ఈ విధంగా తెలియజేస్తున్నారు: “ఎప్పుడైతే బుద్ధి తన పరిపూర్ణ దశకు చేరుకుంటుందో నోటి మాటలు తగ్గిపోతాయి”[నెహ్జుల్ బలాఘ, హిక్మత్ నం:71].
వ్యాఖ్యానించండి