అల్లాహ్ పైనే భారం

మంగళ, 04/30/2019 - 17:19

అల్లహ్ ను నమ్ముకున్న విశ్వాసులకు కలిగే ప్రయోజనాలు హదీసుల అనుసారంగా. 

అల్లాహ్ పైనే భారం

1. బలమైన మద్దతు: ఎవరైతే తమ కష్టాలను, సమస్యలను ఇతరులకు కాకుండా ఆ అల్లహ్ కు వదిలి మొత్తం భారాన్ని ఆ భగవంతునిపై మోపుతారో వారు కేవలం ఆ అల్లాహ్ ను మాత్రమే ఒక బలమైన మద్దతుదారునిగా నమ్ముతారు.అల్లాహ్ తన ప్రవక్తను ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: “మరియు (ఓ మొహమ్మద్ స.అ.వ!) వారిని పట్టించుకోకు.అల్లాహ్ పైనే ఆధారపడి ఉండు.కార్యసాధనకై అల్లాహ్యే చాలు”[అన్ నిసా/81].
2. భౌతిక బలం: ఎవరైతే ఆ భగవంతున్ని నమ్ముతారో వారు భౌతికంగా బలమైన వారు. దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నరు: “ఎవరైతే భౌతికంగా దృఢంగా  ఉండాలని కోరుకుంటారో వారు ఆ అల్లాహ్ ను నమ్ముకోవాలి”[బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ నం:151].
3. విజయం అల్లాహ్ ను నమ్ముకున్న వారిదే: అల్లాహ్ ను నమ్ముకున్నవారికే ఎప్పటికైనా విజయం వరిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ తనను నమ్ముకున్న విశ్వాసుల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయడు. ఇమాం అలి[అ.స]ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “అల్లాహ్ ను నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు మరియు ఏ పనిలోలైనా విఫలం కాడు”[బిహారుల్ అన్వార్, 71వ భాగం, పేజీ నం:151].

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10