వీటిలో ఒక్కటి ఉన్న ప్రజలందరి ప్రతిష్టతకు చాలు...

ఆది, 06/30/2019 - 13:29

ఇమామ్ అలీ(అ.స) ఈ సుగుణాల నుండి ఒక్కటి ఉన్న ప్రజలందరి ప్రతిష్టతకు ఆ ఒక్క లక్షణం చాలు...

వీటిలో ఒక్కటి ఉన్న ప్రజలందరి ప్రతిష్టతకు చాలు...

అబ్దుల్లాహ్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె అఖీల్, జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అన్సారీ నుండి ఇలా ఉల్లేఖించెను., వారు ఇలా అన్నారు: నేను దైవప్రవక్త[స.అ]ను అలీ[అ.స] గురించి వెల్లడించిన సుగుణాల నుండి ప్రజలందరిలో ఒక్కటి ఉన్న అది వారి ప్రతిష్టతకు చాలు. దైవప్రవక్త[స.అ] ప్రవచనలు:
1. నేను ఎవరికి స్వామినో అలీ కూడా వారికి స్వామియే
2. హారూన్ కు మూసాతో ఉన్న సంబంధమే అలీకు నాతో ఉంది
3. అలీ నా నుండి మరియు నేను అలీ నుండి
4. అలీ స్వయంగా నాలాంటి వారే వారి పట్ల విధేయత నా పట్ల విధేయతతో సమానం మరియు వారి పట్ల అవిధేయత నా పట్ల అవిధేయతతో సమానం.
5. అలీతో యుద్ధం నాతో యుద్ధం మరియు అలీతో సంధి నాతో సంధి
6. అలీతో స్నేహం అల్లాహ్ తో స్నేహం మరియు అలీతో వైరం అల్లాహ్ తో వైరం
7. అలీ అల్లాహ్ యొక్క హుజ్జత్ మరియు ఆయన దాసుల మధ్య ఆయన ఖలీఫా
8. అలీ పట్ల ఇష్టం విశ్వాసం మరియు వారి పట్ల వైరం అవిశ్వాసం
9. అలీ యొక్క సైన్యం అల్లాహ్ యొక్క సైన్యం మరియు అలీ శత్రువుల సైన్యం షైతాన్ సైన్యం
10. కౌసర్ సెలయేరు పై నాతో కలవనంత వరకు అలీ సత్యంతో మరియు సత్యం అలీతో వేరు కారు
11. అలీ స్వర్గాన్ని మరియు నరకాన్ని పంచువారు
12. అలీ నుండి వేరు అయిన వారు నా నుండి వేరు అయినట్లే, మరి నా నుండి వేరు అయిన వారు అల్లాహ్ నుండి వేరు అయినట్లే
13. అలీ యొక్క షియాలు(అనుచరులు) ప్రళయదినాన సాఫల్యులు[ఖిసాల్, భాగం2, పేజీ256].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14