దీపం ఆర్పి అర్జీని వినడం

శుక్ర, 07/05/2019 - 12:16

సహాయం కోరడానికి వచ్చిన వారితో ఇమామ్ ప్రవర్తన మరియు దాని గొప్పకారణాన్ని వివరిస్తున్న సంఘటన...

దీపం ఆర్పి అర్జీని వినడం

అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క సహాబీ మరియు సహచరుల నుండి ఒకరైన హారిసె హమదానీ కథనాన్ని ఇలా ఉల్లేఖించారు:
ఒకరోజు రాత్రి నేను అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఇంటికి వెళ్ళాను, మాట్లాడుతూ మాట్లాడుతూ వారితో నేను “ఓ అమీరుల్ మొమినీన్! మీ ముందు ఒక అర్జీ పెట్టాలనుకుంటున్నాను” అని అడిగాను. ఇమామ్ “ఓ హారిస్! నీ అర్జీ వినేవాడ్నిగా నన్ను భావిస్తున్నావా?” అని అన్నారు. “ఓ అమీరుల్ మొమినీన్! మీరే అందరి కంటే ఎక్కువ అర్హత కలిగి ఉన్నవారు” అని అన్నాను. అప్పుడు ఇమామ్ “ఇన్షా అల్లాహ్, అల్లాహ్ నిన్ను నా ద్వార నీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక” అని చెప్పిన తరువాత కూర్చుని ఉన్న చోటు నుండి లేచి దీపాన్ని ఆర్పి ఇలా వ్యక్తం చేశారు: ఈ దీపం ఆర్పడానికి గల కారణం, నీవు నీ కోరికను అర్జిస్తున్నప్పుడు నీ ముఖంలో ఉండే ఆ బిడియాన్ని చూడదలుచుకోలేదు, ఇక ఇప్పుడు నీవు ఎటువంటి ఆలోచన లేకుండా నీకున్న కష్టాన్ని అర్జించుకోవచ్చు. ఆ తరువాత ఇలా అన్నారు: నేను దైవప్రవక్త[అ.స]ను ఇలా చెబుతుండగా విన్నాను.. ప్రజల కోరికలు ఒకరకంగా అల్లాహ్ యొక్క అమానతులు అవి రహస్యంగానే ఉండాలి, అల్లాహ్ కు తప్ప మరొకరికి చెప్పకూడదు. ఒకవేళ ఎవరైన తమ సోదరుని అర్జీని గనుక వింటే తన స్తోమతను బట్టి అతనికి సహాయం చేయాలి నిరాశ పరచకూడదు.[ఫురూగె కాఫీ, భాగం4, పేజీ24]

రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఫురూగె కాఫీ, హదీస్4.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26