సహాయానికి సందర్భం అనవసరం

బుధ, 04/18/2018 - 05:47

ఎవరైనా మీకు సహాయం కోరితే మీ పనిని వదులుకోనైనా సరే లేదా మీరు సిఫార్సు చేసైనా సరే సహాయం చేయడానికి ప్రయత్నించండి అన్న విషయాన్ని వివరిస్తున్న సంఘటన.

సహాయానికి సందర్భం అనవసరం

ఇమామ్ హుసైన్ అప్పుడు ముఆవియా సభలో ఉన్నారు. ఒక ఆరాబీ(ఎడారి మనిషి, అనాగరికుడు) ఇమామ్ ఉండగా ముఆవియాను సహాయం కోరాడు. ముఆవియా ఇమామ్ తో మాటల్లో నిమగ్నమై ఉండి అతడిని పట్టించుకోలేదు. ఆరాబీ ఇలా అన్నాడు: “ఓ ప్రవక్త కుమారా! నీకు ప్రమాణం, నీవు ముఆవియాతో నా సహాయం గురించి చెప్పు” ఇమామ్ అలాగే చేశారు. ముఆవియా అతడికి సహాయం చేశాడు. అప్పుడు ఆరాబీ ఇలా అన్నాడు: “నేను ‘అబ్షమీ’(అబ్దుష్షమ్స్ యొక్క క్లుప్తం, ముఆవీయా పూర్వీకులు) వద్దకు వచ్చాను కాని నాకేమీ ఇవ్వలేదు, దైవప్రవక్త[స.అ] కుమారుడు బలవంతం చేయనంత వరకు. అతను ముస్తఫా[స.అ] కుమారుడు, దయాశీలుడు, స్వయంగా పవిత్ర బతూల్[స.అ] గర్భం నుండి వచ్చినవాడు, నిస్సందేహముగా వసంత ఋతువుకు మిగిలిన ఋతువుల పై ఎలా ప్రాముఖ్యత ఉందో హాషిం ప్రాముఖ్యత మన పై ఉంది”.
అది విన్న ముఆవియా ఇలా అన్నాడు: “ఓ ఆరాబీ! నీకు ప్రసాదించింది నేనైతే నువ్వు అతనిని పొగుడ్తున్నావా?” అరాబీ ఇలా అన్నాడు: “ఓ ముఆవీయా! నీవు అతని వలనే నాకు ఇచ్చావు, అతను చెప్పడం వలనే నాకు సహాయం చేశావు”[బిహారుల్ అన్వార్, భాగం24, పేజీ210].
ఈ సంఘటన ద్వార తెలిసే విషయమేమిటంటే సహాయానికి సందర్భంతో పనిలేదు. మీలో స్తోమత ఉంటే ఎదుటివాడి కష్టాలను దూరం చేయడం చాలా అవసరం. మరియు అలాగే ఇతరులను సహాయపడే స్వభావాన్ని అందరిలో ప్రేరేపించాలి.

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం24, పేజీ210

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Jazakallah... aap ne apna qeemati waqt is ko padh kar comment karne k liye nikaala ...  Shukriya.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15