మంగళ, 09/03/2019 - 15:52
దైవప్రవక్త[స.అ] మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత..
దైవప్రవక్త[స.అ] మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స], ఒకసారి వారు యుద్ధం చేయడానికి వెళ్లారు. అప్పుడు శత్రు సైన్యం వారిని నలుమూలల నుండి చుట్టు ముట్టి ఉంది, శత్రువులు వారిని హతమార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో నమాజ్ సమయం అయ్యింది. వారు చుట్టుముట్టి ఉన్న శత్రుసైన్యాన్ని పట్టించుకోకుండా తన గుర్రం పై నుండి క్రిందికి దిగి నమాజ్ మొదలు పెట్టారు. నమాజ్ పూర్తయిన తరువాత ఒక సహాబీ వచ్చి వారితో “యా అలీ[అ.స] ఇది నమాజ్ చదవే సమయమా!!” అని ప్రశ్నించాడు.
దానికి అలీ[అ.స] “మేము ఈ నమాజ్ ను స్థాపించడానికే యుద్ధం చేస్తున్నాము” అని సమాధానమిచ్చారు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే చహారుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి