దైవప్రవక్త[స.అ] నాలుగొవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] దృష్టిలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత...
దైవప్రవక్త[స.అ] నాలుగొవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స]. వారు నిరంతరం రాత్రిబవళ్లు అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉండేవారు. అల్లాహ్ పట్ల వారి భీతిని చూసి వారు మరణించారేమోనని అనుకునేవారు.
ఒకసారి వారు నమాజ్ చదువుతుండగా, షైతాన్ వారిని పరీక్షించడానికై సర్పరూపాన్ని ధరించి వారి బ్రొటన వ్రేలును కొరకటం మొదలు పెట్టాడు, వారు నమాజ్ జ్ఞానంలో నిమగ్నమై ఉన్నారు, సర్పం బ్రొటన వ్రేలు కొరుకుతూనే ఉన్నాడు కాని వారికి ఎటువంటి స్పర్స తెలియలేదు, దానిపై షైతానుకు చాలా ఆశ్చర్యం కలిగింది. నమాజ్ పూర్తయిన తరువాత ..నిస్సందేహంగా నువ్వు జైనుల్ ఆబెదీన్ వీ.. అని వినిపించింది.
ఇదే వారి ప్రముఖ బిరుదు కూడా.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే చహారుమ్.
వ్యాఖ్యానించండి