మంచి సహాబీయులు

ఆది, 09/29/2019 - 16:51

సహాబీయులందరు మంచివారేనా లేక సహాబీయులలో కూడా మంచి సహాబీయులు మరియు చెడ్డ సహాబీయులున్నారా...

మంచి సహాబీయులు

సహాబీయులలో కొందరు మంచి స్వభావం గలవారు ఉన్నారు. వారు అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] గురించి పూర్తిగా తెలిసినవారు. దైవప్రవక్త[స.అ] పై తమ ప్రాణాలను అర్పించడానికి కూడా వెనకాడము అని బైఅత్ చేసినవారు. దైవప్రవక్త[స.అ] పట్ల తమ చెప్పుచేతలలో అనుగుణంగా ఉండే నిజమైన సహాబియులు. దైవప్రవక్త[స.అ] మరణాంతరం వాళ్ళలో ఎటువంటి విరుధ్ధం ఏర్పడ లేదు. దైవప్రవక్త[స.అ] తరువాత కూడా వాళ్ళు తమ మాటపై నిలబడే ఉన్నారు. ఇలాంటి సహాబియుల గురించే ఖుర్ఆన్‌ ప్రశంసించింది. వాళ్ళ గొప్పతనం, మంచి గుణాల గురించి పలుసార్లు దైవప్రవక్త[స.అ] చాటిచెప్పారు. షియా ముస్లింలు ఈ సహాబీయుల ప్రస్తావన చాలా గౌరవంగా, పవిత్రంగా చేస్తారు. అహ్లెసున్నత్‌లు సహాబియులందరిని ఎలా గౌరవిస్తారో అలాగే గౌరవిస్తారు. కాని షియా ముస్లిములు దైవప్రవక్త[స.అ] మరణానంతరం వారి ఆదేశాలను వ్యతిరేకించినవారిని గౌరవించరు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18