బేసత్

శని, 08/26/2017 - 16:47

.హజ్రత్ ముహమ్మద్[స.అ] ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకోవడానికి బేసత్ అంటారు. దాని గురించి సంక్షిప్తంగా.

బేసత్

దైవప్రవక్త ముహమ్మద్[స.అ] 40 సంవత్సరాల వయసులో ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. హజ్రత్ ముహమ్మద్[స.అ] ఎల్లప్పుడు “హిరా” అనే గుహలో ప్రార్దన చేసేవారు. ఒకరోజు హజ్రత్ ముహమ్మద్[స.అ] ప్రార్దన చేస్తుండగా జనాబె జిబ్రయీల్(అ.స) వచ్చి “ఓ ముహమ్మద్[స.అ]! అల్లా మిమ్మల్ని ప్రవక్తగా ఎన్నుకొనెను” అని అన్నారు.
హజ్రత్ ముహమ్మద్[స.అ], ప్రవక్త అయిన తరువాత “గారేహిరా”నుండి బయటకు వచ్చినప్పుడు చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు, మరియు ప్రకృతిలోని ప్రతి జీవీ ఆయనకు “అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా రసూలల్‌ల్లాహ్” అని సలాములు చేశాయి. హజ్రత్ ముహమ్మద్[స.అ], ప్రవక్త అయిన తరువాత మగవారిలో మొట్ట మొదటగా హజ్రత్ అలీ[స.అ] వారి పై ఈమాన్ తెచ్చారు.
“బేసత్” యొక్క 5వ ఏట జనాబె ఖదీజ[స.అ] జనాబె ఫాతెమా జహ్రా[స.అ]ను జన్మనిచ్చారు.
“బేసత్” యొక్క 10వ ఏట, జనాబె అబూతాలిబ్[అ.స] మరియు అదే సంవత్సరం రమజాన్ నెలలో జనాబె ఖదీజ[స.అ] మరణించారు. వారిద్దరి మరణం హజ్రత్ ముహమ్మద్[స.అ]కు చాలా బాధ కలిగించింది. ఎంత బాధకలిగించిందంటే వారి మరణాంతరం హజ్రత్ ముహమ్మద్[స.అ] ఇంటి నుండి చాలా అరుదుగా బయటకు వెళ్ళేవారు. హజ్రత్ ముహమ్మద్[స.అ] యొక్క ఈ క్షోభ వల్ల ఈ సంవత్సరం పేరు “ఆముల్ హుజ్‌న్”(బాధాకార సంవత్సరం) అని పిలవ బడేది. [ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో]

రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meer irfanali on

Mashallah nice explanation jazakallah.......

Submitted by Ameen on

Jazakallaha, Aap ke mehanthon ko Khuda Ahalebaith ke sadqe me qubool farmay. Good Work Agha, keep it up.

Submitted by zaheer on

Shukriya ...
is tarha k comments hamari himmat afzaei ka sabab banti hai... allah aap ko bhi kamiyaab kare...

Submitted by zaheer on

Site par aakar comment k zariye hamari himmat afzaei ka bahot bahot Shukriya....  Jazakallah...

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36