కిఫాయతుత్ తాలిబ్ ఫి మనాఖిబి అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ] గ్రంథాన్ని అహ్లె సున్నత్ ప్రముఖ రచయిత రచించారు, దాని గురించి సంక్షిప్త వివరణ...
గ్రంథం పేరు: కిఫాయతుత్ తాలిబ్ ఫి మనాఖిబి అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ]
రచయిత: మొహమ్మద్ ఇబ్నె యూసుఫె గంజీ(మరణం:658హిజ్రీ) షాఫెయి వర్గానికి చెందినవారు.
ఇతను షాఫెయీ వర్గానికి చెందిన గొప్పవారిలో ఒకరు. రచయితలు వారిని; ముహద్దిసున్ ముఫీద్, ఇమామున్ హాఫిజ్, సిఖతున్ అద్లున్, హాఫిజె ఖుర్ఆన్ వ సున్నత్ అని సంభోదిస్తారు. “కిఫాయతుత్ తాలిబ్” గ్రంథంలో దైవప్రవక్త[స.అ] పవిత్ర నోటి నుండి ధర్మనిష్టుల నాయకుడైన ఇమామ్ అలీ[అ.స] యొక్క ప్రతిష్టతను వెల్లడిస్తూ రాలిన ఆణిముత్యపు లాంటి హదీసులను ఉల్లేఖించారు.
రచయిత, హదీసున్నింటిని రావీయుల క్రమంతో సహా ఉల్లేఖించీ, ప్రతీ హదీస్ తరువాత దాని గురించి సంక్షిప్త వివరణ కూడా వ్యాఖ్యానించారు. మరియు గ్రంథంలో రచించిన హదీసులకు అహ్లె సున్నతులు సమ్మతించే హదీస్ మూల గ్రంథాలను ఆధారంగా ప్రదర్శించారు.
రిఫ్రెన్స్
వికీ షియా, దానిష్ నామయె మక్తబె అహ్లెబైత్, కిఫాయతుత్ తాలిబు ఫీ మనాఖిబి అలీ ఇబ్నె అబీతాలిబ్.
https://www.welayatnet.com/fa/news/147790
వ్యాఖ్యానించండి