ఖుర్ఆన్ ఉపదేశానుసారం దైవప్రవక్త[స.అ] మార్గమే సత్యమైనది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
మజాహెబే అర్బఅ (హనఫీ, హంబలీ, షాఫేయీ, మాలికీ)లో పరస్పర అభిప్రాయభేదమే ఈ వర్గాలు అల్లాహ్ తరపు నుండివి కావు అనడానికి సాక్ష్యం. అని చెబితే కొందరు “ఖబడ్డార్! ‘ఖులాఫాయే రాషేదీన్’ల గురించి సందేహించకు ఎందుకంటే వీళ్ళు ఇస్లాం యొక్క స్థంభాలు, ఒకవేళ స్థంభాలే కూలిపోతే పూర్తి కట్టడం కూలిపోతుంది” అని భయపెడుతూ ఉంటారు.
వారికి మన ఉలమాలు ఇలా సమాధానిమిస్తారు; కేవలం ఈ నలుగురే ఇస్లాం యొక్క స్తంభాలైతే మరి దైవప్రవక్త[స.అ] స్థానం ఏమిటి? మరియు ఇస్లాంతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి?. అంటే దైవప్రవక్త[స.అ] కూడా ఆ నలుగురు లేకుండా స్థిరపడలేరు అని అర్థమా!. ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: “అల్లాహ్‌యే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు, అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి. ఈ వాస్తవానికి అల్లాహ్ సాక్ష్యమే చాలు”[ఫత్హ్:25]
వ్యాఖ్యానించండి