అహ్లె సఫీనహ్ వారు

ఆది, 12/15/2019 - 13:10

అహ్లె సఫీనహ్ విశ్వాసం ఉత్తమ సహాబీయలు విశ్వాసానికి మించినది అని వివరించే సహీ బుఖారీ గ్రంథం యొక్క హదీస్...

అహ్లె సఫీనహ్ వారు

“సహీ బుఖారీ”లో ఇలా అని ఉల్లేఖించబడి ఉంది: హజ్రత్ ఉమర్, హఫ్సా వద్దకు వచ్చారు. అక్కడ ఆమె వద్ద అస్మా బింతె ఉమైస్ కూర్చొని ఉన్నారు. ఆమెను చూసి ఈమె ఎవరూ? అని ఉమర్ అడిగారు. హఫ్సా, ఈమె అస్మా బింతె ఉమైస్ అని అన్నారు. అయితే ఈమె అబీసీనియా(సిద్ధీ) దేశస్తురాలు, ఈమే బహ్రీయా? అని ఉమర్ ప్రశ్నించారు. అందుకు అస్మా బింతె ఉమైస్ ఔను నేనే అని అన్నారు. మేము నీ కన్న ముందు హిజ్రత్ చేశాము అందుకు దైవప్రవక్త[స.అ]పై మా హక్కు ఎక్కువ అని ఉమర్ అన్నారు. ఇది విని అస్మాకు కోపం వచ్చింది. మరి ఆమె ఇలా అన్నారు: ప్రసక్తే లేదు! మీరు దైవప్రవక్త‎[స.అ]‎తో కలిసివుంటే అతను మీలో పేదవారి ఆకలి తీర్చేవారు. మీలో అజ్ఞానులకు హితోక్తులు భోధించేవారు. మరి మేము, చాలా దూరం వేరే దేశంలో ఉన్నప్పటికీ అల్లాహ్ మరియు దైవప్రవక్త‎[స.అ]‎ను నమ్మేవాళ్ళం. భోజనం చేసినా, నీరు త్రాగినా ముందు దైవప్రవక్త‎[స.అ]‎ను గుర్తు చేసుకునే వాళ్ళం. తొందరలోనే నేను మీ ఈ మాటను దైవప్రవక్త‎[స.అ]‎ ముందు ప్రస్తావిస్తాను. అల్లాహ్ సాక్షిగా తప్పుగా ఏమి చెప్పను ఇవే మాటలు చెబుతాను. దైవప్రవక్త‎[స.అ]‎ విచ్చేసిన తరువాత అస్మా, ఉమర్ ఇలా అంటున్నారు, అని అన్ని విషయాలు చెప్పారు. నీవు దానికి ఏమని జవాబిచ్చావు? అని దైవప్రవక్త‎[స.అ]‎ ప్రశ్నించారు. అస్మా తాను ఇచ్చిన జవాబును వివరించారు. దానికి దైవప్రవక్త‎[స.అ]‎, మీ కన్న ఎక్కువ హక్కు ఉమర్‌కు లేదు అని అన్నారు. అతను ఒకసారి మాత్రమే హిజ్రత్ చేశారు కాని మీ అహ్లెసఫీనా వాళ్ళు(నీటి పై ప్రయాణిస్తూ తమ జీవితాన్ని గడిపేవారు) వాళ్ళు రెండుసార్లు హిజ్రత్ చేశారు.
అస్మా ప్రవచన ప్రకారం; ఆ తరువాత ఆబూమూసా మరియు సఫీనా అనుచరులు “మాకు దైవప్రవక్త‎[స.అ]‎ ఇచ్చిన ఈ ఆదర్శం కన్న పెద్ద విషయం మమ్మల్ని ఆనందపరిచేది లేదు” అని నా వద్దకు తమ రాయబారులను ఈ హదీసును వివరంగా తెలుసుకోవడానికి పంపారు.[బుఖారీ, భాగం3, పేజీ 387]

రిఫ్రన్స్
బుఖారీ, భాగం3, పేజీ 387 బాబొ గజ్వతి ఖైబర్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12