హఫ్సా బింతె ఉమర్

శని, 11/03/2018 - 12:24

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క కుమార్తె అయిన హఫ్సా యొక్క మొదటి భర్త మరణించిన తరువాత ఆమె వివాహం ఎవరితో జరిగింది అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

హఫ్సా బింతె ఉమర్

“హఫ్సా”, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క కుమార్తె. ఈమె వివాహం ఖనీస్(ఖునైస్) ఇబ్నె ఖద్దాఖహ్ తో జరిగింది. అతను “బద్ర్” మరియు “ఒహొద్” యుద్ధాలలో పాలుగొన్నారు. బద్ర్ యుద్దం సమయంలో గాయపడ్డారు మరి అదే గాయం వల్ల మరణించారు, దాంతో ఆమె విధవరాలయ్యింది. ఉమర్ ఆమెను వివాహమాడమని తన మిత్రులైన అబూబక్ర్ మరియు ఉస్మాన్ లను కోరారు కాని వారు అంగీకరించలేదు. ఉమర్ వారి గురించి దైవప్రవక్త[స.అ]కు ఫిర్యాదు చేశారు. కొంత కాలం తరువాత దైవప్రవక్త[స.అ]యే ఆమెతో హిజ్రీ యొక్క 3వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. హఫ్సా మరియు ఆయిషహ్ ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉండేది. వీరిద్దరి వల్ల దైవప్రవక్త[స.అ] యొక్క వ్యక్తిగత జీవితంలో వివిధ సమస్యలు చోటుచేసుకున్నాయి.
రివాయత్లు ఉల్లేఖనం ప్రకారం సురయే తహ్రీమ్ యొక్ మొదటి నాలుగు ఆయత్లు మరియు సూరయే అహ్జాబ్ యొక్క 28, 29 ఆయత్లు కూడా వారిని ఉద్దేశించబడే అవతరించబడ్డాయి.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ86].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31