సహాబీయులకు దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉపదేశం.
తన చుట్టూ గుమిగూడి ఉన్న సహాబీయులతో దైవప్రవక్త[స.అ.వ] ల వారు అందరిలోకెల్లా సోమరి,అతి పెద్ద దొంగయైన,అత్యంత పిసినారైన,అత్యంత క్రూరుడైన మరియు అత్యంత అసమర్ధుడైన వ్యక్తి ఎవరో చెప్పనా?ప్రశ్నించారు.దానికి సహాబీయులు తప్పకుండా చెప్పండి ఓ దైవప్రవక్తా! అని అన్నారు.దైవప్రవక్త[స.అ.వ] ల వారు అత్యంత సోమరి అయిన వ్యక్తి ఎవరంటే ఆయు ఆరోగ్యాలతో ఉండి కూడా ఖాళీ సమయాలలో తన పెదవులు మరియు నాలుకతో ఆ దేవుని జిక్ర్ చేయని వాడు,అతి పెద్ద దొంద ఎవరంటే నమాజును తగ్గించేవాడు ఆ నమాజును నలిగిపోయిన పాత వస్త్రంతో ముఖంపకి విసిరినట్లుగా అతని నమజును అతని వైపు విసిరివేయటం జరుగుతుంది,అత్యంత పిసినారిపరుడైన వ్యక్తి ఎవరంటే ఒక ముస్లిముకు ఎదురుగా వెళ్ళి కూడా అతనికి సలాము చేయని వాడు,అత్యంత క్రూరుడైన వ్యక్తి ఎవరంటే నా పేరును అతని ముందు ప్రస్థావించినా నాపై సల్వాత్ పంపని వాడు,అత్యంత అసమర్ధుడైన్వ వ్యక్తి ఎవరంటే ఆ అల్లాహ్ తో మొరపెట్టుకోని వాడు.
రెఫరెన్స్: దాస్తాన్ హాయె బిహారుల్ అన్వార్,9వ భాగము.
వ్యాఖ్యానించండి