మౌలా పదం యొక్క అర్ధం‎

శని, 02/15/2020 - 13:14

మౌలా పదం యొక్క అర్ధం ఇష్టపడటం, మిత్రత్వం మొదలగు అర్ధాలు అని కొందరు భావిస్తారు, ఈ అర్ధాలు గదీర్ హదీస్ లో ఉన్న మౌలా యొక్క పదానికి అనుకూలమేనా అన్న విషయం పై సంక్షిప్త వివరణ..

మౌలా పదం యొక్క అర్ధం‎

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

مَنْ‏ كُنْتُ‏ مَوْلَاهُ‏ فَهَذَا عَلِيٌ‏ مَوْلَاهُ‏ اللَّهُمَّ وَالِ مَنْ وَالاهُ وَ عَادِ مَنْ عَادَاهُ وَ انْصُرْ مَنْ نَصَرَهُ وَ اخْذُلْ مَنْ خَذَلَه‏ وَ أَدِرِ الْحَقَ‏ مَعَهُ‏ حَيْثُ‏ دَار
ఈ హదీసు కూడా అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్‌లను హజ్రత్ అలీ[అ.స] పై ప్రాథాన్యత ఇవ్వడం, మరియు అతని విలాయత్‌ని గౌరవించక పోవడం వంటి ఆలోచనలన్నీంటిని రద్దుపరిచేందుకు చాలు. “మౌలా” అను పదాన్ని “ఇష్టపడేవాడు” మరియు “ఆదుకునే వాడు” అనే అర్ధాలను సృష్టించడం మరి ఆ కొత్త అర్ధాలతో దైవప్రవక్త[స.అ] ప్రకటించినటువంటి అసలు అర్ధం నుండి మలిచేయాలని వ్యాఖ్యాలు, వీటన్నీంటికి మూలకారణం సహాబీయుల ప్రతిష్టతను కాపాడడం తప్పా వేరే ఏది కాదు. లేకపోతే ప్రతీ ఒక్కరికి తెలుసు దైవప్రవక్త[స.అ] గదీర్ మైదానంలో మండుటేండలో ఉపన్యాసమిచ్చి ప్రజలతో మీరు మీ మీద మీ కన్న నాకే ఎక్కువ హక్కుంది అని నమ్ముతారా? అని ప్రశ్నించి వాళ్ళందరు తమ అంగీకారాన్ని వ్యక్తం చేసిన తరువాత, “؛ مَنْ‏ كُنْتُ‏ مَوْلَاهُ‏ فَهَذَا عَلِيٌ‏ مَوْلَاهُ నేను ఎవరెవరికి స్వామినో వాళ్ళకి ఈ అలీ[అ.స] కూడా స్వామియే” అని ప్రకటించారు. ఇది ఖిలాఫత్‌పై ఒక స్పష్టమైన సాక్ష్యం. దీన్ని నిరాకరించడం బుధ్ధిమంతుడుకి అసాధ్యం. ఎందుకంటే ఈ స్వామితనాన్ని మరియు నాయకత్వాన్ని నిరాకరించడంలో దైవప్రవక్త[స.అ] గారిని తక్కువ చేయడం మరియు అతని విజ్ఞత హేళన ఉంది. ఎందుకంటే దైవప్రవక్త[స.అ] ఆ తట్టుకోలేని ఎండలో సహాబీయులందరిని నిలిపివేసి అలీ[అ.స] ప్రతీ విశ్వాసికి మిత్రుడు మరియు మద్దత్తు ఇచ్చే వారు అని అందరికి తెలిసిన విషయాన్నే మరల ఎలా ప్రకటించగలరు!?.
నిజానికి ఈ సాకు సహాబీయుల ప్రతిష్టత రక్షణ కోసం చేయబడింది, అంటే సహాబీయుల ప్రతిష్టత రక్షణ, దైవప్రవక్త(స.అ) ప్రతిష్టత రక్షణ కన్నా ముఖ్యమైనదన్నమాట!.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6