గదీర్ పండగ ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

మంగళ, 08/28/2018 - 09:27

దైవప్రవక్త[స.అ] మాత్రమే కాకుండా విశ్వాసుల నాయకుడైన అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] గదీర్ రోజును పండగ రోజుగా నిర్ధారించారు.

గదీర్ పండగ ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

దైవప్రవక్త[స.అ] తరువాత “గదీర్”ను అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] పండగ రోజుగా నిర్ధారించారు. దైవప్రవక్త[స.అ] ఆదేశంతో పాటు వారి అసలైన ఉత్తరాధికారి ఆదేశం కూడా ఆ రోజు పండగ రోజు అన్న విషయం పై ఉండడంతో షియాలు ఆ రోజును పండగ జరుపుకుంటారు.
శుక్రవారం మరియు గదీర్ రెండూ ఒకే రోజు వచ్చిన సంవత్సరం, ఇమామ్ అలీ[అ.స] ఉపన్యం ఇస్తూ ఇలా అన్నారు: “ఓ విశ్వాసులారా! నిశ్చయంగా అల్లాహ్ మీకోసం రెండు పెద్ద పండగలను ఈ రోజున సమకూర్చాడు. ఈ రోజున పండగ జరుపుకోండి, అల్లాహ్ మీ పై కారుణ్యం కురిపిస్తాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తరువాత మీ ఇంట్లో వారిని ఆదరించండి, ఇతర విశ్వాసుల పట్ల మంచిని చేకూర్చండి, మీకు అనుగ్రహించిన అల్లాహ్ పట్ల కృతజ్ఞత తెలుపుకోండి, అందరూ ఏకమవ్వండి దాంతో అల్లాహ్ మీకున్న వికీర్ణను ఏకం చేస్తాడు. ఒకరికొకరు మంచి చేయండి దాంతో మీ ప్రేమ పెరుగుతుంది మరియు బలం పెరుగుతుంది. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటి నుండి ఒకరినొకరు కానుకలు ఇచ్చుకోండి, దాంతో అల్లాహ్ ఆ రోజున; దానికి ముందు మరియు తరువాత ఉన్న పండగలకు మించి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజు మంచి చేయడం ధనం మరియు వయసు పెరగడానికి కారణం. ఈ రోజు ఇతరుల పట్ల ప్రేమను చూపించడం అల్లాహ్ కారుణ్యానికి కారణం. మీకున్న దాంట్లో విశ్వాసులకు మరియు ఇంట్లో వారికి ఆ రోజు యొక్క ప్రతిష్టత దక్కేందుకు ప్రయత్నించండి, ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు కలుసుకోండి....”[గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, పేజీ79].

రిఫ్రెన్స్
అల్లామహ్ అమీనీ, గుజీదయీ జమె అజ్ అల్ గదీర్, ముతర్జిమ్ షాహ్రూదీ, ముఅస్ససయే మీరాసె నుబువ్వత్, చాప్3.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14