సహాబీయులందరూ సత్యవతులు కాలేరు

బుధ, 04/15/2020 - 18:33

సహాబీయులందరూ న్యాయమూర్తు మరియు సత్యవంతులు కాలేరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

సహాబీయులందరూ సత్యవతులు కాలేరు

అహ్లెసున్నతులు “సహాబీయులందరూ న్యాయమూర్తులు, నమ్మదగ్గవారు మరియు ఉమ్మత్ లో ప్రతిష్టులు” అని ఏకాభిప్రాయం కలిగివున్నారు. మరి ఎన్నో సున్నీ ఉలమాలు ఈ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు, వాటి నుండి కొన్ని:
1. ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ, అల్ ఇసాబహ్ ఫీ తమీజ్ అల్ సహాబహ్, మిస్ర్, భాగం1, పేజీ17-22.
2. ఇబ్నె హాతమ్ అల్ రాజీ, అల్ జర్హ్ వల్ తఅదీల్, హైదరాబాద్, భాగం1, పేజీ7-9.
3. ఇబ్నె అల్ అసీర్, ఉస్దుల్ గాబహ్ ఫీ మఅరిఫతి అల్ సహాబహ్, భాగం1, పేజీ2-3.
కాని రద్దుచేయలేనటువంటి నిదర్శనం వెలుగులో ఈ విశ్వాసాన్ని అంగీకరించడం చాలా కష్టం ఉదాహారణకు ఈ సంఘటనను చూడండి; ౙుబైర్ నాతో ఇలా చెప్పారు: అస్హాబె బద్ర్(బద్ర్ కు చెందిన సహాబీయులు)లలో ఉన్న ఒక అన్సారీకి వారితో దైవప్రవక్త(స.అ) ముందు (మొక్కలకు) నీళ్ళు పోసేందుకు ఉపయోగపడే ఒక చెలము విషయంలో వ్యతిరేకత ఏర్పడింది. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “ఓ ౙుబైర్! ముందు నువ్వు నీ తోటలో నీళ్ళు పోసుకో, ఆ తరువాత నీ పొరుగువాని వైపుకు పారించు” దానిపై అన్సారీకి కోపం వచ్చింది, అతడు ఇలా అన్నాడు: “యా రసూలల్లాహ్! ఈ ప్రాధాన్యత, ౙుబైర్ మీ పినతండ్రి కుమారుడనా?” అది విని దైవప్రవక్త(స.అ)కు కోపం వచ్చింది మరియు వారు ౙుబైర్ తో ఇలా అన్నారు: “నీ తోటకు నీరు పోసుకొన్న తరువాత నీళ్ళు ఆపేయి, గోడల వరకు చేరిపోతాయి” అంతకు ముందు దైవప్రవక్త(స.అ) విశాల హృదయంతో తీర్పునిచ్చారు, దాంతో ఆ అన్సారీకి మరియు ౙుబైర్ ఇద్దరికీ మేలు కలగాలని, కానీ ఎప్పుడైతే అన్సారీ దైవప్రవక్త(స.అ)ను నిరాశకు గురి చేశాడో వారు నియమం ప్రకారం ౙుబైర్ కు పూర్తి హక్కును ఇచ్చారు. ౙుబైర్ ఇలా చెప్పారు; అల్లాహ్ సాక్షిగా ఈ ఆయత్ ఈ తీర్మానం క్రమంలోనే అవతరింపబడింది: “మీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో మిమ్మల్ని తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత మీరు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు”.[ఖుర్ఆన్:4:65][ సహీహ్ అల్ బుఖారీ, భాగం3, కితాబ్49, సంఖ్య871]

రిఫరెన్స్
సహీహ్ అల్ బుఖారీ, ఇంగ్లిష్ అనువాదం, భాగం3, కితాబ్49, సంఖ్య871.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16