ప్రజలను మార్గభ్రష్టులు చేసేందుకు మరియు మోసగించడానికై అసత్యం, సత్యం ముసుగును వేసుకుంటుంది...
ప్రజలను మార్గభ్రష్టులు చేసేందుకు మరియు మోసగించడానికై అసత్యం, సత్యం ముసుగును వేసుకుంటుంది. చాలా అవివేకులపై విజయాన్ని పొందుతుంది. ఒక్కోసారి సత్యానికి వ్యతిరేకంగా అసత్యం సహకరించ బడుతుంది. సత్యాన్ని నమ్మేవారి వద్ద అల్లాహ్ యొక్క ఈ ప్రమాణం ఉంది: “అసత్యం నాశనం అవుతుంది, అది నాశనం అయ్యే తీరుతుంది” మరియు సహనం తప్ప వేరే దారి లేదు.
దీనికి ప్రవక్త యాఖూబ్[అ.స] మరియు అతని కుమారుల ప్రవచనమే సరైన మరియు మంచి ఉదాహారణ: సాయంత్రం వారంతా రోధిస్తూ తమ తండ్రి వద్దకు వచ్చారు. (వచ్చి ఇలా) అన్నారు: నాన్నాగారూ! యూసుఫ్‌ను మా సమానుల వద్ద పెట్టి మేము పరుగు పందెంలో మునిగిపోయాము, ఇంతలోనే ఒక తోడేలు వచ్చు అతన్ని తినేసింది. మీరు మా మాటలను నమ్మరు, మేము నిజం చెబుతు న్నాము.[యూసుఫ్:16,17]
ఒకవేళ వాళ్ళు(ప్రవక్త యూసుఫ్[అ.స] సోదరులు) సత్యవంతులై ఉంటే ఇలా చెప్పి ఉండాల్సింది: “మీరు మా మాటను అంగీకరించరు, ఎందుకంటే మేము అబద్ధికులం”
వ్యాఖ్యానించండి