తల్లిదండ్రుల పట్ల గౌరవరం ఖుర్ఆన్ దృష్టిలో

ఆది, 01/24/2021 - 16:08

అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి...

తల్లిదండ్రుల పట్ల గౌరవరం ఖుర్ఆన్ దృష్టిలో

పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించడం మంచి లక్షణం అని అందరికి తెలుసు కాని అందులో తల్లిదండ్రులను గౌరవించడం అతి ముఖ్యమైనది. ఇలా అని మనిషికి తెలుసు అయినప్పటికీ ఖుర్ఆన్ దీనిపై ప్రత్యక దృష్టి చూపించింది.
కొన్ని ఆయతులలో తల్లిదండ్రుల పట్ల గౌరవం యొక్క అంశాన్ని తౌహీద్ అంశం తరువాత సూచించబడి ఉంది.
అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి.[బఖరహ్:83] నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి.[ఇస్రా:23]
కొన్ని ఆయతులలో తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా వారి యెడల ఉత్తమంగా మెలుగు అని ఆదేశించబడి ఉంది. లుఖ్మాన్ సూరహ్ ఆయత్ 15లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఒకవేళ ఎవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని తల్లిదండ్రులు నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో”[లుఖ్మాన్:15]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9