ప్రజల బహుమతుల కోసం అల్లాహ్ బహుమతులను వదిలేయడం అతి అవివేక నిర్ణయం...
మనం చూస్తూ ఉంటాము ఒకరు ఏదైనా మంచి పని చేస్తే వారికి ఏదో బహుమానం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ప్రజలు ఇచ్చే ఏ బహుమతి అయినా సరే అది ఒక కాలానికో లేదా ఒక స్థలానికో పరిమితమై ఉంటుంది, ఇవి కాకుండా సాధారణంగా ప్రజలు ఇచ్చే బహుమతులను చూసుకున్నట్లైతే ఉదాహారణకు దుస్తులు, ఇల్లు లేదా ధనం మొ... ఇవి అర్హత లేని వారికి కూడా దక్కుతాయి, అవి వారి కోసం కూడా ఇచ్చే అవకాశం ఉంది కాని అల్లాహ్ కోసం పని చేస్తే ఆయన ఇచ్చే బహుమతులు ఒక కాలానికి లేదా ఒక స్థలానికి పరిమితమైనవి అయి ఉండవు, అవి అర్హత లేని వారికి దక్కవు. ఇహపరలోకాలలో ప్రసాదించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది.
వివేకంగా ఆలోచించినట్లైతే అల్లాహ్ బహుమతుల ముందు ప్రజల బహుమతులు చాలా అల్పమైనవి, ప్రజల బహుమతుల కోసం అల్లాహ్ బహుమతులను వదిలేయడం అతి అవివేక నిర్ణయం అని తెలుస్తుంది.
రిఫరెన్స్
గంజీనయె మఆరిఫ్, పేజీ55
వ్యాఖ్యానించండి