పేదరికం పట్ల, శత్రువుల పట్ల మృత్యువు పట్ల భయం...
భయం అనే పదం రాగానే ఒక చెడు లక్షణాన్ని ఊహించుకుంటారు. అంతేకాదు పిరికివాడు, భయపడేవాడు అన్న పదాలను బూతు పదాలుగా భావించబడతాయి. కాని నిజానికి కొన్ని భయాలు మన ప్రాణాలు కాపాడతాయి మరియు మన ఆత్మలను రక్షిస్తాయి అన్న విషయం మిమ్మాటికి నిజం. ఉదాహారణకు ప్రమాధం జరుగుతందేమో అన్న భయంతో జాగ్రత్తగా రోడ్డు దాటుతాము లేదా వాటిని నడుపుతాము. వైరసులు అంటుకుంటుందేమోనన్న భయంతో అవి అంటుకోకుండా ఉండేందుకు వైద్యనిపుణులు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తాము. ఇలాంటి భయాల వల్ల తీసుకునే జాగ్రత్తలు మన శరీరానికి కాపాడుకోవడానికి పనికొస్తాయి. అంటే కొన్ని భయాలు మన శరీరానికి కాపాడుకోవడానిక అవసరం అని తెలుస్తుంది. పైచెప్పిన మాటలు మరియు ఖుర్ఆన్ ఉపదేశాలనుసారం తెలిసే విషయమేమిటంటే ఆధ్యాత్మిక రక్షణ కూడా అవసరమైనది, దాని రక్షణ కోసం కూడా కొన్ని భయాలు ఉంటేనే గాని కాపాడుకోలేము. భయం అంటే అన్ని రకాల భయాలు కావు కేవలం వాటితో పరలోకంలో అల్లాహ్ ముందు తలదించుకునే పరిస్థతి రానటువంటి మరియు పాపముల నుండి దూరం చేసేటువంటి భయాలు.
ఖుర్ఆన్ ఉపదేశానుసారం కొన్ని భయాలు మంచివి కావు, వాటి ద్వార షైతాన్ వలలో చిక్కుకునే ప్రమాధం ఉంటుంది. అవి:
1. దారిద్ర్యం మరియు పేదరికం ద్వార భయపెట్టడం:
భయం యొక్క అతి చెడు రకం దారిద్ర్యం యొక్క భయం. ఇదే షైతాన్ యొక్క అతి పెద్ద వల, దీని ద్వారానే మనుషులను తప్పుద్రోవ పట్టిస్తాడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “షైతాన్ మీకు దారిద్ర్యం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు”[బఖరహ్:268]. ఈ భయం వలనే యువకుల పెళ్ళిల్లు జరగవు, కడుపులోనే పిల్లలు చంపబడతారు, మోసాలు జరుగుతాయి, మొ...
మరో వైపు చూసుకున్నట్లైతే అల్లాహ్ వివాహం గురించి ఇలా ఉపదేశించెను: “మీలో వివాహం కూకుండా ఉన్న స్ర్తీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడికగల మీ బానిసల, బానిస స్ర్తీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తమూ తెలిసినవాడు”[నూర్:32]
దారిద్య్రం మరియు పేదరికం భయం వల్ల జనం పాలుపడే మరో నీఛమైన కార్యం సంతానాన్ని చంపేయడం. కన్న తరువాత వారిని పోషించలేము అని కొందరు పిల్లల్ని గర్భంలోనే చంపేస్తూ ఉంటారు. నిజానికి అల్లాహ్ మానవాళికి ఉపధి కలిపించేవాడు. ఖుర్ఆన్ ఈ చర్యను ఖండిస్తూ ఇలా ఉపదేశించెను: “దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం”[ఇస్రా:31]
ఆలోచించదగ్గ విషయమేమింటే సమాజంలో అందరూ వృద్ధులే ఉంటే ఇక అందులో పని చేసే శక్తివంతులు(యువకులు) కరువవుతారు, దాంతో అందరికి దారిద్ర్యం వస్తుంది, ఆ సమాజం కష్టాలకు గురి అవుతుంది.
2. శత్రువు పట్ల భయం:
మన శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు వాడితో భయపడటం, అతి నీఛమైన చర్య. ఈ భయం శత్రువులో అహంకారాన్ని తీసుకొస్తుంది. మనల్ని మనం శత్రువు ముందు బలహీనులుగా చూపించకూడదు, ఇలా చేయడం సరైనది కాదు ఇది నాశనానికి గురి చేసే ఫలితాలు గలదు. అల్లాహ్ మస్లిములకు శత్రువులతో భయపడకూడదు అనే కాకుండా వారిని భయపెట్టడానికి తగిన సాధనలు, ఆయుధాలు కూడా తయారు చేసుకోవాలి అని ఉపదేశించాడు. ఖుర్ఆన్ ఉపదేశం: “మీరు వాళ్లను ఎదుర్కోవటానికి శాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టివుంచిన గుర్రాల ద్వార సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న – కాని అల్లాహ్ కు మాత్రం బాగా తెలిసిన – ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు”[అన్ఫాల్:60]
3. మృత్యువు:
ఖుర్ఆన్ ఉద్దేశానుసారం అక్కరలేని భయాలలో మృత్యువు భయం ఒకటి. ఈ భయం ఒక్కోసారి ప్రాణ ప్రీతి వల్ల అయితే ఒక్కోసారి ఈ ప్రపంచంతో ఏర్పర్చుకున్న సంబంధాల వల్ల పుట్టుకొస్తుంది. మృత్యువును జయించలేము. అల్లాహ్ అమర జీవితాన్ని ప్రసాదిస్తాను అని ప్రమాణం చేశాడు కాని అది ఈ లోకంలో కాదు అది పరలోకంలో. ఖుర్ఆన్ ఉపదేశమనుసారం ఒకవేళ ప్రజలు ఈలోకంలో పరలోకం గురించి ఆలోచించి అమలు చేసినట్లైతే వారు మృత్యువును చాలా సాధారణ విషయంగా భావిస్తారు ఎందుకంటే పరలోకంలో కావలసిన వసతులను ఈలోకంలో ఉండగానే ఏర్పర్చుకున్నారు కాబట్టి.
ఈలోకాన్ని విడిచి వెళ్ళాలంటే వారి హృదయాలలో మృత్యువు భయం చొచ్చుకుపోయి ఉంది. వారి ఉపమానం ఖుర్ఆన్ సుచనానుసారం: “(వారి ఉపమానం) ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది – అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుముల, మెరుపులు! ఉరుముల గర్జన విని, వృత్యువు భయంతో వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచీ ముట్టడిస్తాడు”[బఖరహ్:19]
చివరిమాట:
నిజానికి కేవలం షైతాన్ (అర్థంలేని మాటలతో) తనను అనుసరించేవారిని భయపెడుతాడు. కనక మీరు వారికి భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.[ఆలిఇమ్రాన్:175].
వ్యాఖ్యానించండి