మృత్యువు అంతం కాదు

శుక్ర, 02/19/2021 - 15:03

మృత్యువు అంతం కాదు అది ఈలోకాన్ని పరలోకంతో కలిపి ఒక వంతెన మాత్రమే...

మృత్యువు అంతం కాదు

మస్జిద్ లో ప్రతీ రోజు నమాజ్ తరువాత ఒక పేజీ ఖుర్ఆన్ పఠించే వారు ఆ తరువాత పఠించబడిన ఆయతులనే పేష్ ఇమామ్ గారు వివరించేవారు.
ఈ రోజు పేష్ ఇమామ్ గారు సురయె నిసా యొక్క 78వ ఆయత్ “మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే(అది మిమ్మల్ని వదలదు)” ను వ్యాఖించేటప్పుడు నమాజ్ కు వచ్చినవారి నుండి ఒకడు ఇలా ప్రశ్నించాడు: “మౌలానా! క్షమించండి, నేను తాజాగా భూకంపాని తట్టుకోగల ఇంటిని నిర్మించుకున్నాను ఎటువంటి భయంలేకుండా ఇంట్లో ఉండొచ్చు అని కాని చూస్తే ఈ మృత్యువు మమ్మల్ని వదిలేటట్లు లేదు”
మౌలానా గారు: ఇన్ షా అల్లాహ్ మీకు దీర్ఘకాలం వరకు అనుగ్రహాలతో కూడిన జీవితం కలుగుగాక! కాని యదార్థమేమిటంటే మృత్యువుకు భూకంప రక్షణ ఇల్లూ(Anti-earthquake) మొదలగు వాటివి అర్థంకావు, సమయం అయ్యిందంటే చాలు వచ్చేస్తుంది. సూరయె లుఖ్మాన్ ఆయత్34లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఏ ప్రాణీ తాను ఏ గడ్డపై మరణిస్తోడో కూడా ఎవరికీ తెలీదు”
ఆ వ్యక్తి: క్షమించండి! మరణించడం తప్పని సరి అయినప్పుడు మనల్ని పుట్టించబడడం ఎందుకు? వచ్చి ఒక శ్వాస తీసుకునేలోపే మృత్యువు వచ్చి తీసుకుపోతుంది. మరణించిన తరువాత అంతా అంతం అయిపోతుంది.
మౌలానా గారు: మృత్యువు అనేది లేకపోతే నీ పుట్టుక వ్యర్థమౌతుంది, ఎందుకంటే ఎవరూ తాము చేసుకున్న కార్యఫలితాలను చూడలేడు మరియు ఈ మృత్యువుయే మంచిభాగ్యం మరియు నిరంతర జీవితం ఆశను హృదయాలలో గుర్తుపెడుతుంది. నిజానికి మృత్యువు అంతం కాదు అది ఈలోకం నుండి పరలోకానికి చేర్చే ఒక వంతెన మాత్రమే[1] అంటే ఈలోకాన్ని పరలోకంతో ముడివేసేది. ఇంకో లోకానికి మరి కొన్ని ప్రత్యేకతలతో వెళ్లడం అంతం కాదు ఒక విధంగా ఆరంభం. మృత్యువు మనం చేసుకున్నవాటి ప్రతిఫలానికి చేరుస్తుంది.
ఆ వ్యక్తి: ఈలోకంలోనే మేము చేసుకున్న వాటి ప్రతిఫలాన్ని పొంది ఇక్కడే నిరంతరం జీవించి ఉండడం సంభవం కాదా?
మౌలానా గారు: ఒకవేళ ఈ లోకం మనుషులతో మరియు ఇతర ప్రాణులతో నిత్యం ప్రాణాలతోనే ఉండాలని నిర్ధారించబడి ఉండి ఉంటే ఈ ప్రపంచం ఇప్పటికి నిండిపోయి ఉండేది మిగిలినవారికి ఖాళీ ప్రదేశం లేకుండా ఉండేది. అదీకాకుండా కొన్ని చర్యల పుణ్యం లేదా శిక్ష ఈ లోకంలో ఇవ్వడం చాలా కష్టం ఉదాహారణకు ఒక వ్యక్తి ఒకే సమయంలో లక్షల సంఖ్యలో అమాయకపు ప్రజలను గాయపరిచాడు అనుకుందా అయితే అతడిని ఈలోకంలో అంత మంది ప్రతికారంగా అతడికి శిక్ష విధించగలమా? నిస్సందేహంగా ఇది జరగని పని, అంటే ఏదో ఓ ప్రదేశం కావాలి ఇలాంటి మనుషులకు శిక్షపడడానికి మరియు ఎవరైతే అన్యాయానికి గురి అయ్యారో వారు తృప్తిపడడానికి. అలాగే మృత్యువు అల్లాహ్ యొక్క శక్తి నిదర్శనాలలో ఒకటి, దీంతో అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు: “మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.[ముల్క్:02] అలాగే ఈ మృత్యువు అంహంకారులకు మరియు అతిగా ప్రవర్తించేవారికి పగ్గం లాంటిది, అంటే ఏ పని చేసినా చివరికి మరణించాల్సిందే, మృత్యువు రుచిని చూడడం తప్పదు. నిజానికి మృత్యువే మనిషిని పాపాల నుండి ఆపుతుంది.
ఆ వ్యక్తి: అంటే అందరూ చావాల్సిందేనా.
మౌలానా: ఔను, ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే”[ఆలి ఇమ్రాన్:185] అల్లాహ్ తప్ప మరేవరూ ప్రాణాలతో ఉండరు; “భూమండలంపై ఉన్నవారంతా నశించి పోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”[సూరయె రహ్మాన్:26,27]
ఆ వ్యక్తి: అంటే ప్రాణాలతో ఉండే మార్గమే లేదంటారా?
మౌలానా గారు: దేహపరంగా చూసుకుంటే ఏ మార్గమూ లేదు, కాని ప్రజలలో కొందరు వారు చేసిన పనుల వల్ల నిత్యం ప్రాణాలతోనే ఉంటారు. ఉదాహారణకు అమరవీరులు, వారు నిజానికి మరణించారు కాని వారి పేరూ వారి ఆలోచన నిత్యం మిగిలి ఉంటారు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది”[ఆలి ఇమ్రాన్:169]
ఆ వ్యక్తి: అల్లాహ్ మా అందరికి అల్లాహ్ మార్గంలో షహీద్ అయ్యే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అమరులు కూడా మా పట్ల సమ్మతం కలిగి ఉండాలి.  
మౌలానా గారు: ఇన్ షా అల్లాహ్, అమరవీరుల సమ్మతం పొందాలంటే వారు నడిచి మార్గం పై మేము కూడా నడవాలి.
మౌలానా గారు: అమరవీరుల ప్రస్తావనం వచ్చింది కాబట్టి ఈ రోజు ఖుర్ఆన్ పారాయనం యొక్క పుణ్యం వారి ఆత్మలకు అంకితం చేద్దాం దైవప్రవక్త(స.అ) ముహమ్మద్ మరియు వారి పవిత్ర అహ్లెబైత్(అ.స) పై దురూద్ పంపుతూ.

రిఫరెన్స్
మఆనియుల్ అఖ్బార్,. షేఖ్ సదూఖ్, దఫ్తరె ఇంతెషారాతె ఇస్లామీ వాబస్తె బె జామిఅ ముదర్రిసీనె హైజహ్ ఇల్మియహ్ ఖుమ్, 1403ఖ, అల్ నస్, పేజీ290,  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15