ఇమామ్ హుసైన్(అ.స) త్యాగం యొక్క ప్రతిఫలం

శని, 03/27/2021 - 09:13

అల్లాహ్ తరపు నుండి ఇమామ్ హుసైన్(అ.స)కు ప్రసాదించబడ్డ ప్రత్యేక అనుగ్రహాలు...

ఇమామ్ హుసైన్(అ.స) త్యాగం యొక్క ప్రతిఫలం

ప్రాపంచిక జీవితం వివిధ కష్టాలతో మరియు ఆపదలతో నిండి ఉంటుంది, వాటిలో కొన్ని మనిషి కోసం చాల మంచివిగా కనిపిస్తాయి మరి కొన్ని చెడుగా మరియు నిరాశ కలిపించేవిగా కనిపిస్తాయి. ఈ కష్టాలకు గల కొన్ని కారణాలు మన జీవితంలోనే మన కోసం స్పష్టమౌతాయి కాని కొన్ని అలాగే తెలియకుండా ఉండిపోతాయి. ఒకవేళ మేము అల్లాహ్ హకీమ్ అనీ ఆయన ఏదీ కారణం లేకుండా చేయడు అనీ, దాసుల పట్ల ఆయన ప్రేమ బిడ్డ పట్ల తల్లికి ఉండే ప్రేమకు మించింది అని నమ్మినట్లైతే, జీవితంలో మనకు ఎదురొచ్చే కష్టాల పట్ల మన ఆలోచన మారుతుంది, వాటిని మనం కేవలం మంచివిగానే చూస్తాము. అవి మాకు కష్టాలుగా కనిపించవు. కర్బలాలో జరిగిన ఘాతకం మరియు దుర్మార్గం తరువాత చరిత్రలోనే నిలిచిపోయే జనాబె జైనబ్(స.అ) యొక్క ఈ వాక్యం “నాకు వీటన్నీంటిలో సౌదర్యం తప్ప మరేదీ కనిపించలేదు”[1] వారి యొక్క గట్టి విశ్వాసానికి నిదర్శనం.
అల్లాహ్ యొక్క న్యాయవ్యవస్థ మరియు ఆయన కారుణ్య కూటిలో ఏ ఉత్తమ కార్యం కూడా ప్రతిఫలం లేకుండా మిగిలిపోదు అన్న నమ్మకం; విశ్వాసి హృదయం యొక్క దృఢత్వానికి కారణం; నిజానికి అల్లాహ్ దానికి రెట్టింపుగా ప్రసాదిస్తాడు.
అల్లాహ్ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అనే ఈ మాటకు మంచి నిదర్శనం అల్లాహ్ ఇమామ్ హుసైన్(అ.స)కు ప్రసాదించిన బహుమతులు. ఇమామ్ హుసైన్(అ.స) అల్లాహ్ మార్గంలో తన వద్ద ఉన్న ధనాన్ని, సంతానాన్ని చివరికి తన ప్రాణాలను పూర్తి స్వచ్చతతో అర్పించారు. దానికి ఫలితంగా అల్లాహ్ కూడా వారికి ప్రత్యేక అనుగ్రహాలను ప్రసాదించాడు.
కేవలం ఇమామ్ హుసైన్(అ.స)కు ప్రత్యేకంగా ప్రసాదించబడిన అనుగ్రహాలు:
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) మరియు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క ఉల్లేఖనం: “అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, హజ్రత్ హుసైన్(అ.స) యొక్క త్యాగానికి ప్రతిఫలంగా నాలుగు ప్రత్యేక అనుగ్రహాలను ప్రసాదించెను:
1. తుర్బతె ఇమామ్ హుసైన్(అ.స)ను స్వస్థత మట్టిగా నిర్ధారించబడడం:
ఇస్లాం యొక్క నిర్ణిత ఆదేశాలలో ఒకటి; మట్టిని తినడం హరామ్ గా నిర్ధారించబడడం; చివరికి దైవప్రవక్త(స.అ) సమాధి మట్టి అయినా సరే. ఈ ఆదేశానికి ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధి యొక్క మట్టి మినహాయింపబడినది. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఈ మట్టి మరియు భూమి గురించి ఇలా అన్నారు: “ఈ తోట(కర్బలా) స్వర్గపు తోటల నుంచి ఒక తోట”[3]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) వద్ద ఒక సంచి ఉండేది అందులో తుర్బతె ఇమామ్ హుసైన్(అ.స) ఉండేది దానిని నమాజ్ కోసం ఉపయోగించేవారు. అలాగే కొన్ని రివాయతలలో ఇమామ్ హుసైన్(అ.స) తుర్బత్ తో మాల(తస్బీహ్) తయారు చేసి దాంతో జిక్ర్ పఠించకపోయినా, అది దగ్గర ఉంచుకునేవారికి పుణ్యం లిఖించబడుతుంది, అని ఉల్లేఖించబడి ఉంది. ఇవన్ని కేవలం ఇమామ్ హుసైన్(అ.స) తుర్బత్ కే ప్రత్యేకించబడినవి మరియు అల్లాహ్ ఈ ప్రత్యేక స్థానం అబాఅబ్దిల్లాహిల్ హుసైన్(అ.స)కు బుహుమతిగా ప్రసాదించెను.

2. వారి గోపురం క్రింద చేసే దుఆ స్వీకరించబడడం:
ప్రతీ ఒక్క విశ్వాసి అతడి దుఆ స్వీకరించబడాలి అని కోరుకుంటాడు. ఇమామ్ హుసైన్(అ.స)కు ప్రసాదించబడిన ప్రత్యేకత వారి గోపురం క్రింద చేసిన దుఆ రద్దు చేయబడకపోవడం. ఇమామ్ అలీ నఖీ(అ.స) సామెర్రా పట్టణంలో ఉండగా అనారోగ్యానికి గురి అయ్యారు, అప్పుడు వారు అనుచరులలో ఒకరిని ఇమామ్ హుసైన్(అ.స) హరమ్(సమాధి) వద్దకు దుఆ చేయమని పంపించారు. అతడికి సందేహం వచ్చింది ఇమామ్ అలీ నఖీ(అ.స) స్వయంగా ఇమామ్, అయితే వారు ఎందుకని ఇమామ్ హుసైన్(అ.స) హరమ్ కు వెళ్లి దుఆ చేయమని అన్నారు అని. అతడు ఇమామ్ వద్దకు వచ్చి.. మీరు అల్లాహ్ తరుపు నుంచి నియమించబడ్డ ఇమామ్ అయి ఉండి మీ కోసం నేను అక్కడికి వెళ్లి దుఆ ఎందుకని చేయాలి2. అని ప్రశ్నించాడు. ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: “ప్రతీ ప్రదేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఇమామ్ హుసైన్(అ.స) హరమ్ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ దుఆ చేస్తే అల్లాహ్ అక్కడికక్కడే దానికి స్వీకరించడాన్ని ఇష్టపడతాడు. అందుకని నీవు అక్కడే దుఆ చేయి”[4]

3. తొమ్మిది ఇమాములు, ఇమామ్ హుసైన్(అ.స) సంతానంగా నిర్ధారించబడడం:
ఖుర్ఆన్ మరియు రివాయతుల ప్రకారం అల్లాహ్ సృష్టితాలలోనే పరిపూర్ణమైన వారు అయిమ్మయె అత్హార్(అహ్లెబైత్). అల్లాహ్ ఆ అయిమ్మల నుండి 9 మందిని ఇమామ్ హుసైన్(అ.స)గా సంతానం గా నిర్ధారించెను. ఇదే ఇమామ్ హుసైన్(అ.స)కు ప్రసాదించబడిన మూడవ ప్రత్యేకత.

4. ఇమామ్ హుసైన్(అ.స) దర్శనంలో గడిపిన సమయం లెక్కించబడకపోవడం:
అల్లాహ్ ప్రసాదించిన అతి ముఖ్యమైన అనుగ్రహాలలో ఒకటి అతడి జీవితం. ఈ అనుగ్రహం అతి త్వరగా ముందుకు సాగిపోతూ ఉంటుంది, ఇది తిరిగి రాని మరియు పరిహారం ఎరగనిది. ఇమామ్ హుసైన్(అ.స) దర్శనం గురించి అలోచించదగిన అంశమేమిటంటే కాలం మరియు క్షణాలు తన అర్ధాన్ని వదిలేసుకుంటాయి మరియు వయసు కదలకుండా నిలిచిపోతుంది. నిజానికి అల్లాహ్ తన దాసులకు కొత్తజీవితాన్ని ప్రసాదించినట్లు. అందుకే దర్శనం తరువాత మనిషి పాపములన్నీ తుడిచిపోయి అప్పుడే తల్లి కడుపు నుంచి పుట్టన వాడిగా మారుతాడు అని హదీసులు వివరిస్తున్నాయి. 

రిఫరెన్స్
1. లుహూఫ్, పేజీ160
2. ఇద్దతుద్దాయి, పేజీ57
3. అల్ కాఫీ, భాగం3, పేజీ242
4. కామిల్ అల్ జియారాత్, పేజీ274 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
20 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18