ఇమామ్ హుసైన్[అ.స] సాటిలేని వారు, వారికి వారే సాటి. దానికి మిగతా ఇమాముల హదీసులే నిదర్శనం.
మాసూములందరూ ఒకటే, అందరి సృష్టి యొక్క మూలం ఒక్కటే. అందరూ మానవులను సన్మార్గం చూపడానికి వచ్చారు. వారందరిని గౌరవించడం మరియు వారి చరిత్రను తెలుసుకోవడం అవసరం. వారి ఉపదేశాలను ప్రపంచానికి తెలియపరచడం మన లక్ష్యం అయి ఉండాలి. అనప్పటికీ ఇమామ్ హుసైన్[అ.స] యొక్క స్థానం సాటిలేనిది. మరో విధంగా చెప్పాలంటే వారికి వారే సాటి. అతనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి అవి వారికే సొంతం. వాటిలో కొన్ని:
1. దుఆ అంగీకరణ: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “హుసైన్ సమాధి వద్ద దుఆ చేస్తే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది”[వసాయిల్ అల్ షియా, భాగం14, పేజీ452]. ఇమామ్ అలీ నఖీ[అ.స] అనారోగ్యంతో ఉన్నప్పుడు, కొంత డబ్బు ఇచ్చి “కర్బలాకు వెళ్ళి మా పితామహులైన హుసైన్[అ.స] సమాధి గోపురం క్రింద నాకోసం దుఆ చేయండి” అని అన్నారు.[వసాయిల్ అల్ షియా, భాగం14, పేజీ537].
2. కర్బలా మట్టి: అందులో షిఫా(ఆరోగ్యం) ఉంది. అందుకే దానిని “ఖాకె షిఫా” అనగా ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి, అని అంటారు.
3. నిరంతర రోదన: వారి కోసం ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవి ఏడ్చింది, రోదించింది మరియు నిరంతరం రోదిస్తూనే ఉన్నారు.
4. ప్రత్యేక రోజులలో జియారత్: ఇస్లామీయ సందర్భాలన్నీంటిలో ఇమామ్ హుసైన్[అ.స] జియారత్ ఉంది.
రిఫ్రెన్స్
హుర్రెఆములి, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్ లి అహ్యాయిత్తురాస్, ఖుమ్.
వ్యాఖ్యానించండి