అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ ఆలిమ్ వవిరించిన అంశం ఇమామ్ హుసైన్[అ.స] పట్ల దైవప్రవక్త[స.అ] ప్రేమ.
“ౙమఖ్షరీ”(అహ్లెసున్నత్ యొక్క గొప్ప ఉలమాలలో ఒకరు), “అల్ కష్షాఫ్” గ్రంథ రచయిత. ఇతను తన మరో “రబీవుల్ అబ్రార్” అనే గ్రంథంలో ఇలా ఉల్లేఖించారు: “ఫాతెమా[స.అ] తన కుమారులైన హసన్ మరియు హుసైన్[అ.స]లను తీసుకొని దైవప్రవక్త[అ.స] వద్దకు వచ్చి ఇలా అన్నారు: ‘యా రసూలల్లాహ్! వీళ్ళకు ఏదైనా బహుమతివ్వండి’.
దైవప్రవక్త[అ.స]: “ఏమివ్వనమ్మా! వీళ్ళకు బహుమతివ్వడానికి నాదగ్గర ధనం లేదు”
ఆ తరువాత హసన్[అ.స]ను ఓడిలో తీసుకొని, ముద్దు పెట్టి తన కుడి కాలు పై కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు: ‘నా ఈ కుమారునికి నేను నా సద్గుణాన్ని మరియు గంభీరాన్ని బహుమతిగా ఇస్తున్నాను’ (ఆ తరువాత) హుసైన్[అ.స]ను ఓడిలో తీసుకొని, ముద్దాడి తన ఎడవ కాలు పై కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు: ‘ధైర్య సాహసాలను మరియు ఔదార్యాన్ని బహుమతిగా ఇస్తున్నాను”[రబీవుల్ అబ్రార్, పేజీ513].
రిఫ్రెన్స్
ౙమఖ్షరీ, రబీవుల్ అబ్రార్, పేజీ513, దీనిని ఖాజీ నూరుల్లాహ్ షూష్తరీ తన గ్రంథం అహ్ఖాఖుల్ హఖ్ లో ఉల్లేఖించారు.
వ్యాఖ్యలు
Mashallah jazakallah
Shukriya.. Iltemase dua.
Salaamun alaikum.
Mashallah. Allah welayat team ko salamat rakhe.
Wa alaikumus Salaam. Shukriya.. Ilaahi Ameen.
వ్యాఖ్యానించండి