రమజాన్ మాసం యొక్క 28వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 05/10/2021 - 10:08

రమజాన్ మాసం యొక్క 28వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 28వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మ వఫ్ఫిర్ హజ్జీ ఫీహి మినన్ నవాఫిల్, వ అక్రింని ఫీహి బి ఇహ్జారిల్ మసాయిల్, వ ఖర్రిబ్ ఫీహి వసీలతీ ఇలైక మిన్ బైనిల్ వసాయిల్, యా మల్ లా యష్గలుహు ఇల్ హాహుల్ ములిహ్హీన్[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నా ముస్తహబ్ కార్యముల శాతాన్ని పెంచు. నా విజ్ఞాపములను వాస్తవముగా చేసి నా పై దయ చూపించు. ఆశ్రయాల నుండి నీ సామిప్యం కలగజేసే ఆశ్రయాన్ని ప్రసాదించు, ఓ మొండివారి మొండితనానికి లోంగనివాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్! ఈ నెలలో నా ముస్తహబ్ కార్యముల శాతాన్ని పెంచు
రమజాన్ మాసం యొక్క 28వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ నెలలో మా ముస్తహబ్ కార్యముల శాతాన్ని పెంచు అని వేడుకుంటున్నాము. దుఆలో నవాఫిల్ అనే పదం ఉంది. నాఫెలహ్ అనగా మంచి మరియు ముస్తహబ్ కార్యం అని, అయితే దాని నిర్వర్తన మనిషిపై విధి కాదు.[2] ఫిఖా పరిభాషలో నాఫెలహ్ ముస్తహబ్ నమాజుల కోసం ఉపయోగపడే పదం.[3]
ప్రతిరోజు నాఫెలా నమాజుల రక్అత్లు 34 రకఅత్లు:
జొహర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 8 రక్అతుల నమాజ్, ఇవి నమాజె జొహ్ర్ కు ముందు చదవాలి.
అస్ర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 8 రక్అతుల నమాజ్, ఇవి నమాజె అస్ర్ కు ముందు చదవాలి.
మగ్రిబ్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 4 రక్అతుల నమాజ్, ఇవి నమాజె మగ్రిబ్ తరువాత చదవాలి.
ఇషాఁ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 2 రక్అతుల నమాజ్ కూర్చొని నమాజె ఇషాఁ తరువాత చదవాలి. ఇది ఒక రక్అత్ గా లెక్కించబడుతుంది.
నమాజె షబ్(తహజ్జుద్ నమాజ్): 11 రక్అతులు. (8 రక్అత్లు నమాజె షబ్, 2 రక్అత్లు నమాజె షఫ్ మరియు ఒక రక్అత్ నమాజె విత్ర్ మొత్తం 11 రక్అత్లు) ఈ నమాజ్ అర్థరాత్రి తరువాత నుంచి ఫజ్ర్ నమాజ్ అజాన్ వరకు చదవవచ్చు.
ఫజ్ర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 2 రక్అతుల నమాజ్, ఇవి నమాజె ఫజ్ర్ కు ముందు చదవాలి.[4]
నవాఫిల్ నమాజ్ యొక్క ప్రాధాన్యత:
ఇస్లాం బోధనలనుసారం నవాఫిల్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటి ప్రముఖ్యతను వివరిస్తూ చాలా రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “నిర్లక్ష్యం మరియు సోమరితనం మీ నుంచి దూరం అవుగాక! నిస్సందేహంగా మీ ప్రభువు అనంతకరుణామయుడు. చిన్న విషయానికి కూడా కృతజ్ఞత తెలుపుతాడు(స్వీకరిస్తాడు మరియు దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు). ఒకవ్యక్తి అల్లాహ్ ప్రసన్నత కోసం రెండు రక్అత్లు ముస్తహబ్ నమాజును నిర్వర్తిస్తాడు ఆ వ్యక్తి చదివిన ఆ రెండు రక్అత్ల నమాజ్ కారణంగానే అతడిని స్వర్గంలో ప్రవేశించడానికి అనుమతి ఇస్తాడు”[5]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నిస్సందేహంగా నా దాసుడు నాఫెలా మరియు ముస్తహబ్ కార్యములు నా సామిప్యం కోసం నేను అతడిని ఇష్టపడాలనే ఉద్దేశంతో నిర్వర్తిస్తే నేను అతడిని ఇష్టపడడం మొదలు పెడితే నేను అతడు వినే చెవులనువుతాను, నేను అతడు చూసే కళ్లనవుతాను, నేను అతడు మాట్లాడే నోరునౌతాను.....”[6]
రెండవ అంశం: నా విజ్ఞాపములను వాస్తవముగా చేసి నా పై దయ చూపించు
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! మా విజ్ఞాపములను వాస్తవముగా చేసి మా పై దయ చూపించు అని వేడుకుంటున్నాము.
మూడవ అంశం: అల్లాహ్ సామిప్యం కలగజేసే ఆశ్రయ ప్రార్థన  
రమజాన్ మాసం యొక్క 28వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను మా ఆశ్రయాల నుండి నీ సామిప్యం కలగజేసే ఆశ్రయాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నాము. షియా మూల గ్రంథాలనుసారం దేన్ని పడితేదన్ని ఆశ్రయం చేసుకొని అల్లాహ్ సామిప్యాన్ని పొందలేరు. రివాయతుల ద్వార దేన్ని మధ్యస్థము చేసి అల్లాహ్ సామిప్యం పొందవచ్చు అనే విషయంలో ఈ కొన్ని విషయాలు వివరించబడి ఉన్నాయి.. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స.అ) పై విశ్వాసం[7] అల్లాహ్ మార్గంలో జిహాద్, ఇఖ్లాస్, నమాజ్ చదవడం, జకాత్ చెల్లించడం, రమజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వర్తించడం, హజ్ మరియు ఉమ్రా చేయడం, బంధుమిత్రులతో సంబంధం, సద్ఖా, ఖుర్ఆన్[8] అల్లాహ్ పేర్లు మరియు ఆయన లక్షణాలు[9] విశ్వాసుల మరియు సజ్జనుల దుఆ[10] దైవప్రవక్త(స.అ) దుఆ[11] స్వయంగా దైవప్రవక్త(స.అ)ను, పవిత్ర అహ్లెబైత్(అ.స)లను[12] అలాగే ప్రతీ మంచి పని[13]ని ఆశ్రయించవచ్చు.
చివరిమాట: ఓ అల్లాహ్! మనలో ఉన్న లోపాలను దూరం చేసి మనకు నీ సాన్నిహిత్యాన్ని సాధించిపెట్టే మార్గాన్ని ప్రసాదించు.
రిఫరెన్స్
1. అల్ ఇఖ్బాలు బిల్ అఅమాలిల్ హసనహ్, భాగం1, పేజీ404
2. అల్ మున్జిద్, భాగం2, పేజీ1986
3. ముస్తలెహాతుల్ ఫిఖ్, మిష్కీనీ, అలీ, పేజీ528
4. తౌజీహుల్ మసాయిల్, ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), భాగం1, పేజీ425, మస్అలహ్746
5. వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములి, భాగం4, పేజీ44
6. ఉసూలె కాఫీ, భాగం4, పేజీ53
7. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్110
8. సహీఫయె సజ్జాదియహ్, దుఆయె 42
9. وَ لِلَّهِ الْأَسْماءُ الْحُسْنى‏ فَادْعُوهُ بِها وَ ذَرُوا الَّذينَ يُلْحِدُونَ في‏ أَسْمائِهِ سَيُجْزَوْنَ ما كانُوا يَعْمَلُون (సూరయె అఅరాఫ్, ఆయత్180)
10. وَ الَّذينَ جاؤُ مِنْ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنا وَ لِإِخْوانِنَا الَّذينَ سَبَقُونا بِالْإيمانِ وَ لا تَجْعَلْ في‏ قُلُوبِنا غِلاًّ لِلَّذينَ آمَنُوا رَبَّنا إِنَّكَ رَؤُفٌ رَحيمٌ  (సూరయె హష్ర్, ఆయత్10)
11. وَ ما أَرْسَلْنا مِنْ رَسُولٍ إِلاَّ لِيُطاعَ بِإِذْنِ اللَّهِ وَ لَوْ أَنَّهُمْ إِذْ ظَلَمُوا أَنْفُسَهُمْ جاؤُكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَ اسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّاباً رَحيماً (సూరయె నిసా, ఆయత్64)
12. బిహారుల్ అన్వార్, భాగం24, పేజీ84
13. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్110

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15