ఖుర్ఆన్ అంతర్భావాలు తెలిసినవారు

శని, 06/05/2021 - 17:04

అహ్లెబైత్(అ.స)లే నిజమైన ఖుర్ఆన్ అంతర్భావాలు తెలిసినవారు అన్న విషయంపై ఖుర్ఆన్ మరియు హదీస్ వివరణ...

ఖుర్ఆన్ అంతర్భావాలు తెలిసినవారు

షియా ముస్లిముల అహ్లెబైత్(అ.స)లు ప్రజలందరిలో అందరికంటే జ్ఞానులు, ఉత్తములు, అల్లాహ్ భీతిగలవారు, పవిత్రులు అని విశ్వసిస్తారు. వారి మాటలు, విశ్వాసాలు నిజమైనవి అని చెప్పడానికి కేవలం ఒక ఉదాహారణ చాలు. వారు ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ఆదేశాలనుసారం ఇలా నమ్ముతారు. అల్లాహ్ ఇలా ప్రవచించెను: “నేను నక్షత్రాల స్థానాలు సాక్షిగా చెబుతున్నాను, మరియు నీకు ఈ ప్రమాణం ఎంత పెద్ద ప్రమాణమో తెలుసా, ఈ ఖుర్ఆన్ చాలా మహోన్నతమైనది, ఒక సురక్షితమైన గ్రంథంలో ఉంచబడి ఉంది, దానిని పరిశుధ్ధులు తప్ప మరెవరూ తాకలేరు” [సూరయె వాఖిఅహ్, ఆయత్:75-79]

ఈ ఆయత్‌తో పాటు మరెన్నో ఆయతులు స్పష్టంగా ఎటువంటి సందేహం లేకుండా “ఖుర్ఆన్ యొక్క క్లిష్టమైన మరియు కఠినమైన ఆయతులను కేవలం అహ్లెబైత్(అ.స)లు మాత్రమే అర్ధం చేసుకోగలరు” అని సూచిస్తున్నాయి.

అల్లాహ్ చేసిన ప్రమాణాల గురించి కొంచెం దీర్ఘంగా ఆలోచించినట్లయితే, అల్లాహ్ దృష్టిలో అవి చాలా ముఖ్యమైనవి. అల్లాహ్, అస్ర్(కాలం), ఖలం(కలం), తీన్(అత్తి) మరియు జైతూన్(ఆలీవ్)పై ప్రమాణం చేసినప్పుడు, తప్పకుండా నక్షత్రాల స్థానాలు, కక్ష్యలు చాలా ముఖ్యమైనవై ఉంటాయి. ఎందుకంటే అందులో ఉన్న వింత ప్రభావం అల్లాహ్ ఆజ్ఞతో ఈ ప్రపంచం పై పడుతూ ఉంటుంది. అల్లాహ్ యొక్క ఈ ప్రమాణం, ఒక విషయాన్ని తిరస్కరిస్తూ చేస్తున్న ప్రమాణం కాదు, అదొక నిశ్చయభావంతో చేసిన ప్రమాణం.

ప్రమాణం తరువాత అల్లాహ్, ఈ మహోన్నతమైన మరియు శ్రేష్ఠమైన ఖుర్ఆన్, ఒక సురక్షితమైన గుప్త గ్రంథంలో ఉంది అని తాఖీదు చేస్తున్నాడు. ఆ తరువాత ఇలా ప్రవచించెను: ఖుర్ఆన్ పరిశుధ్ధులు తప్ప వేరే వాళ్లు తాకలేరు (అనగా అర్ధం చేసుకోలేరు). ఇక్కడ తాకలేరు అనడం కన్న అర్ధం చేసుకోలేరు అనడం మంచిది. ఎందుకంటే ఈ ఆయత్‌లో ఉన్న “لا” ప్రమాణం తరువాత వచ్చింది, అలా వచ్చినప్పుడు అరబిక్ గ్రామర్ ప్రకారం దాన్ని “లాయే నాహియహ్” అంటారు. మరియు “مس” యొక్క అర్ధం, “అర్ధం చేసుకోవడం” అంతేగాని చేతితో తాకడం కాదు. కొందరు తాకడం అని అనుకుంటారు కూడా, కాని “لمس” మరియు “مس” మధ్య చాలా తేడా ఉంది. ఖుర్ఆన్ నుండి కొన్ని ఉదాహారణాలు:

అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించెను: إِنَّ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ إِذَا مَسَّهُمۡ طَٰٓئِفٞ مِّنَ ٱلشَّيۡطَٰنِ تَذَكَّرُواْ فَإِذَا هُم مُّبۡصِرُونَ “వాస్తవానికి భయభక్తులు కలవారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా షైతాను ప్రభావం వల్ల వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ, వారు తక్షణం అప్రమత్తులవుతారు. తరువాత వారు అవలంబించవలసిన సరియైన మార్గమేమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది”[సూరయె ఆరాఫ్, ఆయత్:201] అలాగే మరో చోట ఇలా ప్రవచించెను: ٱلَّذِينَ يَأۡكُلُونَ ٱلرِّبَوٰاْ لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ ٱلَّذِي يَتَخَبَّطُهُ ٱلشَّيۡطَٰنُ مِنَ ٱلۡمَسِّۚ.... “వడ్డీ తినే వారి స్థితి (ప్రళయం నాడు) షైతాను పట్టటం వల్ల ఉన్మాది అయిన వారి స్థితిలో నిలబడి ఉంటారు”[సూరయె బఖరా, ఆయత్:275]  

ఈ రెండు ఆయతులలో “مس” పదానికి అర్ధం ఏమాత్రం చేతితో తాకడం కాదు. దానికి అసలైన అర్ధం “బుద్ధి” మరియు “తెలుసుకోవడం”. ఒకవేళ ఎవరైన మాతో, “ఖుర్ఆన్‌ను పరిశుధ్ధులు తప్ప వేరే వాళ్లు తాకలేరు” అని అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పినా సరే చరిత్రలో ఉన్నట్లు, బనీ ఉమయ్యాహ్ అధికారులు ఖుర్ఆన్ పట్ల అసభ్య ప్రవర్తన ఎలా చేయగలిగారు?, చివరికి వలీద్ చెప్పిన మాటలు కూడా చరిత్రలో ఉన్నాయి. వలీద్ ఇలా అన్నాడు:
أتـوعدنی من کل جبارعنيد                فهـا انا ذاک جـبار عنيـد
اذا
مـا جئت ربک يوم حشر               فقل يـا ربّ مزقنی الوليد
అనవాదం: “ఓ ఖుర్ఆన్! నీవు చెడు మరియు అధర్మ అధికారులను హెచ్చరిస్తావా!?, నేనొక రక్తం త్రాగే దుర్మార్గుడని, ప్రళయంనాడు అల్లాహ్‌తో కలిస్తే గనుక నా పట్ల ఇలా ఫిర్యాదు చేయి: వలీద్ నన్ను ముక్కలు ముక్కలుగా చింపాడు, అని”.

ఇంతే కాకుండా నేను నా కళ్ళతో చూశాను, ఇజ్రాయీల్, బీరూత్ పై దాడి చేసినప్పుడు, ఖుర్ఆనులను దహనం చేశారు, మరియు వాటిని కాళ్ళతో తొక్కారు. ఆ కిరాతక దృశ్యం యొక్క కొన్ని ఫొటోలు టీవీలో చూపించారు. అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పిన సరే ఇలా ఖుర్ఆన్ పట్ల అసభ్య ప్రవర్తన ఎలా చేయగలిగారు?
ఈ ఆయత్‌లో ఉన్న “ఖుర్ఆన్” పదం యొక్క భావం “ఖుర్ఆన్ యొక్క యదార్ధం” అని, అందుకే మేము ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే “ఖుర్ఆన్ యొక్క యదార్ధాన్ని” అల్లాహ్ చేత ఎన్నుకోబడ్డ మరియు పరిశుధ్ధులు తప్ప మరెవ్వరూ అర్ధం చేసుకోలేరు అని.

ఇందుమూలంగా ఈ ఆయత్‌లో, “مطهرون” వున్న స్ధానం, కర్మ స్ధానం అనగా ఎవరైతే పరిశుధ్ధులు చేయబడ్డారో. మరియు అల్లాహ్ స్వయంగా వాళ్ళ గురించి ఇలా ప్రవచించెను: إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُذۡهِبَ عَنكُمُ ٱلرِّجۡسَ أَهۡلَ ٱلۡبَيۡتِ وَيُطَهِّرَكُمۡ تَطۡهِيرٗا; “దైవప్రవక్త(స.అ) అహ్లెబైతులైన మీ నుండి (అన్ని విధాల) అపవిత్రతలను దూరంగా ఉంచి మిమ్మల్ని పూర్తిగా పవిత్రులుగా ఉంచాలని అల్లాహ్ ఉద్దేశం”[అహ్జాబ్ సూరా:33, ఆయత్:33]

“لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ” యొక్క అసలైన అర్ధం: “అహ్లెబైత్(అ.స)లు తప్ప ఖుర్ఆన్ యాదార్ధాన్ని మరెవ్వరూ అర్ధం చేసుకోలేరు”. అందుకే దైవప్రవక్త(స.అ) వాళ్ళ గురించి ఇలా ప్రవచించారు: ”النّجوم‏ امان‏ لاهل‏ الارض‏ من‏ الغرق‏ و اهل بيتى امان لأمّتى من الإختلاف فاذا خالفتها قبيلة من العرب فصاروا حزب ابليس “; “నక్షత్రాలు, భూమి పై ఉన్న వాళ్ళను మునగకుండా కాపాడతాయి మరియు నా అహ్లెబైత్(అ.స)లు నా ఉమ్మత్‌ను వైరుధ్యం నుండి కాపాడుతారు. ఒకవేళ అరబ్ దేశపు ఒక సంఘం లేదా ఒక సమూహం గాని వాళ్ళకు వ్యతిరేకులైతే వాళ్ళు కేవలం షైతాను సైన్యం అయి ఉంటారు”[1].

ఇందు మూలంగా, “అహ్లెబైత్(అ.స)ల పట్ల షియా ముస్లింలు చూపించే గౌరవాన్ని అతిశయోక్తి” అని చెప్పే అహ్లె “సున్నత్ వల్ జమాఅత్”ల వచనం నిరాధారమైనది అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ సహ్హాహ్ గ్రంథాలలో కూడా ఈ ప్రవచనములు ఉన్నాయి కాబట్టి.[2]

రిఫరెన్స్
1. హాకిం, ముస్తద్రక్ భాగం3, పేజీ149లో ఈ రివాయత్‌ను ఇబ్నె అబ్బాస్ ప్రవచానుసారంగా ఉల్లేఖించి ఇలా వ్రాశారు: ఈ హదీస్ యొక్క రావీయుల క్రమమం సరైనది కాని బుఖారీ మరియు ముస్లిం దాన్ని వ్రాయలేదు.
2. లెఅకూన మఅస్సాదిఖీన్, తీజానీ, ఖుర్ఆన్ పట్ల విశ్వాసం అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 50