అరఫా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాలు

ఆది, 07/11/2021 - 18:00

అరఫా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాల ద్వార ఇక్మాల్ ఆయత్ ఆ రోజు అవతరించబడలేదు అని రుజువు అవుతుంది...

అరఫా ఉపన్యాసం యొక్క ముఖ్యంశాలు

అరఫా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాల ద్వార ఇక్మాల్ ఆయత్ ఆ రోజు అవతరించబడలేదు అని రుజువు అవుతుంది...

అరఫా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాలు: 
1. ముస్లిములారా! ఎలాగైతే మీ ఈ నెల(జిల్‌హిజ్) మరియు ఈ రోజు(అరఫా రోజు) పూజనీయమైనదో అలాగే అల్లాహ్ మీ పై ముస్లిములను చంపడానికి మరియు దోచుకోవడానికి హరామ్‌గా కూడా నిర్ధారించాడు.
2. అల్లాహ్ పట్ల భక్తి శ్రధ్ధలను పెంచుకోండి, భూమి పై కలహాలను రేపకండి, ఎవరి దగ్గరైనా ఏ ఒక్కరి వస్తువు లేదా సొమ్ము ఉంటే దాన్ని అతడి వద్దకు చేర్చండి, ప్రజలకు వాళ్ళు(కొనుకున్న) వస్తువులను వాళ్ళకు తగ్గించి ఇవ్వకండి.
3. ఇస్లాంలో అందరు సమానులు. అరేబీయులకు, అరేబీయుల కాని వారి పై ఉత్తములు కారు. ప్రతిష్టితకు కేవలం దైవనిష్ఠ ఒక్కటే కారణం.
4. అవిశ్వాసపు కాలంలో చేసిన హత్యలు నా కాళ్ళ క్రింద మరి అవిశ్వాసపు కాలంలో(సొంతం) చేసుకున్న ప్రతీ వడ్డీ మరియు లాభం నా కాళ్ళ క్రింద(అనగా అంతా అంతమైపోయింది).
5. ప్రజలారా! నసీ(నెలలను వెనక్కి ముందుకి చేయడం) కూడా అవిశ్వాసపు ఘాతకమే... జాగ్రత్తగా ఉండండి కాలం తిరిగీ తిరిగీ చివరికి అల్లాహ్ నింగీ నేలను సృష్టించినప్పటి స్థితికే వచ్చింది.
6. అల్లాహ్ వద్ద నెలలు సంఖ్య 12 అని ఖుర్ఆన్‌లో ఉంది వాటిలో నుండి నాలుగు నెలలో యుధ్ధం చేయడం హరామ్.
7. నేను మీకు, స్త్రీలతో మంచిగా ఉండమని వసీయత్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు వాళ్ళను అల్లాహ్ నుండి బాధ్యతగా తీసుకున్నారు. మరియు అల్లాహ్ గ్రంథం మూలంగానే స్త్రీలు మీ పై హలాల్ చేయబడ్డారు.
8. నేను బానిస స్త్రీల గురించి నీవు ఏదైతే తింటావో అదే వాళ్ళకు కూడా తినిపించు మరియు నీవు ఏదైతే ధరిస్తావో వాళ్ళకు కూడా అదే ఇవ్వు, అని వసీయత్ చేస్తున్నాను.
9. ముస్లిములందరూ అన్నదమ్ములు, ముస్లిం తన సోదరునికి అపకారం తలపెట్టకూడదు, అతడిని మోసం చేయకూడదు, అతడి గురించి చెడుగా చెప్పకూడదు. ముస్లిముల ప్రాణం తీయడం లేదా సొమ్ము దోచుకోవడం న్యాయసమ్మతైనది కాదు.
10. ఈ నాటి తరువాత సైతాన్ తనను పూజించబడడని నిరాశకు గురి అయ్యాడు కాని మీరు చేసే చిన్న చిన్న తప్పులలో అతడి ఆచరణ జరుగుతూ ఉంటుంది.
11. అల్లాహ్ యొక్క పెద్ద శత్రువులు వీళ్ళు; తన ఘాతకుడిని తప్ప వేరే ఘాతకులను చంపేవాడు మరియు తనను హింసించిన వాడిని తప్ప వేరే వాడితో దెబ్బలాడేవాడు, తన పై ఉపకారం చేసిన వాళ్ళ ఉపకారాన్ని  మరిచి పోయేవాడు దైవప్రవక్త ముహమ్మద్(స.అ) పై అవతరించించబడ్డ వాటిని నిరాకరించినట్లే, తనను తన తల్లిదండ్రులతో సంబంధం కలపకుండా మరెవరితోనో సంబంధం కలుపుకునేవాడు, అతడి పై అల్లాహ్, ఆయన దూతలు మరియు ప్రజలందరి యొక్క లఅనత్ అవ్వుగాక.
12. ప్రజలు لا اله الا الله محمد رسول الله అని అంగీకరించనంత వరకు నేను వాళ్ళతో యుధ్ధం చేస్తూ ఉండడమే నా కర్తవ్యం. వాళ్ళు కలెమా చదివేసిన తరువాత వాళ్ళ ప్రాణాలు మరియు సొమ్ములు సురక్షితమైనట్లే, ఒకవేళ సత్యంతో ఉన్నప్పటికీ వాళ్ళు సురక్షితంగా లేకపోతే వాళ్ళ లావాదేవీలు అల్లాహ్ తోనే.
13. నా తరువాత మీరు రుజుమార్గాన్ని తప్పి కాఫిర్లుగా మారి ఒకరిని మరొకరు తమ బానిసలుగా చేసుకోవడం మరియు చంపుకోవడం చేయవద్దు.

హజ్జతుల్ విదాలో అరఫాలో ఇచ్చిన ఉపన్యాసంలో దైవప్రవక్త(స.అ) ప్రస్తావించిన అంశాలన్నిటిని సరైన మూల గ్రంథాల నుండి ఉల్లేఖించాము ఏదీ వదలలేదు. ఇక మీరే చెప్పండి ఇందులో సహాబీయులకు తెలియనటువంటి విషయం ఏదైనా ఉందా: ఇందులో ఉన్న విషయాలన్నీ అల్లాహ్ గ్రంథంలో ఉన్నాయి మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్‌లో ఆ ఆదేశాల ప్రస్తావన ఉంది. దైవప్రవక్త(స.అ) జీవితమంత తనపై అవతరించబడ్డ ఈ విషయాల ఆదేశాల ప్రస్తావనలోనే గడిపేశారు. అప్పటికే ప్రతీ చిన్న మరియు పెద్ద విషయాలను బోధించేశారు అందుచేత సహాబీయులందరికి తెలిసినటువంటి విషయాల ప్రస్తావన తరువాత ఇక్మాల్ ఆయత్ ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ... الخ అవతరించడం అసాధ్యం. దైవప్రవక్త(స.అ) ఈ విషయాలను తాఖీదు చేస్తూ ప్రవచించారు మరియు దీనికి మరోకారణమేమిటంటే హజ్జ్‌కు బయలదేరక ముందు దైవప్రవక్త(స.అ), ప్రజలకు ఇది నా చివరి హజ్జ్ అని చెప్పారు అందుకని అందరికి ఈ విషయాలను మరల చెప్పడం అవసరం.

కాని ఒకవేళ మేము రెండవ వచన(అనగా ఇక్మాల్ ఆయత్ “గదీరె ఖుమ్‌”లో అవతరించబడింది)ను అంగీకరించినట్లైతే దాని అర్ధం కూడా సరైనదవుతుంది మరియు యధార్ధానికి అనుసారమైనదిగాను ఉంటుంది, ఎందుకంటే దైవప్రవక్త(స.అ) తరువాత ఖలీఫా ఎవరూ‎?‎ ఇది ముఖ్యమైన సమస్య; అటు అల్లాహ్ తన దాసులను గాలికి వదిలేయడు మరియు అలాగే దైవప్రవక్త(స.అ) వైఖరికి తన తరువాత తన ఖలీఫాగా ఎవ్వరిని నియమించ కుండా ఈ లోకాన్ని విడవడం తగనిది. ముఖ్యంగా ఒకవేళ అతను కొన్ని రోజులకు మదీన నుండి బయటకు వెళ్ళినప్పుడే తన సహాబీయులలో ఎవరో ఒకరిని నియమించి వెళ్ళే పద్ధతి ఉంది మరి అలాంటి సమయంలో అతను పూర్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్తుండగా ఎవ్వరిని తన ఖలీఫా మరియు ఉత్తరాధికారిగా నియమించకుండా వెళ్ళడం అసాధ్యం!!!?.

ఆ నాటి నాస్తికులు మరియు అవిశ్వాసులు కూడా నాయకుడు మరియు రాజు మరణం కన్న ముందు తన నాయకుడు మరియు మార్గదర్శిని నియమిస్తారు, అతడు రాజు మరణాంతరం రాజ్యపాలన అధికారాన్ని కొనసాగిస్తాడు, ఒక్క రోజు కూడా తన సమూహాన్ని నాయకుడు లేకుండా వదలరు మరి అలాంటిది (అన్ని మతాలలో సంపూర్ణమైన మతం, అన్ని షరీఅత్‌ల కు చిట్ట చివరి షరిఅత్, ఇంత కన్న సంపూర్ణమైన మరియు ప్రాముఖ్యత గల దీన్ లేదు, దాని పట్ల ఇలా ప్రకటించ బడింది: “ఈ ఖుర్ఆన్, రుజుమార్గం వైపు హిదాయత్ చేస్తుంది”.[ఇస్రా సూరా:17, ఆయత్:9] అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) దానిని(ఇస్లాం) నాయకుడు లేకుండా అలాగే వదిలేసి ఉంటారు, అని ఆలోచించడం కూడా సరైనది కాదు.[1]

రిఫరెన్స్
1. తీజానీ సమావీ, మఅస్సాదిఖీన్, మతర్జిమ్ రౌషన్ అలీ, అన్సారియాన్, ఖుమ్, 2005.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14