ఇక్మాల్ ఆయత్ అరఫారోజు అవతరించబడలేదు

శని, 07/10/2021 - 15:39

అరఫా రోజున ఇక్మాల్ ఆయత్ అవతరించబడలేదు అనడానికి కొన్ని సాక్ష్యాలు...

ఇక్మాల్ ఆయత్ అరఫారోజు అవతరించబడలేదు

అరఫా రోజున ఈ ఆయత్ అవతరించబడలేదు అనడానికి కొన్ని సాక్ష్యాలను తిలకించండి:

1. ఇంతకు ముందు వివరించబడిన రివాయతుల[1] ప్రకారం హజ్రత్ ఉమర్(ర.అ) ఇక్మాల్ ఆయత్ అరఫా రోజున అవతరించబడింది మరి ఆరోజు పండుగదినంగా నిర్ధారించారు. కాని ఆ రోజును పండుగ రోజుగా నిర్ధారించడం అసాధ్యం ఎందుకంటే హాజీయులు, కాబా ప్రదక్షిణ(తవాఫ్) తరువాతే ఎహ్రామ్[2] దుస్తులను తీసేస్తారు మరియు తవాఫె ఇఫాజా[3], జమరయే ఉఖ్బా[4], ఖుర్బానీ మరియు శిరోముంఢన తరువాతే జరుగుతాయి. ఈ పనులు(ఖుర్బానీ, శిరోముంఢన మొ..) పదవ తారీకున జరుగుతాయి, ఆ రోజే ఈదుల్ అజ్హా (బక్రీద్ పండగ)[5] జరుగుతుంది. రమజాన్ పండుగ, రమజాన్ నెల పూర్తయిన తరువాతే పండుగ అలాగే హజ్జ్ విషయంలో ఎహ్రామ్, అది పూర్తవ్వక ముందు పండుగ చేసే సమస్యే లేదు. ఎలాగైతే రమజాన్ మాసంలో ఉపవాసం ఉన్న వాడి పై చాలా పనులు హరామ్ చేయబడతాయి (ఉదా: తినడం, త్రాగడం, సంభోగం మొ॥) వాటిని రమజాన్ పండగే హలాల్ చేస్తుంది అలాగే హాజ్ చేసే వాడిపై కూడా చాలా నిబంధనలు ఉంటాయి అవి ఎహ్రామ్ ధరించిన తరువాత మొదలవుతాయు (ఉదా: సంభోగం, సుగంధం, అలంకణ, కుట్టబడిన దుస్తులు ధరించడం, వేటాడడం, గోళ్ళను వెంట్రుకలను కత్తిరించడం మొ॥) మరి ఈ పనులను తవాఫే ఇఫాజా తరువాత జిల్‌హిజ్ నెల10వ తారీకున హలాల్ చేయబడుతాయి. అయితే దీనితో నిరూపించబడిన విషయం ఏమిటంటే అరఫా రోజు పండుగ రోజు కాదు అని. జిల్‌హిజ్ 10వ తారీకున పండుగ ఆ రోజు ప్రపంచమంతట ఉత్సవాలు, సంబరాలు జరుపుకుంటారు, అరఫా రోజు పండుగ రోజు కానప్పుడు ఈ తప్పుడు రివాయత్‌ను తయారు చేయడంలో లాభమేముంది. మరియు ఈ ఆయత్ అరఫా రోజు అవతరించబడలేదు అని కూడా రుజువయ్యింది మరి అరఫా రోజు పండుగ కూడా జరుపుకోరు.

2. మేము ముందే ఇబ్లాగ్ ఆయత్ అనగా (يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ... الخ), అందులో “ఓ నా ప్రవక్తా! నీవు నేను మీకు ఆదేశించిన ఆ ముఖ్యమైన విషయాన్ని ప్రకటించండి ఒకవేళ అలా చేయకుంటే మీ దౌత్వం వ్యర్ధమౌతుంది” అని ఆదేశించ బడింది. ఈ ఆయత్ మక్కా మరియు మదీనా మధ్యలో అవతరించబడింది మరియు దీనిని నూట ఇరవై సహాబీయుల కన్న ఎక్కువ మరియు మూడువందల అరవై అహ్లెసున్నత్ ఉలమాలు ఉల్లేఖించారు, ఒకవేళ మేము ఇక్మాల్ ఆయత్ అనగా ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ... الخ ఆయత్ అరఫా రోజున అవతరించబడింది అని ఒప్పుకున్నట్లైతే ఈ రెండు ఆయత్(ఇక్మాల్ ఆయత్ మరియు అబ్లాగ్ ఆయత్)లలో పరస్పర వ్యతిరేకత ఏర్పడుతుంది ఎందుకంటే అల్లాహ్ అరఫా రోజు దీన్‌ను సంపూర్ణ స్థితికి చేర్చి, అనుగ్రహాలను పూర్తి చేసేసినప్పుడు అనగా ఇక ఇప్పుడు ఏమి మిగిలి లేనప్పుడు ఒక వారం తరువాత అల్లాహ్ తన ప్రవక్తను ఇలా అని ఏలా ఆదేశమివ్వగలడు: “ఆ ముఖ్య సందేశాన్ని ప్రకటించు లేకుంటే నీ దౌత్యం అనర్ధం అవుతుంది” అంతా అరఫాలో పూర్తయినపోయిన తరువాత తిరిగి వస్తుండగా మక్కా మరియు మదీనా మధ్యలో అల్లాహ్ ముఖ్యసందేశాన్ని ప్రకటించండి అని ఎందుకు ఆదేశమిస్తాడు. వివేకులారా‎!‎ ఇది స్పష్టమైన వ్యతిరేకత కాదా!!!?.

3. ఇక్మాల్ ఆయత్, అరఫా రోజు అవతరించే సమస్యే లేదు ఎందుకంటే ఏ ఒక్క పరిశోధకుడైన దైవప్రవక్త(స.అ) యొక్క అరఫా నాటి ఉపన్యాసాన్ని కొంచెం దృష్టి పేట్టి చూస్తే అతడికి తప్పకుండా తెలిసోస్తుంది, ఆ ఉపన్యాసంలో దైవప్రవక్త(స.అ) ముస్లిములకు తెలియనటు వంటి ఏ విషయాన్ని ప్రవచించ లేదు, మరియు దీన్ సంపూర్ణ స్థితికి చేరేటువంటి ఏ కొత్త విషయాన్ని ప్రకటించనూ లేదు, దైవప్రవక్త(స.అ) కేవలం ఖుర్ఆన్‌లో ఉన్న ఉపదేశాలను మరియు తాను వివిధ సమయములలో ప్రవచించిన అంశాలనే మరలా ఒకసారి తాఖీదు చేశారు. కొత్త విషయాన్ని ప్రసంగించనప్పుడు మరి దీన్ సంపూర్ణత్వం మరియు అనుగ్రహాల పూర్తవ్వడం దానితో ముడి పడి ఎలా ఉంటాయి? ఒకవేళ ఈ మామూలు మాటలకు మరియు ఉపదేశాల పైనే దీన్ యొక్క సంపూర్ణత్వం ఆధారపడి ఉంటే ఇంతకు ముందే దీన్ ఆ స్థాయికి చేరి ఉండేది అరఫా రోజే ఎందుకు అవుతుంది?

నిజానికి ఈ రివాయతులన్నీ నకిలీ రివాయతులు, కేవలం తమ నమ్మకాలను ఇస్లాం రంగు వేసి ప్రజలను యదార్థం తెలియకుండా కప్పివేసిన కపట సహాబీయుల చర్య.

రిఫరెన్స్
1. https://te.btid.org/node/1927
2. హజ్జ్ చేసే సమయంలో ధరించే ప్రత్యేక దుస్తులు.
3. కాబా చుట్టూ తిరిగి చేసే ప్రదక్షణాలనే ఇఫాజా అంటారు.
4. షైతాన్‌కు నిదర్శనంగా ఉన్న స్థంభాలను రాళ్ళతో కొట్టడం.
5. రమజాన్ పండుగ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10