ఖుమ్స్ మరియు దాని పై అమలు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి సంక్షిప్త వివరణ...
ఖుమ్స్ అనగా సంవత్సరం చవరిలో అన్ని ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము నుంచి 20 శాతాన్ని ఇస్లామీయ పన్ను రూపంలో పేదవారి కోసం, ఇస్లామీయ ప్రచారం కోసం మరియు ఇతర ఇస్లామీయ సామజిక ఆథ్యాత్మిక చర్యల కోసం చెల్లించవలసిన షరా పరమైన సొమ్ము.
ఖుమ్స్ అన్ని ఆదాయలకు వర్తించదు, కేవలం సంవత్సరం యొక్క ఖర్చులు పోగా మిగిలిపోయే ధనానికి వర్తిస్తుంది, ఈ విధంగా ఆదాయం ఖర్చులకు మించి ఉన్నాయ లేక సమానంగా ఉన్నా ఖుమ్స్ వారికి వర్తించదు. కేవలం ఖర్చులకు మించిన ఆదాయం ఉన్న వారి మిగిలిన ఆదాయం నుంచి 20 శాతం బైతుల్ మాల్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సోమ్ము బైతుల్ మాల్ కు సంబంధించిందినది మరియు దాని ద్వార ముస్లిముల సామాజిక మరియు మత పరమైన కష్టాలను తీర్చ వచ్చు.
అయితే ఈ ఖుమ్స్ కేవలం ఆదాయం నుంచి మిగిలిపోయిన ధనానికి మాత్రమే సంబంధించినది కాదు, ఇది ఖనుల, సముద్రపు మణులు, తవ్వకాలలో లభించిన అనాధ నిధులకు కూడా సంబంధించినది. అలాగే యుద్ధం తరువాత దక్కే వస్తువుల పై కూడా ఖుమ్స్ విధిగా నిర్ధారించబడినది.
ఖుమ్స్ ను ఎలా విభజించాలి మరియు ఎవరెవరికి పంచాలి అన్న విషయాలు ఫిఖాలో స్పష్టంగా వివరించబడి ఉంటుంది.[1]
రిఫరెన్స్
ఇస్లాం దర్ ఎక్ నిగాహ్, మకారిమ్ షీరాజీ, పేజీ88.
వ్యాఖ్యలు
Excellent
వ్యాఖ్యానించండి