సంపూర్ణ మతం ఇస్లాం

సోమ, 11/08/2021 - 16:39

ఎందుకు అల్లాహ్ ముందే ఒక సంపూర్ణ మతాన్ని అవతరింపజేసి దానినే తన ప్రవక్తల ద్వార కాపాడుకోలేదు? ఎందుకని వివిధ ప్రవక్తలు మరియు వేర్వేరు మతాలను పంపాడు?

సంపూర్ణ మతం ఇస్లాం

ప్రశ్న: ఎందుకు అల్లాహ్ ముందే ఒక సంపూర్ణ మతాన్ని అవతరింపజేసి దానినే తన ప్రవక్తల ద్వార కాపాడుకోలేదు? ఎందుకని వివిధ ప్రవక్తలు మరియు వేర్వేరు మతాలను పంపాడు?

సమాధానం: ఎలాగైతే తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల శిక్షణ క్రమంలో ప్రవర్తనకు సంబంధించిన అన్ని అంశాలు ముందే చెప్పేయరు. అలాగే ఆ పిల్లాడు ముందు చిన్నప్పటి నుంచే అన్నింటిపై అమలు చేయాలని కూడా అనుకోరు. స్టెప్ బై స్టెప్ షరా కర్తవ్యాలను బోధిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి నుంచి ఆ చర్య పై అమలునే కోరుకుంటారు. పిల్లాడు యవ్వనానికి చేరిన తరువాత, బుద్ధి సంపూర్ణ స్థితికి చేరిన తరువాత ఇస్లాం పూర్తి ఆదేశాలను అతడికి బోధిస్తారు మరియు వాటిపై అమలును కూడా ఆశిస్తారు.[1]
అదే విధంగా ముందు నుంచే(హజ్రత్ ఆదమ్ కాలం నుంచే) సంపూర్ణ దీన్‌ను మనిషికి బోధించడం సంభవం కాదు; ఎందుకంటే మనిషి ఆలోచన వివిధ కాలాలలో వివిధ రూపాలు దాల్చుతుంది. ఆలోచన మరియు బుద్ధి పెరుగుతూ ఉండటం ద్వార అతడి ఆలోచన అవసరాలు కూడా పెరుగుతూ మరియు క్లిష్టంగా మారుతూ పోతాయి. దాంతో కష్టమైన మరియు ఉత్తమమైన ఉపదేశాల పై అమలు చేసే అర్హత కూడా పొందుతుంది, లేకపోత ముందు నుంచి ఇలాంటి ప్రతిభ ఉండేది కాదు. ఇందుమాలంగా షరిఅత్ యొక్క ముందు దశలో చాలా సాధారణమైన మరియు శులభమైన అహ్కాములను వారి కోసం అవతరించబడతాయి దాంతో ముందు ఇస్లాం యొక్క ఉపదేశాలను జీర్ణించుకొనే శక్తి మరియు అర్హత అతడిలో ఏర్పడాలి.
అందుకని హజ్రత్ ఆదమ్(అ.స) మొట్ట మొదటి ప్రవక్తగా మానవ సృష్టి యొక్క మొట్టమొదటి వంశం కలిగివుండే అర్హతల పరంగా ఆదేశాలను బోధించారు. వారి తరువాత వచ్చిన ప్రవక్తల కాలంలో మనిషి బుద్ధి పెరిగే కొద్ది ఉపదేశాలు ఎక్కువయ్యాయి అయితే ఈ కొత్త బోధనలు మునుపటి బోధనలకు సంపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి బోధనలు అయి ఉండేవి. అలా అలా అంతిమ దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) కాలంలో సంపూర్ణ దీన్ ప్రజల భాగ్యంగా నిర్ధారించబడింది. ఆ తరువాత మరో దీన్ రాదు.
వాస్తవానికి దైవప్రవక్తలందరూ మానవాళిని అల్లాహ్ వైపు ఆహ్వానించేవారు. కాని ఒక ప్రవక్త షరీఅత్ ఆ తరువాత వచ్చే ప్రవక్త యొక్క షరీఅత్ వచ్చేంత వరకు చెల్లేది. ముందు ప్రవక్త షరీఅత్‌లో తరువాత వచ్చే ప్రవక్త గురించి సూచించబడి ఉండేది. అల్లాహ్ తరపు నుంచి కొత్త ప్రవక్త ఎన్నుకోబడ్డ తరువాత కొత్త షరీఅత్ అవతరించబడిన తరువాత, అంతకు ముందు ప్రవక్త మార్గం పై నడిచే మరియు అనుచరించేవారు ఈ కొత్త ప్రవక్త షరీఅత్‌ను అనుసరించడం తప్పని సరి.
ఈ విధంగా ఇస్లాంకు ముందు వచ్చిన మతాలన్నీ రద్దు చేయబడినట్లు. ఆ వర్గాల వారందరూ ఇస్లాంను అనుసరించాల్సిందే ఎందుకంటే ఇస్లాం చివరి మరియు సంపూర్ణమైన దీన్ కాబట్టి.
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు”.[సూరయె నిసా, ఆయత్19]
వివిధ వర్గాలుగా ఎందుకు ఉన్నారు. మరియు అల్లాహ్ ఎందుకు అందరిని ఒకే ఉమ్మత్ గా నిర్ధారించలేదు అన్న ప్రశ్నకు ఖుర్ఆన్ ఇలా సమాధానమిస్తుంది: “మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్థారించాము. అల్లాహ్ యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు”.[సూరయె మాయిదహ్, ఆయత్48]

రిఫరెన్స్
1. షహీద్ ముతహ్హరీ, ఇస్లాం వ ముఖ్తజియాతె జమాన్, భాగం1, పేజీ563.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15