హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టత 

శుక్ర, 12/31/2021 - 17:27

దైవప్రవక్త(స.అ) కుమార్తె అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టతను నిదర్శిస్తున్న ఇతర పవిత్ర మాసూముల హదీసులు...

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టత 

1. స్ర్తీల నాయకురాలు
హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఫాతెమా(స.అ) మొదటి నుంచి చిరవరి వరకు సర్వలోకాల స్ర్తీల నాయకురాలు.[1]
2. హజ్రత్ ఫాతెమా(స.అ) తస్బీహ్
హజ్రత్ ఇమామ్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ యొక్క ప్రశంసలు మరియు పొగడ్తలు తస్బీహె ఫాతెమా జహ్రా(స.అ)కు మించిన ఆరాధన లేదు.[2]
3. హజ్రత్ ఫాతెమా(స.అ) పై దూరూద్
హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: మరణించిన తరువాత మొదటి సారి శవపేటిక ఎవరికోసం తయారు చేబడిందో ఆమె దైవప్రవక్త(స.అ) కుమార్తె ఫాతెమా(స.అ); అల్లాహ్ దురూద్ ఆమెపై, ఆమె తండ్రిపై, ఆమె భర్త పై మరియు ఆమె పిల్లలకు చేరుగాక.[3]
4. హజ్రత్ ఫాతెమా(స.అ) శత్రువులు దైవ శాపగ్రస్తులు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: శాపగ్రస్తులు, శాపగ్రస్తులు, ఎవరైతే నా తరువాత నా కుమార్తె ఫాతెమా(స.అ) పై అన్యాయం చేస్తారో, ఆమె ఆస్తిని దోచుకుంటారో మరియు ఆమెను చంపుతారో.[4]
5. హజ్రత్ ఫాతెమా(స.అ) దర్శనం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: హజ్రత్ ఫాతెమా(స.అ)ను దర్శించుకున్నవాడు నన్ను దర్శించుకున్నట్లు.[5]
6. హజ్రత్ ఫాతెమా(స.అ) ప్రత్యేక నమాజ్
హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఎవరైతే నాలుగు రక్అత్ లు (రెండు రక్అత్ లకు ఒక సలామ్ ద్వార) చదువడం మరియు ప్రతీ రక్అత్ (సూరయె హంద్ తరువాత) 50 సార్లు సూరయె ఖుల్ హు వల్లాహ్ ను పఠించడం, ఈ నమాజ్ ను “నమాజె ఫాతెమా(స.అ)” అంటారు.[6]
7. దైవప్రవక్త(స.అ) హజ్రత్ ఫాతెమా(స.అ) సంబంధం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఓ ఫాతెమా(స.అ)! నీవు నా నుంచి మరియు నేను నీ నుంచి.[7]
8. హజ్రత్ ఫాతెమా(స.అ) పై ఆమె తండ్రి ఫిదా
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నీ తండ్రి నీపై ఫిదా ఓ ఫాతెమా(స.అ)![8]
9. స్వర్గ సుగంధం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: హజ్రత్ ఫాతెమా(స.అ) మనిషి రూపంలో ఉన్న హూరియా(దైవదూత) నేను స్వర్గ సుగంధం పీల్చాలనుకున్నప్పుడు, నా కుమార్తె హజ్రత్ ఫాతెమా(స.అ) నుంచి పీలుస్తాను.[9]
10. దైవప్రవక్త(స.అ) యొక్క హృదయం హజ్రత్ ఫాతెమా(స.అ)
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహంగా హసన్ మరియు హుసైన్(అ.స) ఇద్దరూ ఈ ఉమ్మత్ యొక్క మనువుల, మరియు వారిద్దరూ ముహమ్మద్(స.అ) యొక్క రెండు కళ్ళు మాధిరి, నేను(ముహమ్మద్(స.అ)) కొరకు శరీరం లాంటి వాడిని, ఫాతెమా(స.అ) (వారి కోసం) వారి శరీరం యొక్క హృదయం మాదిరి.[10]
11. అలీ(అ.స) ప్రతిష్టత హజ్రత్ ఫాతెమా(స.అ)
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: నేను బతూల్(హజ్రత్ ఫాతెమా(స.అ)) యొక్క జీవిత భాగస్వామిని; ఆమె సమస్త లోకాల స్ర్తీలకు నాయకురాలు.[11]
12. హజ్రత్ ఫాతెమా(స.అ) జొహ్రా
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నేను సూర్యుడ్ని, అలీ(అ.స) చంద్రుడు, ఫాతెమా(స.అ) జొహ్రా(శుక్రుడు), హసన్ మరియు హుసైన్(అ.స)లు మిలమిలా మరిసే రెండు నక్షత్రాలు.[12]
13. హజ్రత్ ఫాతెమా(స.అ) యొక్క విశ్వాసం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఓ సల్మాన్! నిస్సందేహంగా అల్లాహ్ ఫాతెమా(స.అ) యొక్క హృదయం మరియు శరీరభాగాలు చివరికి ఆమె ఎముకలను కూడా విశ్వాసం మరియు నిశ్చయం(సత్యం, యదార్థం) తో నింపాడు., దాంతో ఆమె అల్లాహ్ పట్ల విధేయతలో చాలా తీవ్రత కలిగి ఉన్నారు.[13]
14. అమరుల దర్శనం
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: హజ్రత్ ఫాతెమా(స.అ) ప్రతీ శనివారం ఉదయం అమరుల సమాధులను దర్శించుకోవడానికి వెళ్లేవారు.[14]

రిఫరెన్స్
1. మఆనియుల్ అఖ్బార్, పేజీ107.
2. కాఫీ, భాగం3, పేజీ343.
3. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ249.
4. బిహారుల్ అన్వార్, భాగం73, పేజీ354.
5. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ58.
6. మన్ లా యహ్ జుర్హుల్ ఫఖీహ్, భాగం1, పేజీ564.
7. బైతుల్ అహ్జాన్, పేజీ19; బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ32.
8. బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ490.
9. అల్ తౌహీద్, షేఖ్ సదూక్, పేజీ117.
10. బిహారుల్ అన్వార్, భాగం39, పేజీ352; కితాబు సులైమ్ ఇబ్నె ఖైస్, పేజీ830.
11. మఆనియుల్ అఖ్బార్, పేజీ58.
12. బిహారుల్ అన్వార్, భాగం24, పేజీ74, మఆనియుల్ అఖ్బార్, పేజీ114
13. బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ46; మనాఖిబ్, భాగం3, పేజీ337.
14. వసాయిల్ అల్ షియా, బాగం2, పేజీ879.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16