బనీ అబ్బాస్ అధికారుల దౌర్జన్యాలు

శని, 01/29/2022 - 07:43

బనీఉమయ్యా యొక్క పరిపాలన అంతం అయిన తరువాత ఖిలాఫత్ బనీఅబ్బాస్ చేతికి వచ్చింది, అప్పుడు బనీఅబ్బాస్ తమకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా వారు షియాలను నానా అవస్థలు పెట్టారు....

బనీ అబ్బాస్ అధికారుల దౌర్జన్యాలు

బనీఉమయ్యా యొక్క పరిపాలన అంతం అయిన తరువాత ఖిలాఫత్ బనీఅబ్బాస్ చేతికి వచ్చింది, అప్పుడు బనీఅబ్బాస్ తమకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా వారు షియాలను నానా అవస్థలు పెట్టారు. ఎప్పుడైతే “జాఫర్ ఇబ్నె మోతసిమ్”(ముతవక్కిల్) పదవీ బాధ్యతలు స్వీకరించాడో, అతడు కూడా హజ్రత్ అలీ(అ.స) మరియు అతని సంతానం పట్ల అతిగా శత్రుత్వభావాన్ని వ్యక్తం చేశాడు. అతడి మనసులో వారి పై ద్వేషం మరియు శత్రుత్వం ఎంత ఎక్కువగా ఉండేదంటే; అతడు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధిని త్రవ్వించేశాడు, మరి  అలాగే ప్రజలను వారి సమధి దర్శనాన్ని నిషేదించాడు. ముతవక్కిల్, హజ్రత్ అలీ(అ.స)ని దూషించే వారికే కానుకలు ఇచ్చేవాడు.
అరబీ భాష సాహిత్య ప్రముఖులు, ఇస్లామీయ విద్వాంసులైన “ఇబ్నె సిక్కీత్”, “ముతవక్కిల్” యొక్క పిల్లలకు చదువు నేర్పుతున్న కాలంలో కేవలం అలీ(అ.స) మరియు అతని అహ్లెబైత్‌(అ.స)లపై ఇష్టాన్ని వ్యక్తం చేసిన పాపానికి అతని నాలుకను పెడతల నుండి లాగించాడు.
ముతవక్కిల్ యొక్క శత్రుత్వం మరియు వైరం యొక్క హద్దు చెప్పాలంటే; అతడు, తల్లిదండ్రులు తమ బిడ్డను అలీ(అ.స) అని పెట్టుకున్న పేరుగల ఆ బిడ్డలను కూడా చంపేయమని ఆదేశించాడు. ఎందుకంటే అతడి దృష్టిలో అలీ(అ.స) అనే పేరు కూడా అసహ్యకరమైనదే. శత్రుత్వపు హద్దులను తిలకించండి, ప్రముఖ కవి “అలీ ఇబ్నె జహమ్”, ముతవక్కిల్ వద్దకు వచ్చిన ప్పుడు ఇలా అన్నాడు: ఓ అమీరుల్ మొమినీన్ నా తల్లిదండ్రులు నన్ను ఆఖ్[1] చేశారు, ముతవక్కిల్ ఎందుకని? అని ప్రశ్నించాడు. వాళ్ళు నా పేరు అలీ అని పెట్టారు మరియు నాకు ఆ పేరంటే ఇష్టంలేదు మరియు అలాగే వేరే వాళ్ళకి ఈ పేరు పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. అతడి ఈ మాట పై ముతవక్కిల్ గట్టిగా నవ్వి అతడిని కానుకలతో నింపాడు.
“ముతవక్కిల్” యొక్క సభలో ఒక వ్యక్తి అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ల అనుకరించాడు. సభికులు అతడిని చూసి నవ్వి ఇలా అనే వారు: ఇంద్రలుప్తకుఁడు(బట్టతలగలవాడు) మరియు తుందిలుడు(పెద్ద పొట్ట గల వాడు) (మాజాల్లాహ్), సభికులు అతడిని ఎగతాళి చేసేవారు. దాంతో ఖలీఫాకు సంతుష్టి కలిగేది.

అలీ(అ.స) పట్ల ముతవక్కిల్
కు ఇంతిలా శత్రుత్వం ఉండేది అని గుర్తుంచు కోండి. ఈ విషయాలే అతడి కొరకు కపటం మరియు భ్రష్టతకు కారణం అయ్యింది. అహ్లె హదీసులు అతడిని చాలా ఇష్టపడతారు మరియు వారు అతడికి “ముహ్యుస్సున్నహ్”[2] అను బిరుదు ఇచ్చారు. అహ్లెసున్నత్ అనగా అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు.
అహ్లెసున్నత్‌లు, అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) పట్ల వైరం, శత్రుత్వం మరియు ద్వేషాన్ని, “సున్నత్” అంటారు, అన్న ఈ మాట సాక్ష్యాలతో నిరూపించబడినదే:
“ఖారజ్మీ” యొక్క ఈ ప్రవచనాన్ని చూసినట్లైతే దానిని ఇంకా స్పష్టం చేస్తుంది; “హారూన్ ఇబ్నె ఖైజరాన్ మరియు జాఫర్ ముతవక్కిల్[3], అబూతాలిబ్ (అ.స) యొక్క సంతానం పై లఅనత్ చేసేవారికే ధనం, తిండి ఇచ్చేవాడు. మరియు నాసిబీయుల వర్గానికి సహాయం చేసేవాడు”[4]

“ఇబ్నె హజర్”, “అబ్దుల్లాహ్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె హంబల్” ద్వార ఇలా ఉల్లేఖించారు; అతను ఇలా అన్నారు: నస్ర్ ఇబ్నె అలీ ఇబ్నె సుహ్బాన్ ఈ హదీస్
ను చెప్పినప్పుడు: దైవప్రవక్త(స.అ) ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స)ల చెయ్యి పట్టుకొని ఇలా ప్రవచించారు: “ఎవరైతె నన్ను ఇష్ట పడతారో, వీరిద్దరిని(హసన్(అ.స) మరియు హుసైన్(అ.స)) ఇష్టపడతారు మరియు వారి తల్లిదంద్రులను ఇష్టపడతారు, ప్రళయం నాడు అతడు మరియు నేను ఒకే స్థానంలో ఉంటాము”
అప్పుడు ముతవక్కిల్, “నస్ర్ ఇబ్నె అలీ ఇబ్నె సుహ్బాన్”కు వంద కొరడా దెబ్బలు తగిలించండి అని ఆదేశించాడు, దానితో అతను చచ్చిబ్రతికారు. ఆ తరువాత “జఫర్ ఇబ్నె అబ్దుల్ వాహిద్”, “అమీరుల్ మొమినీన్! ఇతడు సున్నీ” అని అన్నాడు, అది విని ముతవక్కిల్ అతడిని వదిలి పెట్టాడు.[5]

“ముతవక్కిల్”తో “అబ్దుల్ వాహిద్” చెప్పిన మాట ద్వార ప్రతీ వివేకుడికి తెలిసే మాట “నస్ర్” సున్నీ అని. అందుకే అతడు ప్రాణాలతో మిగిలి పోయాడు. మరి అలాగే ఇంకో సాక్ష్యం ఏమిటంటే అహ్లెబైత్(అ.స)ల శత్రువులే, అహ్లెసున్నత్ అయ్యి కూర్చున్నారు. నిజానికి ముతవక్కిల్
కు అహ్లెబైత్(అ.స)ల పట్ల అతిగా శత్రుత్వం ఉండేది. మరియు షియా కాకపోయినా సరే కేవలం వాళ్ళు అహ్లెబైత్
(అ.స)ల ప్రతిష్టతలను ప్రస్తావిస్తె చాలు చంపేసేవాడు.[6] ఉస్మానీయులు, హజ్రత్ అలీ(అ.స) పై లఅనత్ చేసేవారు. మరియు అతనిపై ఉస్మాన్ ఇబ్నె అఫ్వాన్ హత్య నింద మోపేవారు, అన్న విషయం ప్రసిద్ది చెందిందే.
“ఇబ్నె హజర్” ఇలా అని వ్రాశారు, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఇద్రీసె అజ్దీ”, సున్నీ వర్గానికి చెందినవారు. అతను అసలుసిసలైన ఉస్మానీ సున్నీ, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఔనె బసరి” ఇలా అన్నారు, “అబ్దుల్లాహ్ ఇబ్నె ఇద్రీసె అజ్దీ” మువస్సఖ్ (నమ్మకస్థుడు), అతడు సున్నత్ విషయంలో చాలా కట్టుదిట్టముగా ఉండేవారు. మరియు అహ్లె బిద్అత్[7]ల కొరకు చంపడానకి సిధ్ధంగా ఉన్న ఖడ్గం వలే ఉండేవారు. “ఇబ్నె సఅద్” అతను ఉస్మానీ అని అన్నారు.

“ఇబ్రాహీమ్ ఇబ్నె యాఖూబ్ జౌజానీ” ఇలా వ్రాశారు: “అబ్దుల్లాహ్ ఇబ్నె ఇద్రీసె అజ్దీ” “హరీజీయుల్ మజ్హబ్” అనగా హరీజ్ ఇబ్నె ఉస్మానె దమిష్ఖీ యొక్క అనుచరులుగా ఉండేవారు. మరియు అతను అహ్లెబైత్(అ.స)ల పట్ల శత్రుత్వంలో ప్రసిద్ధి చెందినవారు, “ఇబ్నె హయ్యాన్” ఇలా అన్నాడు: అతను సున్నత్ విషయంలో చాలా కట్టుదిట్టము గలవారు.[8]
ఈ ప్రవచనలన్నీంటి ద్వార మనకు అర్ధం అయ్యే విషయం ఒకటే; అలీ(అ.స) మరియు అలీ(అ.స) సంతానం పట్ల వైరం ఉన్న వాడు మరియు వారి పై లఅనత్ చేయువాడు, అహ్లెసున్నత్ దృష్టిలో సున్నత్ విషయంలో కట్టుదిట్టముగా ఉంటాడు. మరియు అలాగే ఈ మాట కూడ చెప్పనవసరం లేదు “ఉస్మానీయులు అహ్లెబైత్(అ.స)ల ప్రాణ శత్రువులు, అలీ(అ.స) మరియు అతని షియాలను చూడడానికి కూడా ఇష్టపడే వారు కాదు” అని.

“అహ్లె బిద్అత్” అనగా వాళ్ళ దృష్టిలో అలీ(అ.స)ను తమ ఇమామ్ అని నమ్మేవారే, ఎందుకంటే అలీ(అ.స) పట్ల ఇమామత్ విశ్వాసాన్ని, అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు బిద్అత్ అని భావించేవారు. దానికి కారణం అందులో సహాబీయుల మరియు ఖులఫాయే రాషిదీన్ల పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. అంతేకాకుండా “సలఫె సాలెహ్”[9] అతని(అలీ(అ.స)) యొక్క ఇమామత్
ను అంగీకరించనూ లేదు. మరియు అలాగే అతనిని దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారి అని కూడా అంగీకరించలేదు. ఈ విషయంలో చారిత్రాత్మికమైన చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మేము కేవలం అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రదర్శించాము. అలాగే మన అలవాటు ప్రకారం సంక్షిప్తం కూడా దృష్టిలో ఉంది. ఆపేక్షగలవారు(పుస్తకాల నుండి) ఇంకా ఎక్కవగా పరిశోధించగలరు.
وَٱلَّذِينَ جَٰهَدُواْ فِينَا لَنَهۡدِيَنَّهُمۡ سُبُلَنَاۚ وَإِنَّ ٱللَّهَ لَمَعَ ٱلۡمُحۡسِنِينَ
అనువాదం: మా కొరకు తీవ్రప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము, నిస్సందేహముగా అల్లాహ్ సజ్జనులతో పాటే ఉంటాడు.[అన్కబూత్ సూరా:29 ఆయత్:69.]

రిఫరెన్స్
1. పుత్రుని వారసత్వ అధికారం నుంచి తప్పించడం.
2. సున్నత్
ను ప్రాణం పోసిన వాడు.
3. మతవక్కిల్ అనగా అల్లాహ్
నే నమ్ముకొని ఉన్నవాడు, కాని ఈ ముతవక్కిల్ కరుణామయుడిని నమ్ముకున్నవాడు కాదు షైతాన్
ను నమ్ముకున్న వాడు.
4. కితాబుల్ ఖారజ్మీ, పేజీ135.
5. తహ్జీబ్ అల్ తహ్జీబ్, ఇబ్నె హజర్, హాలాతు నస్ర్ ఇబ్నె అలీ ఇబ్నె సుహ్బాన్.
6. తహ్జీబ్ అల్ తహ్జీబ్, భాగం5, పేజీ348.
7. ముహమ్మద్‌ దైవప్రవక్త(స.అ) కాలంలో లేని క్రొత్త మాటను చెప్పడం లేదా బయటికి తేవడం. (ఇట్లా చేస్తే అది ధర్మ విరుద్ధం అవుతుంది).
8. తహ్జీబ్ అల్ తహ్జీబ్, ఇబ్నె హజర్, భాగం1, పేజీ82.
9. మంచి పూర్వీకులు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Sikandar Mirza on

Assalam walaikum,

Subhan Allah aaga .bahut hi achhi jaankaari di hai

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15