సహనం హజ్రత్ ఫాతెమా(స.అ) దృష్టిలో

ఆది, 01/09/2022 - 12:14

సహనం మరియు ఓర్పు యొక్క స్థానం ఇస్లాం దృష్టిలో ముఖ్యంగా హజ్రత్ ఫాతెమా(స.అ) మరియు హజ్రత్ అలీ(స.అ) దృష్టిలో...

సహనం హజ్రత్ ఫాతెమా(స.అ) దృష్టిలో

ఇస్లాం ఉపదేశాలలో అత్యంత సిఫార్సు చేయబడ్డ అంశం “సహనం”. కొంచె శ్రద్ధ పెట్టి ఆయతులను మరియు రివాయతులను చూసినట్లైతే “సహనం” యొక్క స్థానం తెలుసుకోగలము. మాసూమీన్ సహనాన్ని బుద్ధి ప్రక్కలో ఉంచుతారు. దైవప్రవక్త(స.అ) సహనాన్ని బుద్ధి వివేకాల మొదటి ఫలితంగా నిర్ధారించారు.

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉపదేశాలలో సహనం ఎందుకు వాజిబ్ అన్న విషయాన్ని ఇలా వివరించారు: “అల్లాహ్ సహనం మరియు ఓర్పును దైవ బహుమతిగా నిర్ధారించెను, దాని ఫలితంగా అల్లాహ్ యొక్క అంతులేని కారుణ్యం దక్కుతుంది.[1]
అలాగే అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ(అ.స) విశ్వాసం పట్ల సహనం యొక్క స్థానాన్ని శిరస్సు గా ఉపమానించారు. వారు ఇలా ఉపదేశించారు: సహనంగా ఉండండి! ఎందుకంటే విశ్వాసం మరియు సహనం యొక్క సంబంధాన్ని బట్టి సహనం యొక్క స్థానం, శరీరానికి శిరస్సుకు ఉన్న సంబంధం మాదిరి. ఎలాగైతే శరీర విలువ శిరస్సు లేకపోతే ఉండదో అలాగే సహనం లేకపోతే విశ్వాసానికి విలువలేనట్లు.[2]

సహనం యొక్క ప్రాముఖ్యత మరియు విలువ గురించి చెప్పాలంటే కేవలం ఇది చాలు; ఖుర్ఆన లో ఎన్నో ఆయతులు ఉదాహారణకు “ఇన్నల్లాహ మఅస్సాబిరీన్”[3] (నిస్సందేహంగా అల్లాహ్ సహనమూర్తులతో పాటు ఉంటాడు), “ఇన్నల్లాహ యుహిబ్బుస్సాబిరీన్”[4] (నిస్సందేహంగా అల్లాహ్ సహనమూర్తులను ఇష్టపడతాడు). అలాగే బనీ ఇస్రాయీల్ కు చెందిన వారిలో ఇమామత్ మరియు మార్గదర్శక స్థానం పొందడానికి కూడా వారిలో సహనం అని ఖుర్ఆన్ వివరిస్తుంది.[5]

రిఫరెన్స్
1. అల్ ఎహ్తెజాజ్, పేజీ99., కష్ఫుల్ గుమ్మహ్, పేజీ43.
2. నెహ్జుల్ బలాగహ్, కలెమాతె ఖిసార్79, ఫైజుల్ ఇస్లామ్ వ సుబ్హీ సాలెహ్.
3. الله مع الصابرین
4. إنّ الله یحبّ الصابرین
5. وَ جَعَلْنا مِنْهُمْ أَئِمَّةً یَهْدُونَ بِأَمْرِنا لَمَّا صَبَرُوا وَ کانُوا بِآیاتِنا یُوقِنُونَ      

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17