హజ్రత్ ఖదీజా(స.అ)

సోమ, 04/11/2022 - 14:16

హజ్రత్ ఖదీజా(స.అ) గురించి అహ్లె సున్నత్ మరియు షియా గ్రంథాలలో వివరించబడిన రివాయతులు...

హజ్రత్ ఖదీజా(స.అ)

హజ్రత్ ఖదీజా(స.అ) దైవప్రవక్త(స.అ) ను విశ్వసించిన మొట్టమొదటి స్ర్తీ ఆమె. తన పూర్తి ఆస్తిని ఇస్లాం ప్రచారం మార్గంలో ఖర్చు పెట్టారు. దైవప్రవక్త(స.అ) మక్కాలో ఉన్నంత కాలం హజ్రత్ ఖదీజా(స.అ) బానిసలను విడిపించే వారు, నిస్సహాయులకు ఆదుకునే వారు, లేనివారికి సహాయం అందించేవారు, తన పేద సహాబీయులను భోజనం పెట్టేవారు, వలసివెళ్లాలనుకునేవారి ఖర్చులు ఇచ్చేవారు; అందుకే దైవప్రవక్త(స.అ) ఒక హదీసులో ఇలా ప్రవచించారు: “నాకు ఖదీజా ధనం లాభాన్ని చేకూర్చినంతగా ఎవరి ధనం లాభాన్ని ఇవ్వలేదు”[1] అంతేకాకుండా హజ్రత్ ఖదీజా(స.అ) ధన ఆస్తిని వారికి అంకితం చేయడమే కాకుండా ఇంట్లో మరియు ఖురైషీయుల తరపు నుండి పడే ఒత్తిడి కి దైవప్రవక్త(స.అ) యొక్క ప్రియ మిత్రునిగా ఉండేవారు.
షియా మరియు అహ్లె సున్నత్ పుస్తకాలలో హజ్రత్ ఖదీజా(స.అ) ప్రతిష్టతను వెల్లడించే రివాయతులు చాలా ఉన్నాయి, వాటి నుండి కొన్నింటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
1. అహ్లె సున్నత్ గ్రంథాలలో:
సహీ ముస్లిం[2] మరియు బుఖారీ[3] ఇలా ఉల్లేఖించబడి ఉంది; జిబ్రయీల్ దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చ ఇలా అన్నారు: “హజ్రత్ ఖదీజా భోనం మరియు నీళ్లు తీసుకొని నీ వద్దకు వస్తుంది, వచ్చినప్పుడు అల్లాహ్ మరియు నా తరపు నుండి ఆమెకు సలాములు తెలియపరచండి మరియు అల్లాహ్ ఆమె కోసం స్వర్గం యొక్క అగ్ర స్థానంలో ఆమె నివాసాన్ని నిర్థారించాడు, అక్కడ ఎటువంటి ఆందోళన మరియు అలసట ఉండదు మరి అలాగే అనుగ్రహాల క్షీణత ఉండదు”
అహ్లె సున్నత్ యొక్క కొన్ని రివాయతుల ప్రకారం హజ్రత్ ఖదీజా(స.అ) పేరు స్వర్గం యొక్క ఉత్తమ స్ర్తీలలో ఒకరుగా సూచించబడి ఉంది. “అహ్మద్ ఇబ్నె హంబల్” ఇబ్నె అబ్బాస్ నుండి ఇలా ఉల్లేఖించెను: “దైవప్రవక్త(స.అ) తన వేలుతో భూమి పై నాలుగు గీతలు గీసి ఇలా అన్నారు: ఈ నాలుగు గీతల అర్థం ఏమిటో చెప్పనా? అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: స్వర్గం యొక్క ప్రతిష్టాత్మకమైన స్ర్తీలు; ఖదీజా బింతె ఖువైలద్, ఫాతెమా బింతె ముహమ్మద్, మర్యమ్ బింతే ఇమ్రాన్ మరియు ఆసియా బింతె ముజాహిమ్ ఫిర్ఔన్ భార్య.[4]
హజ్రత్ ఖదీజా యొక్క స్థానం దైవప్రవక్త(స.అ) చాలా ఉత్తమమైనది అందుకే వారు నిత్యం ఆమెను గొప్పగా గుర్తు చేసేవారు. ఆమె గురించి ఇలా చెప్పేవారు: “అల్లాహ్ సాక్షిగా, ఖదీజా కు మించిన భాగ్యం నాకోసం నిర్థారించలేదు, ప్రజలు నన్ను నమ్మని సమయంలో ఆమె నన్ను విశ్వసించింది, ప్రజలు నన్ను నిరాకరించినప్పుడు ఆమె నన్ను నమ్మింది. ప్రజలు నన్ను దూరం చేస్తున్నప్పుడు ఆమె తన పూర్తి ఆస్తిని నా చేతుల్లో పెట్టింది. అల్లాహ్ ఆమె ద్వారానే నాకు పిల్లలు ప్రసాదించాడు”[5]

2. షియా పుస్తకాలలో:
షియా గ్రంథాలలో కూడా చాలా రివాయతుల హజ్రత్ ఖదీజా(స.అ) ప్రతిష్టతను వెల్లడిస్తూ ఉల్లేఖించబడి ఉన్నాయి కాని ఇక్కడ కేవలం హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క ఒక్క హదీస్ ను ప్రదర్శిస్తున్నాము; ఇమామ్ ఇలా ప్రవచించెను: “హజ్రత్ ఖదీజా మరణించినప్పుడు ఫాతెమా(స.అ) చిన్న పాపా, నిత్యం దైవప్రవక్త(స.అ) వద్దనే ఉండేది వారి చూట్టూ తిరుగుతూ ఉండేది ‘నాన్నా అమ్మేదీ?’ అని అడుగుతూ ఉండేది ఆ సమయంలో జిబ్రయీల్ దైవప్రవక్త(స.అ) వద్ద వచ్చి ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అనెను: ఫాతెమా(స.అ)కు సలాములు తెలిపి ఆమెతో ఇలా చెప్పు “మీ అమ్మ స్వర్గంలో ఉంది ఆమెతో పాటు ఫిర్ఔన్ భార్య ‘ఆసియా’ మరియు ఇమ్రాన్ యొక్క కుమార్తె ‘మర్యమ్’ ఉన్నారు” అని.[6]

రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాసిల్ అరబీ, బీరూత్,1403ఖ, భాగం19, పేజీ63.
2. సహీ ముస్లిం, ముస్లిం ఇబ్నె హజ్జజె నైషాబూరీ, దారు ఇహ్యాయిత్తురాసిల్ అరబీ, బీరూత్, భాగం4, పేజీ1887.
3. సహీ బుఖారీ, మొహమ్మద్ ఇబ్నె ఇస్మాయీల్ అల్ బుఖారీ, దారు తౌఖిన్నజాహ్, చాప్1, 1423హి, భాగం5, పేజీ39.
4. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, అహ్మద్ ఇబ్నె హంబల్, ముఅస్ససతుర్రిసాలహ్, చాప్1, 1421హి, 2001కీ, భాగం4, పేజీ409.
5. అల్ ఇస్తిఆబ్ ఫీ మఅరిఫతిల్ అస్హాబ్, ఇబ్నె అబ్దుల్ బిర్ర్, తహ్ఖీఖ్ అలీ మొహమ్మద్ అల్ బజావీ, బీ.జా, బీ.తా, భాగం4, పేజీ1824.
6. అల్ అమాలీ, షేఖ్ తూసీ, దారుస్సఖాఫహ్, ఖుమ్, చాప్1, 1414ఖ, పేజీ175.           

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7