తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-2

గురు, 05/26/2022 - 15:30

దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్  యొక్క సున్నత్ వ్యతిరేకతను నిదర్శిస్తున్న కొన్ని సంఘటనలు...

తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్-2

“షేక్ మొహమ్మద్ అబ్దొహ్” తన “షర్హ్” పుస్తకంలో ఇలా వ్రాశారు: కొందరు రావీయులు వ్రాసినట్లు; తల్హా, ఉస్మాన్ వైపు ఎక్కవ మక్కువ కలిగి ఉన్నారు, దానికి కారణం ఏమిటంటే వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది. మరియు ఉస్మాన్ పట్ల మక్కువ మరియు అలీ(అ.స) పట్ల వైరుధ్యానికి కేవలం ఈ కారణం చాలు అతను “తమీమీ” సంఘానికి చెందిన వారు. మరియు అబూబక్ర్ ఖలీఫా అయినప్పటి నుండి “బనీహాషిం” మరియు “బనీతమీమ్” మధ్య కలతలు చోటు చేస్తుకుంటూనే ఉన్నాయి.[1]

“గదీర్”లో బైఅత్ చేసిన సహాబీయులలో కూడా ఇతను ఉన్నారు, అని నిస్సందేహముగా చెప్ప వచ్చు. ఇతను దైవప్రవక్త(స.అ) నోటి నుండి “من کنت مولاہ فھذا علی مولاہ” అని విన్నారు.

నిస్సందేహముగా ఇతను దైవప్రవక్త(స.అ)ను ఇలా ప్రవచిస్తుండగా విన్నారు: అలీ(అ.స) సత్యంతో పాటు ఉన్నారు మరియు సత్యం అలీ(అ.స)తో పాటు. “ఖైబర్”
లో దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స)కు ద్వజం ఇచ్చి “అలీ(అ.స), అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)ను ఇష్టపడతారు మరియు అల్లాహ్, దైవప్రవక్త(స.అ) అతనిని ఇష్టపడతారు” అని చెప్పినప్పుడు కూడా ఉన్నారు. తల్హాకు “మూసాకు హారూన్ ఎలాగో అలాగే అలీ(అ.స), దైవప్రవక్త(స.అ)కు” అని కూడా తెలిసు. అంతే కాదు మరెన్నో విషయాలు అతనికి తెలుసు.

కాని “తల్హా” హృదయంలో ద్వేషపు మంట దాగి ఉంది, ఈర్ష్యతో మనస్సు నిండి ఉంది, అతని దేన్ని చూసినా వంశపక్షపాత దృష్టితో చూసేవారు. తన పినతండ్రి కుమార్తెను ఆశించేవారు, ఆమెతో దైవప్రవక్త(స.అ) తరువాత వివాహం చేసుకోవాలని అనుకునేవారు కాని ఖుర్ఆన్ అతని ఆశలకు అడ్డుగోడ కట్టింది.

అవును! “తల్హా”, ఉస్మాన్
తో కలిసి పోయారు, మరియు అతనితో బైఅత్ చేశారు. ఎందుకంటే అతను ఇతనికి కానుకలతో, బహుమానాలతో అనుగ్రహించే వారు. మరి ఉస్మాన్ ఖిలాఫత్ పదవి పై వచ్చిన తరువాత తల్హాకు ముస్లిముల లెక్కలేనంత సొమ్ముని ఇచ్చారు.[2] అంతే అతని వద్ద చాలా సొమ్ము, సేవకులు మరియు చతుష్పదములు ఎక్కువయ్యాయి. చివరికి ఇరాక్ నుండి ప్రతీరోజు వేయ్యి దీనారులు వచ్చేవి.

“ఇబ్నె సఅద్”, “తబఖాతుల్ కుబ్రా”లో ఇలా వ్రాశారు: “తల్హా మరణించినప్పుడు అతనికి 3 మిలియన్ దిర్హముల ఆస్తి ఉంది మరియు 2 మిలియన్ల 2 లక్షల దిర్హములు మరియు 2 లక్షల దీనారులు ధన రూపంలో ఉంది.

అందుకనే తల్హాకు తలపొగరు ఎక్కువయ్యింది, ధైర్యం పెరిగింది మరియు తానే ఖలీఫా అవ్వాలని తన ప్రాణ స్నేహితుడ్ని దారి నుండి అడ్డు తొలగించుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

బహుశ “ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా” కూడా అతనికి ఖిలాఫత్ ఆశ చూపించి ఉండోచ్చు. ఎందుకంటే ఆయిషా కూడా తన పూర్తి శక్తిని ఉస్మాన్
ను ఖిలాఫత్ నుండి తొలగించడంలో ప్రదర్శించారు. అందులో ఆమె భాగం కూడా ఉంది. ఆయిషాకు తన పినతండ్రి కుమారుడైన “తల్హా”కే ఖిలాఫత్ లభిస్తుంది అని గట్టి నమ్మకం ఉండేది. ఆమెకు ఉస్మాన్ మరణ వార్తతో పాటు “తల్హా”తో జనం బైఅత్ చేశారు అన్న వార్త అందినప్పుడు ఆమె చాలా సంతోషపడి ఇలా అన్నారు: “నఅసల్(ఉస్మాన్) వెళ్ళిపోవాలి, నాశనం అయిపోవాలి. శెభాష్! నా పినతండ్రి కుమారా! శెభాష్ నీ తండ్రి పై! అల్లాహ్ సాక్షిగా వాళ్ళకు తెలుసు తల్హా ఈ స్థానానికి, ఈ పదవికి అర్హుడు అని”

అవును! ఇలా “తల్హా”, ఉస్మాన్ చేసిన ఉపకారానికి జవాబిచ్చారు. ఉస్మాన్, అతనిని ధనవంతులు చేశారు మరి తల్హా ఖిలాఫత్
ను పొందే కాంక్షతో వారిని వదిలేశారు. మరియు ప్రజలను వారికి వ్యతిరేకంగా పురికొల్పడం మొదలు పెట్టారు. అతనికి పూర్తిగా విరోధి అయ్యారు. చివరికి ముట్టడికాలంలో ఖలీఫా వద్దకు నీరు పంపనివ్వకుండా ఆపివేశారు.

“ఇబ్నె అబిల్ హదీద్”, ఉస్మాన్ ముట్టడి కాలంలో వారు ఇలా అన్నారు అని రచించారు: అల్లాహ్ తల్హాను నాశనం చేయుగాక!, నేను అతడికి ఎంత వెండీబంగారాన్ని ఇవ్వలేదు, మరిప్పుడు అతడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. ప్రజలను నాకు వ్యతిరేకంగా పురికొల్పుతున్నాడు. ఓ అల్లాహ్! అతడు దీనితో(ధనం) లాభం పొందకుండా చేయి మరియు అతడికి అతడు చేసిన తిరుగుబాటు రుచిని చూపించు.

అవును! ఇతను ఉస్మాన్ వైపు వెళ్ళిపోయిన “తల్హా”యే. ఇతను ఉస్మాన్
ను, అలీ(అ.స) ఖలీఫా కాకూడదన్న ఉద్దేశంతో ఖలీఫా చేశారు. అందుకనే ఉస్మాన్ కూడా అతనిని వెండిబంగారాలతో నింపేశారు. ఈనాడు వాళ్ళే ఉస్మాన్
ను అనుమానిస్తున్నారు. అతనిని హతమార్చేందుకు పురికొల్పుతున్నారు. అతని వద్దకు వెళ్ళనివ్వడం లేదు. మరి సమాధి చేయడానికై అతని శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు అతనిని ముస్లిముల స్మశానంలో సమాధి చేయనివ్వలేదు. అప్పుడు అతనిని యూదుల స్మశానంలో సమాధి చేశారు.[3]

రిఫరెన్స్
1. షర్హె నెహ్జుల్ బలాగహ్, మొహమ్మద్ అబ్దొహ్, భాగం1, పేజీ88, ఖుత్బయే షఖ్ షఖియహ్.
2. తబరీ, ఇబ్నె అబిల్ హదీద్ మరియు తాహా హుసైన్ లు “ఫిత్నయే కుబ్రా”లో దీనిని వ్రాశారు. తల్హా పై ఉస్మాన్ యొక్క యాభై వేల అప్పు ఉండింది. ఒకరోజి తల్హా, ఉస్మాన్
తో నేను నీ అప్పును తీర్చేందుకు డబ్బు కూడబెట్టుకున్నాను అని అన్నారు. ఒకరోజు ఉస్మాన్ తరపు నుండి లభించే డబ్బునే పంపిచేశారు. అప్పడు ఉస్మాన్ ఇది నీ ఉదారతకు కానుక అని అన్నారు. ఉస్మాన్ అందులో రెండు లక్షలు జోడించి తల్హాకు ఇచ్చారు, అని కూడా చెప్పబడి ఉంది.
3. తారీఖె తబరీ, మదాయినీ, వాఖిదీలు “మఖ్తలె ఉస్మాన్”లో వ్రాశారు.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14