నజిస్ వస్తువులను శుభ్రపరిచే అంశాలలో తబ్ఇయత్ మరియు ఇస్లాం మొదలగు వాటి గురించి సంక్షిప్త వివరణ...

నజిస్ వస్తువులను శుభ్రపరిచే అంశాలలో తబ్ఇయత్ మరియు ఇస్లాం మొదలగు వాటి గురించి తెలుసుకుందాం
తబ్ఇయత్
ప్రశ్న: తబ్ఇయత్ గురించి ఒక ఉదాహారణ చెప్పండి.
సమాధానం: నజాసత్ క్రమంలో ఒకటి విశ్వాసం లేకపోవడం అని అవిశ్వాసి. ఒకవేళ అతడు ఇస్లాం స్వీకరిస్తే అతడు శుద్ధి చెందుతాడు అతడి తబ్ఇయత్(అనుచరణ మరియు అతడి ఇస్లాం స్వీకరణ క్రమంలో)లో అతడి పెంపకంలో ఉండడం వల్ల నజిస్ గా ఉన్న చిన్న పిల్లాడు కూడా శుద్ధి చెంతుతాడు. ఇదే విధంగా అవిశ్వాసి అయిన తాతా, నాన్నమ్మ మరియు తల్లి ఒకవేళ ఇస్లాం స్వీకరించినట్లైతే, వాళ్ల పెంపకంలో ఉండడం వల్ల నజిస్ గా ఉన్న పిల్లాడు వారి ఇస్లాం స్వీకరణ అనుచరణ(తబ్ఇయత్)లో వారి చిన్న బాబు కూడా శుద్ధి చెందుతాడు. ఇది ఎప్పుడు సాధ్యమౌతుందంటే ఆ పిల్లాడు ఆ ఇస్లాం స్వీకరిస్తున్న వారి పెంపకంలో ఉన్నప్పుడు. ఈ ఆదేశం వారి కాఫిర్ బంధువులకు వర్తించదు. మరో ఉదాహారణ; ఒకవేళ మద్యం, వెనిగర్ గా మారిపోతే ఈ తబ్ఇయత్ ద్వార ఆ మద్యం ఉన్న పాత్ర కూడా శుభ్రమైపోతుంది. అదే విధంగా మృతదేహాన్ని మూడు సార్లు గుస్ల్ ఇచ్చిన తరువాత దాని తబ్ఇయత్ లో గుస్ల్ ఇచ్చిన వారి చేతులు, గుస్ల్ కోసం మృతదేహాన్ని పడుకోబెట్టిన బల్లా మరియు అతడి పై కప్పిన గుడ్డ కూడా శుభ్రమౌతాయి. నజిస్ అయిన బట్టలు ఖలీల్ నీళ్లతో శుభ్రం చేస్తే అవి శుభ్రమౌతాయి మరి దాని యొక్క తబ్ఇయత్ లో ఉతికిన వారి చేతులు కూడా శుభ్రమౌతాయి.
ఇస్లాం
ప్రశ్న: ఇస్లాం ఎలా శుభ్ర పరుస్తుంది మరియు ఎవరిని శుద్ధి చేస్తుంది?
సమాధానం: ఇస్లాం, అశుద్ధుడైన అవిశ్వాసిని శుద్ధ పరుస్తుంది. ఇస్లాం స్వీకరణ తబ్ఇయత్ లో అతడి వెంట్రుకలు, గోళ్లు మరియు శరీర భాగాలు అవిశ్వాసం వల్ల నజిస్ గా ఉండే ఇవన్నీ శుభ్రమౌతాయి.
కనిపించకపోవడం
విశ్వాసి అయిన పెద్ద మనుషి మరియు ముమయ్యిజ్(మంచిచెడ్డలు తెలిసిన) పిల్లాడు కనిపించకపోవడం.
ప్రశ్న: ముస్లిం అదృశ్యం అవ్వడం అనగానేమి?
సమాధానం: అంటే అతడు నీ నుండి వేరు అవ్వడం మరియు నువ్వు వాడిని చూడలేకపోవడం.
ప్రశ్న: అతడు కనిపించకపోతే ఏమి జరుగుతుంది?
సమాధానం: అతడు కనిపించకపోవడంతో శుభ్రమౌతాయి. అతడితో పాటు అతడి వస్తువులు మరియు అతడి అవసరమైన సామాన్లు ఉదా: బట్టలు, కార్పెట్లు, పాత్రలు మొ.. వీటి శుభ్రత పై అనుమానం ఉన్నా సరే అవి శుభ్రమైనవిగా భావించాలి.
ప్రశ్న: ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఉదాహారణ ఇవ్వండి.
సమాధానం: ఉదాహారణకు నీ అన్నయ్య బట్టలు అశుభ్రం (నజిస్) గా ఉన్నాయి అలా అని అతడికి తెలిసి ఉండవచ్చు లేద తెలియకపోయి ఉండవచ్చు, కాని నీకు అన్నయ్య బట్టలు అశుభ్రమైనవి అని తెలుసు, అతడు షరా ఆదేశాల పట్ల విధేయత కలిగి ఉండవచ్చు లేదా అవిధేయత గా ఉండవచ్చు, అయితే ఆ తరువాత నీ అన్నయ్య ఎక్కడికో వెళ్లాడు కొంత సేపు తరువాత తిరిగి వచ్చాడు ఇక ఇప్పుడు నీకు అతడి బట్టలు శుభ్రమై ఉండవచ్చు అని అనుమానం వచ్చినా అతడి బట్టలు శుభ్రమైనవి అని భావించాలి.[1]
రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ26.
వ్యాఖ్యానించండి