విలాయత్ ఖుర్ఆన్‌లో

ఆది, 07/03/2022 - 17:38

హజ్రత్ అలీ(అ.స) యొక్క విలాయత్ ను వివరిస్తున్న మరియు నిదర్శిస్తున్న ఆయతుల సంక్షిప్త వివరణ...

విలాయత్ ఖుర్ఆన్‌లో

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

1. విలాయత్ ఆయత్
إِنَّمَا وَلِيُّكُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُمۡ رَٰكِعُونَ وَمَن يَتَوَلَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ فَإِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡغَٰلِبُونَ

అనువాదం: వాస్తవానికి మీ వలీ(అధికారులు, స్వామి, యజమాని) కేవలం అల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, నమాజులు స్థాపించే మరియు రుకూ స్థితిలో జకాత్ ఇచ్చే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తనూ, విశ్వాసులనూ తమ వలీయులుగా స్వీకరించే వాడు (అల్లాహ్ సైన్యంలో చేరారు) నిస్సందేహముగా అల్లాహ్ సైన్యమే ఆధిక్యమైనది.[ మాయిదహ్ సూరా:5, ఆయత్:55,56]

2. బల్లిగ్ ఆయత్
 يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ مَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُۥۚ وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ

అనువాదం: ఓ ప్రవక్తా‎!‎ నీ ప్రభువు తరపు నుండి నీ పై అవతరించబడ్డ దానిని (ప్రజలకు) అందజేయి మరియు ఒకవేళ నీవు ఆ విధంగా చేయకపోతే, (గుర్తుంచుకో) నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే మరియు (నీవు భయపడకు) ప్రజల బారి నుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు.[మాయిదహ్ సూరా:5, ఆయత్:67]

3. ఇక్మాల్ ఆయత్

ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا

అనువాదం: ఈ రోజు నేను మా దీన్ ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని ఇష్టానుసారమైనదిగా చేశాను.[మాయిదహ్ సూరా:5, ఆయత్:3]

ఈ మూడు ఆయతులను వివరిస్తూ ఉల్లేఖించబడిన రివాయతులు మరియు హదీసుల ప్రకారం ఈ మూడు ఆయతులు కూడా హజ్రత్ అలీ(అ.స) యే దైవప్రవక్త(స.అ) తరువాత వారి ఉత్తరాధికారి మరియు ఖలీఫా అని, వారే విశ్వాసుల నాయకుడని, అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ నిజమైన ఇమామ్ మరియు మార్గదర్శి అని తెలుస్తుంది.

ఈ ఆయతులు హజ్రత్ అలీ(అ.స)కి సంబంధించినవి అని కేవలం షియా ఉలమాలు మాత్రమే తమ గ్రంథాలలో నిదర్శించ లేదు. నిజానికి అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చాలా మంది ప్రముఖ ఉలమాలు మరియు చరిత్రకారులు దీనిని రచించారు. మరియు ఆ హదీసులను సహీ హదీసులని మరియు వాటిని షైఖైన్ అనగా బుఖారీ మరియు ముస్లిములు సమ్మతించిన రావీయుల క్రమం ద్వార నిరూపించబడినవి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఒక్క సారి మతపక్షపాతాన్ని ప్రక్కన పెట్టి కొంచెం దృష్టి పెట్టి ఈ ఆయతులను వివరిస్తున్న రివాయతులు మరియు హదీసులను చదివితే వారు యదార్థాన్ని తెలుసుకొని ఖచ్చితంగా రుజుమార్గాన్ని పొందుతారు అని మా గట్టి నమ్మకం.

అల్లాహ్ మనందరికి నిజమైన ఇస్లాం అనుచరులుగా తీర్చిదిద్దుగాక...

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12