ఇక్మాల్ ఆయత్ నిదర్శనం-2

ఆది, 07/24/2022 - 08:22

ఇది గదీరె ఖుమ్ లో అవతరించబడింది అని నిరూ పిస్తున్న కొన్ని కారణాల వివరణ...

ఇక్మాల్ ఆయత్ నిదర్శనం-2

అహ్లె సున్నత్‌లలో ప్రసిధ్ధి మరియు ప్రముఖులవ్వాలంటే కొలమానం హజ్రత్ అలీ(అ.స) మరియు అతని సంతానాన్ని ద్వేషించడం, ఎవరు ఎంత ద్వేషిస్తే అతను అంత పెద్ద హోదాను పొందుతాడు. హజ్రత్ అలీ(అ.స)తో యుధ్ధం చేసినా లేదా తన వచనలు మరియు ఖడ్గాలు అతనికి వ్యతిరేకంగా ఉంటే చాలు అమవీ మరియు అబ్బాసీయులు దగ్గర చేసుకునే వారు. ఈ కొలమానం పైనే సహాబీయులలో కొందరిని ఆకాశానికి ఎత్తేసే వారు మరి కొందరిని మట్టిలో కలిపేసే వారు, కవులలో కొందరిని ధనంతో నింపేసే వారు మరి కొందరిని చంపేసే వారు. హజ్రత్ ఉమ్ముల్ మొమినీన్, హజ్రత్ అలీ(అ.స)తో యుధ్ధం చేయకుంటే మరియు అతనిని ద్వేషించ కుంటే ఆమెకు ఆ హోదా దక్కేది కాదు.[1] 

అబ్బాసీయులు బుఖారీ, ముస్లిం మరియు ఇమామ్ మాలిక్‌ను చాలా కీర్తి ప్రతిష్టతలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టతలు చాలా తక్కువ లిఖించారు అంతేకాదు వాళ్ళ పుస్తకాలలో “అలీ(అ.స)కు ఎటువంటి ప్రతిష్టత గాని లేదా స్ధాయి గాని లేదు” అని స్పష్టంగా వ్రాశారు. అందుకే “సహీ బుఖారీ”లో “బాబొ మనాఖిబే ఉస్మాన్” అను అధ్యాయంలో “ఇబ్నె ఉమర్” వచనాన్ని లిఖించారు, అతను ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) కాలంలో మేము అబూబక్ర్‌కు సాటిగా ఎవరిని అనుకునే వాళ్ళం కాదు ఆ తరువాత ఉమర్ ఆ తరువాత ఉస్మాన్, ఆ తరువాత సహాబీయులందరూ సమానం ఎవరూ ఎవరిపై ఉత్తములు కారు.[2] అంటే ఇబ్నె ఉమర్ దృష్టిలో హజ్రత్ అలీ(అ.స) సాధారణ ప్రజల లాంటివారు. (చదవండి మరియు ఆశ్చర్యపడండి).

అలాగే ఉమ్మతె ముస్లిమహ్‌లో మరి కొన్ని తెగలు ఉన్నాయి ఉదా: మొతజిలహ్, ఖవారిజ్, మొ॥ వీళ్ళు షియా ముస్లింల విశ్వాసాలను నమ్మరు ఎందుకంటే అలీ(అ.స) మరియు అలీ(అ.స) సంతాన ఇమామత్ యొక్క విశ్వాసం ఖిలాఫత్ తాము సింహాసనానికి చేరడానికి మరియు ప్రజపై అధికారం చేయడం నుండి ఆపుతుంది, ప్రజల సొమ్ముపై ఇష్టం వచ్చినట్లు అధికారం చెలాయించడాన్ని నిరాకరిస్తుంది, ఎలాగైతే బనీ ఉమయ్యాహ్ మరియు బనీ అబ్బాస్‌లు, సహాబీయుల మరియు తాబెయీన్ల కాలంలో ఇష్టం వచ్చినట్లు చేశారు మరి ఆ ప్రవర్తన ఇప్పటికి మిగిలి ఉంది ఎందుకంటే ఎవరైతే అధికారంపై చేరాడో అది వారసత్వంగా అనగా రాజులు మరియు చక్రవర్తుల లేదా ప్రజలు అధికారంపై చేర్చినటువంటి అధికారులు కూడా ఈ(ఖిలాఫత్, అధికారం కేవలం అహ్లెబైత్(అ.స)ల హక్కు అనే) విశ్వాసాన్ని నమ్మే వారు కాదు. అంతేకాదు కేవలం షియా ముస్లింలు నమ్మేటువంటి చాలా అమూల్యమైన విశ్వాసాన్ని ముఖ్యంగా షియాలలో అమాయకులైన వారు, వాళ్ళ అమాయకత్వానికి హద్దు ఏమిటంటే వాళ్ళు, ప్రత్యేక్షించి అన్యాయాలతో అక్రమాలతో నిండి ఉన్న ఈ భూమిని న్యాయధర్మాలతో నింపే ఆ “మహ్‌దీ ముంతజర్” యొక్క ఇమామత్ మరియు నాయకత్వాన్ని నమ్ముతారు, అని హేళన చేసేవారు.

ఇక ఏది సరైనది మరియు దీన్ సంపూర్ణత్వం ప్రవచన ఉన్న ఆయత్ ఎప్పుడూ అవతరించబడింది? అని తెలుసుకోవడానికి మేము చాలా శాంతిగా మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా ఇరువైపు తెగల ప్రవచనాల పై చర్చిద్దాం. దానితో “మేము ఎవరిని ఆచరించాలి?” అని మనకు స్పష్టమౌతుంది. అలా చేయడం వల్ల ఇతరుల ఇష్టాఅయిష్టాలను లెక్క చేసే అవసరం ఉండదు. కాని ఒక్క షరతు; అన్నిటి కన్న ముందు మన దృష్టిలో అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన శిక్ష నుండి మోక్ష ఉండాలి. మోక్ష దినం ఇదీ: يَوۡمَ لَا يَنفَعُ مَالٞ وَلَا بَنُونَ إِلَّا مَنۡ أَتَى ٱللَّهَ بِقَلۡبٖ سَلِيمٖ

అనువాదం:‎ అప్పుడు సంపదగానీ, సంతానం వల్లగానీ ఏ లాభమూ కలగదు; ఏ వ్యక్తి అయినా మంచి మనస్సుతో అల్లాహ్ సాన్నిధ్యంలో హాజరైతే తప్ప[షుఅరా సూరా:26, ఆయత్:88,89]

يَوۡمَ تَبۡيَضُّ وُجُوهٞ وَتَسۡوَدُّ وُجُوهٞۚ فَأَمَّا ٱلَّذِينَ ٱسۡوَدَّتۡ وُجُوهُهُمۡ أَكَفَرۡتُم بَعۡدَ إِيمَٰنِكُمۡ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ وَأَمَّا ٱلَّذِينَ ٱبۡيَضَّتۡ وُجُوهُهُمۡ فَفِي رَحۡمَةِ ٱللَّهِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ

అనువాదం:‎ కొందరి ముఖాలు(సంతోషంతో) ప్రకాశిస్తూ ఉండేరోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయేరోజున, ఎవరి ముఖాలయితే నల్లబడిపోతాయో(వారితో ఇలా అనబడుతుంది): విశ్వాసౌభాగ్యం పొందిన తరువాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవలంభించారా? సరే, కృతఘ్నత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోరశిక్షను చవి చూడండి. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారికి అల్లాహ్ కారుణ్యచ్ఛాయలో చోటు లభిస్తుంది. అదేస్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు.[ఆలి ఇమ్రాన్ సూరా:26, ఆయత్:106]

రిఫరెన్స్
1. ఆయెషా, హజ్రత్ అలీ(అ.స) పేరు పలకడాన్ని కూడా ఇష్టపడే వారు కాదు. బుఖారీ, భాగం1, పేజీ 126లో, భాగం7, పేజీ18లో, భాగం5, పేజీ140లో చూడవచ్చు. చరిత్ర కారుల ప్రవచన ప్రకారం, హజ్రత్ ఆయేషాకు హజ్రత్ అలీ(అ.స) గారి మరణ వార్త తెలిసినప్పుడు ఆమె అల్లాహ్‌కు కృతజ్ఞత సాష్టాంగం చేసి ఒక కవితను చదివారు.
2. బుఖారీ, భాగం4, పేజీ 191, 201. మరి అలాగే  బుఖారీ భాగం 4, పేజీ 195 పై ఒక రివాయత్ ముహమ్మద్ బిన్ హనఫియ్యాహ్ ద్వార లిఖించబడి ఉంది: నేను నా తండ్రి(హజ్రత్ అలీ(అ.స))ని ప్రశ్నించాను; దైవప్రవక్త(స.అ) తరువాత అందరిలో ఉత్తములు ఎవరు? దానికి అతను ఇలా జవాబిచ్చారు: అబూబక్ర్. ఆ తరువాత నేను అబూబక్ర్ తరువాత అతను, ఉమర్, ఆ తరువాత ఉస్మాన్ పేరు చెబుతారేమో అని భయమేసి నేను ఇలా అన్నాను: ఆ తరువాత మీరేనా? ఐతే వారు ఇలా అన్నారు: నేను ముస్లిముల వలే మామూలు వ్యక్తిని.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20