హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) సమాధి దర్శనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న హదీసులు...
హిజ్రీ 60వ శకంలో అపకారి, త్రాగుబోతు, హింసకుడు మరియు నిర్దోషులను చంపిన ఘాతకుడు యజీద్, అప్పట్లో షామ్(సిరియా) అధిపతిగా ఉండేవాడు. ఇలాంటి నీచుడైన యజీద్ తనతో బైఅత్(అనగా తన అజ్ఞానుగుణంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం) చేయమని ఇమామ్ హుసైన్(అ.స) ను బెదిరించాడు. దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) ఉత్తరాధికారి మరియు ముస్లిముల ఇమామ్ అయిన ఇమామ్ హుసైన్(అ.స) యజీద్ లాంటి వాడితో ప్రమాణానికి సిధ్ద పడలేదు. అందుకు యజీద్ సైన్యం, వారి పై దాడి చేసి 1400 సంవంత్సరాల క్రితం ముహర్రం నెల 10వ తారీకు హిజ్రీ శకం 61వ సంవత్సరంలో కర్బలా భూమి పై మూడు రోజుల పాటు అన్నపానియాలకు దూరంగా ఉంచి వారిని, వారి ప్రాణ స్నేహితులను, అన్నదమ్ములను, వారి కుమారులను, చివరికి 6 నెలల పసిబిడ్డను బాణాలతో, ఖడ్గాలతో అన్యాయంగా నరికి చంపేశారు. ఆ తరువాత వారి స్త్రీల డేరాలకు నిప్పంటించారు. వారిలో జ్వరంతో వున్న ఇమామ్ హుసైన్(అ.స) కుమారునికి కాళ్ళూ చేతులలో సంకెళ్ళు మెడలో ముళ్ళకంఠహారం వేసి, మిక్కిలి క్షోభతో నిస్సాహాయులుగా మిగిలివున్న ప్రవక్త ముహమ్మద్(స.అ) కుటుంబ స్త్రీలను మరియు చిన్న పిల్లలను బంధించి అవమానించడానికై ఒక పట్టణం నుండి మరో పట్టణానికి త్రిప్పారు.
ఆ యుద్ధభూమిలో అన్యాయంగా చంపబడ్డ ఇమామ్ హుసైన్(అ.స) యొక్క దర్శనం యొక్క పుణ్యం గురించి రివాయతులలో చాలా తాకీద్ చేయబడి ఉంది.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇమామ్ హుసైన్(అ.స) దర్శనం గురించి ఇలా ప్రవచించారు:
مَنْ أَرَادَ اللَّهُ بِهِ الْخَيْرَ قَذَفَ فِي قَلْبِهِ حُبَّ الْحُسَيْنِ )ع (وَ حُبَّ زِيَارَتِهِ وَ مَنْ أَرَادَ اللَّهُ بِهِ السُّوءَ قَذَفَ فِي قَلْبِهِ بُغْضَ الْحُسَيْنِ وَ بُغْضَ زِيَارَتِهِ
అనువాదం: "అల్లాహ్ ఎవరికైనా మంచి చేయాలనుకుంటే అతని హృదయంలో హుసైన్[అ.స] పట్ల మరియు అతని దర్శనం పట్ల ప్రేమను వేస్తాడు. (మరి అదే ఒకవేళ) అల్లాహ్ ఎవరికైనా చెడు చేయాలనుకుంటే అతడి మనసులో హుసైన్(అ.స) పట్ల మరియ అతని దర్శనం పట్ల ద్వేషాన్ని వేస్తాడు".[1].
“జైద్ బిన్ షహ్హామ్” ఇలా అన్నారు: నేను ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) వద్దకు వెళ్ళినప్పు “ఇమామ్ హుసైన్[అ.స] దర్శనం యొక్క ప్రతిఫలమేమిటి?” అని అడిగాను. ఇమామ్ ఇలా అన్నారు: “كَمَنْ زَارَ اللَّهَ فِي عَرْشِهِ అతను నింగిలో అల్లాహ్ ను దర్శించుకున్నట్లే” నేను ఇలా అన్నాను: అయితే మీలో మిగిలిన వారి దర్శనం యొక్క ప్రతిఫలం? ఇమామ్ ఇలా అన్నారు: “كَمَنْ زَارَ رَسُولَ اللَّهِ صلى الله عليه وآله అతను దైవప్రవక్త[స.అ] ను దర్శించుకున్నట్లే.[2].
ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) ఉల్లేఖనం: زیارَةُ الحُسَینِبنِ عَلِی واجِبَةٌ عَلی کل مَنْ یقرُلِلحُسَینِ بِالا مامَةِ مِنَاللهِ عَزوَجَل
అనువాదం: “హుసైన్ ఇబ్నె అలీ(అ.స) యొక్క దర్శనం, వారిని అల్లాహ్ తరపు నుండి పంపబడ్డ ఇమామ్ అని భావిస్తాడో అతడి పై వాజిబ్”[3]
సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జియారత్ ను చదవమని సిఫారసు చేయబడి ఉంది. అలా చేయడం ద్వార చాలా పుణ్యం లభిస్తుంది. వారి దర్శనానికి వెళ్ళేవారు ఆ ప్రత్యేక రోజులలో అక్కడ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ రోజులలో ఒకవేళ “కర్బలా” లో ఉండే భాగ్యం లేనప్పుడు దూరం నుండి కూడా వారి జియారత్ పత్రాన్ని చదవగలరు, ఇలా చేయడం కూడా పుణ్యానికి కారణం. ఆ రోజుల క్రమం:
1. షబే జుమా మరియు రోజే జుమా
2. ప్రతీ నెల మొదటి, మధ్య మరియు చివరి తారీఖు
3. “ఆషూరహ్” రోజు
4. రజబ్ నెల మొదటి మరియు 15వ తారీఖు
5. వారి జన్మదినం అయిన షాబాన్ నెల 3వ తారీఖు
6. షబే నీమయే షాబాన్ (షాబాన్ నెల 14వ తారీఖు రాత్రి)
7. షబే ఖద్ర్ (రాత్రుళ్ళ) లలో
8. ఈదుల్ ఫిత్ర్ రోజు
9. అరఫహ్ రోజు
10. ఈదే ఖుర్బాన్ రోజు
11. ముబాహలహ్ రోజు (జిల్ హిజ్ నెల 24వ తారీఖు)[4]
రిఫ్రెన్స్
1. కామిలుజ్జియారాత్, పేజీ142.
2. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, దారుల్ అహ్యాయిత్తురాస్, 1403.
3. వసాయిల్ అల్ షియా, భాగం10, పేజీ346; అమాలీ అల్ సదూఖ్, పేజీ123. ఈ హదీస్ ఇతర గ్రంథాలలో కూడా కొంచెం మార్పులతో ఉల్లేఖించబడి ఉంది.
4. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, బాబ్ 12-14, పేజీ85-104 మరియు కామిలుజ్జియారాత్, బాబొ 70-74, పేజీ186-201.
వ్యాఖ్యానించండి